ఈ పేజీ నందు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి వాలంటీర్ దగ్గర ekyc ఎలా చేసుకోవాలోతెలుసుకుందాం!
ఆంధ్రప్రదేశ్ నందు రాష్ట్ర ప్రభుత్వం స్వంత ఇల్లు లేని పేదవాడు ఎవ్వరూ ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో దాదాపు 31లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, వాటిలో 20 లక్ష ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతున్నాయి.కాబట్టి ఇంకా ఎవరైనా అర్హత ఉంటే సచివాలయం లో వెళ్లి మీ వాలంటీర్ ద్వారా దరఖాస్తు చెసుకోవచ్చును.ఈ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలి.దరఖాస్తు చేసుకున్నాక ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని 90 రోజుల్లో ఇళ్ల పట్టా మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేశారు.ఆ తరువాత పట్టా ని జూన్ లేదా డిసెంబర్ లో ఆ లబ్ధిదారుని చేతికి అందిస్తారు.
ఇలాంటి సరిక్రొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే ఈ క్రింది వాట్సప్ గ్రూప్ నందు జాయిన్ అయి పొందవచ్చును.
వాలంటీర్ దగ్గర ఇళ్లకు సంబంధించి ekyc ఎందుకు చేసుకోవాలి ?
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళులేని నిరుపేదలకు అందరికి పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు.కానీ ఇంకా కొన్ని చోట్ల చేతికి పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం అలాంటి లబ్ధిదారుల వివరాలు మరియు ప్రస్తుతం ఆ లబ్ధిదారులలో ఎంతమంది బ్రతికి వున్నారు,లేదా ఎవరైనా చనిపోయి వున్నారా అని వివరాలు సేకరిస్తున్నారు.దీనికి గానూ వాలంటీర్స్ కి Beneficiary Outreach App 6.1 అనే మొబైల్ యాప్ ఇవ్వడం జరిగింది.కాబట్టి ఈ సర్వే లో ముఖ్యంగా 3 రకాల వివరాలు సేకరిస్తున్నారు.అవి ఏమిటంటే..
1) LIVE
2) DEATH
3) NOT RECEIVED HOUSE SITE PATTA
APP 6.1 DOWNLOAD
DASH BOARD CHECKING
ఇప్పటివరకు ఇంటి పట్టాలకు సంబంధించి ఎంతమందికి ekyc పూర్తి అయినదో మనం ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చును.ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ekyc చేసేటప్పుడు ఫోటో ఎవరిది తీసామో అనికూడా ఇక్కడే చూసుకునే వెసులుబాటు కల్పించారు.దీనికి ఎలాంటి లాగిన్ అవసరం లేకుండా ఎవ్వరైనా చూసుకోవచ్చును.కాకపోతే మీ వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐ.డీ తెలిసివుండాలి.
ఇళ్ల పట్టాల కి సంబంధించి వాలంటీర్ యొక్క మొబైల్ యాప్ నందు ekyc చేయి విధానం వీడియో రూపంలో కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు
వాలంటీర్ యొక్క యాప్ లో సర్వే చేయు విధానము
House Site Data : ఇందులో ఆ వాలంటీర్ హౌస్ మాపింగ్ ఆధారంగా Tidco ఇళ్లకు సంబంధించి గానీ అదేవిధంగా హౌస్ సైట్స్ కి సంబంధించిన లబ్ధిదారుల పేర్లు కనిపిస్తాయి.కాబట్టి ఖచ్చితంగా వారికందరికి ekyc చేయాల్సి ఉంటుంది.
Search: ఒకవేల ఇందులో పేరు కనిపించనప్పుడు ఆ మహిళ యొక్క ఆధార్ నెంబర్ తో Search చేస్తే వివరాలు వస్తాయి.
ఇళ్ల పట్టా పొంది,ప్రస్తుతం జీవించి ఉన్నవారికి EKYC చేయు విధానము
ఇక్కడ మొదటగా House site Data లో గానీ లేదా Search ద్వారా వచ్చిన లబ్ధిదారుని వివరాలు చెక్ చేసి అక్కడ Select Beneficiary Status అనే ఆప్షన్ దగ్గర LIVE అనే ఆప్షన్ ఎంచుకుని, ఆ క్రింది ఉన్న Select Household Name For ekyc ఆప్షన్ లో లబ్ధిదారులు అయినా లేదా ఇతర కుటుంబ సభ్యులు అయినా ఎవరు అందుబాటులో ఉంటే వారి పేరు ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ప్రభుత్వం నుండి పొందిన పట్టా పట్టుకుని నిల్చుంటే వాలంటీర్ ఫోటో తీసుకుని మరియు వారి దగ్గర బయోమెట్రిక్ కూడా వేయించుకుంటారు
ఇళ్ల పట్టా పొంది, ప్రస్తుతం చనిపోయి ఉంటే సర్వే చేయు విధానము
ఇందులో మనం ఇంతకు ముందు చెప్పిన విధంగా SelectBeneficiary Status అనే ఆప్షన్ దగ్గర DEATH అనే ఆప్షన్ ఎంచుకుని, ఆ తర్వాత వాలంటీర్ ఆమోదం తెలిపినట్టు వాలంటీర్ బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేస్తారు.
ఇంటి పట్టా ఇంకా పొందని వారికి ekyc చేయు విధానము
ఇక్కడ కూడా పైన చెప్పిన విధముగా ఆ కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్నాక,అక్కడ సెలెక్ట్ Beneficiary Status ఆప్షన్ దగ్గర Not Received House Site Patta అనే ఆప్షన్ ఎంచుకుని ఆ తర్వాత ఉన్న
Select Household Name For ekyc ఆప్షన్ లో లబ్ధిదారులు అయినా లేదా ఇతర కుటుంబ సభ్యులు అయినా ఎవరు అందుబాటులో ఉంటే వారి పేరు ని సెలెక్ట్ చేసుకొని, వారిని నిల్చోబెట్టి ఒక ఫోటో తీసుకుని,మరియు వారి దగ్గరే బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు.
ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చిన ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రజలందరూ అవగాహన చేసుకుని సరైన వివరాలు పొందుపరచి తద్వారా అందరూ లబ్ది పొందాలని కోరుకుంటూ ..
ఇట్లు
మీ మునిరత్నం
0 Comments