మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
గత ప్రభుత్వం లో మంత్రి గా పని చేసిన టీడీపీ నేత అయిన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారిని AP కి చెందిన సి ఐ డి పోలీస్ లు హైదరాబాద్ లోని కొండాపూర్ లోని నారాయణ గారి స్వగృహం నందు మే 10 వ తారీకున అనగా మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ అరెస్ట్ కి కారణం ప్రశ్న పత్రాల లీకేజీ విషయం లో భాగంగా, విచారణ నేపథ్యం అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం ఉంది.
ఈ విషయం పై విచారనే కాకుండా గతం లో అమరావతి లోని రాజధాని భూముల CRDA కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటూనే వున్నారు.కాబట్టి ఈ నేపథ్యంలో కూడా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఇప్పటివరకు వరకు ఉన్న సమాచారం.
ముఖ్యంగా నారాయణ స్కూల్ నుండే 10 వ తరగతి కి సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు ఈ మధ్య కాలంలో అంటే ఈ నెల 5 తారీఖున ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి నారాయణ విద్యా సంస్థ కి చెందిన గిరిధర్ రెడ్డి కూడా అరెస్ట్ అవడం జరిగింది. ఈ గిరిధర్ రెడ్డి వాట్సాప్ నుండి తెలుగు పేపర్ వివిధ వ్యక్తులకు చేరవేసినట్టు కూడా సమాచారం ఉండడంతో ఇప్పటికే చిత్తూరు జిల్లా CID అధికారులు కేసు కూడా నమోదు చేశారు.
అదేవిధంగా ఈ రోజు ఉదయం నారాయణ విద్యా సంస్థలు అధిపతి అయిన నారాయణ గారిని హైదరాబాద్ కొండాపూర్ నుంచి అరెస్ట్ చేసి చిత్తూర్ CID కార్యాలయానికి తరలించినట్టు తెలిసింది., హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్, కర్నూల్ మీదుగా నారాయణ ని తరలిస్తున్నారు.
0 Comments