![]() |
10 వ తరగతి విద్యార్థులు కి బెటర్మెంట్ పరీక్ష-2022 |
ఈ పేజీ లో వివరించుకోబోయే అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- ఈ బెటర్మెంట్ పరీక్షకు అప్లై చేసుకునే విధానము
- బెటర్మెంట్ పరీక్షకు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు
- ఈ పరీక్ష అప్లై కి చివరి తేదీలు
ప్రభుత్వం ఇచ్చిన G.O లు కూడా ఈ పేజీ లో ఇస్తున్నాను.
- Press Note SSC Betterment Examination 2022 PDF
- Instruction For Betterment PDF
బెటర్మెంట్ పరీక్ష : ఆంద్రప్రదేశ్ కి సంబంధించిన పదవ తరగతి విద్యార్థులు కి ఈ సంవత్సరం ఏప్రిల్ 2022 లో పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సాధించిన వారికి మార్కుల శాతం తక్కువ అని భావించిన విద్యార్థులు కి ఇదొక సువర్ణావకాశం గా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఈ సప్లమెంటరీ పరీక్షలలో రాస్తున్న విద్యార్థులుతో పాటు ఈ బెటర్మెంట్ పరీక్ష కూడా వ్రాసి ఆయా సబ్జెక్టు లలో మెరుగైన మార్కులు సాధించవచ్చును.
ఈ బెటర్మెంట్ పరీక్ష కి సంబంధించిన నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
1) 10 వతరగతి లో ఏవేని రెండు సబ్జెక్టులకు మాత్రమే బెటర్మెంట్ పరీక్ష వ్రాసుకునే అవకాశం ఉంటుంది.
2) ఈ పరీక్ష వ్రాసే అవకాశం ఈ 2022 వ సంవత్సరం లో ఉత్తేర్ణత సాధించిన విద్యార్థులు కి మాత్రమే.
3) ఆ విద్యార్థికి గతం లో వచ్చిన మార్కులు 50 లోపల అంటే 49 మార్కులు గానీ లేదా అంతకంటే తక్కువ గానీ వచ్చి ఉన్న ఏవేని రెండు సబ్జెక్టులకు మాత్రమే అవకాశం కల్పించారు.
4) ఈ బెటర్మెంట్ పరీక్షలకి ఒక్కో సబ్జెక్టు కి (రెండు పేపర్లు కలిపి) రూ 500/- లు గా ఫీజుని నిర్ణయించి, అదేవిధంగా రెండు సబ్జెక్ట్స్ కి అయితే రూ 1000/- లు అవుతుంది.
ఈ బెటర్మెంట్ పరీక్షకు అప్లై చేసుకునే విధానము
STEP 1: ముందుగా ఆ స్కూల్ యొక్క H.M లాగిన్ నందు పైన "Application For Betterment Examination" అనే ఆప్షన్ ఉంటుంది.
STEP 2: ఈ పేజీ నందు ఏయే సబ్జెక్టు లలో 50 మార్కుల కన్నా తక్కువ మార్కులు వచ్చాయో, ఆ విద్యార్థుల పేర్లు అన్ని కూడా ఓపెన్ అవుతాయి.
STEP 3 : ఆ ప్రక్కనే చెక్ బాక్స్ ఖాళీగా కనిపిస్తుంది. అక్కడ ఏ విద్యార్హి అయితే బెటర్మెంట్ పరీక్ష వ్రాయదలచారో ఆ విద్యార్థి ని సెలెక్ట్ చేసుకొని, ఆ ప్రక్కనే ఏ రెండు సబ్జెక్ట్ లకు బెటర్మెంట్ కోరుకుంటున్నాడో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి.
STEP 4 : ఇక్కడ ఎంత ఫీజు వారు ఎంచుకున్న సబ్జెక్ట్స్ ని భట్టి అంటే ఒక పరీక్షకు మాత్రమే అయితే రూ 500/- రెండూ పరీక్షలు అయితే రూ 1000/- కట్టాల్సి ఉంటుంది.
STEP 5 : ఈ విధంగా ఎంచుకున్నాక ఒక్కొక విద్యార్థి కి వేరుగా అయినా ఫీజు ని కట్టుకోవచ్చు.లేదా స్కూక్ ఎంత మంది వ్రాస్తున్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని "Batch Of Students at Once" అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని కూడా ఫీజు కట్టువచ్చు.
Press Note SSC Betterment Examination 2022 PDF
0 Comments