Rice card ekyc status check by whats app
ఆంధ్రప్రదేశ్ లో క్రొత్తగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. కనుక దీనికి సంబంధించి రైస్ కార్డులో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు తప్పనిసరిగా ekyc చేసుకొని ఉండాలి అనే నిబంధన అయితే ప్రభుత్వం తెచ్చింది.
ఇప్పుడు మనం ఈ పేజీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన Whats App Governance నందు మీ కుటుంబ రైస్ కార్డులో ఎంత మంది సభ్యులకు ekyc అయినది మరియు ఇంకా ఎంతమందికి పెండింగ్లో ఉన్నది అనే విషయాన్ని సులభంగా మీ ఫోన్ లోనే చెక్ చేసుకోవడం ఎలాగో చూద్దాం.
మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం Whats App Governance కి సంబంధించి ఈ క్రింది నెంబర్ ని అందుబాటులో ఉంచింది. కనుక ఈ నెంబర్ ని ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన పేరుతో మీ ఫోన్ లో Save చేసి పెట్టుకోండి.
Whats App Governance Number
9552300009
Step 1 - ఆ పైన ఇచ్చిన నంబర్ ని సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ లో ఓపెన్ చేసుకొని HI అనే type చేసి send చేయాలి.
Step 2 - ఇక్కడ ప్రభుత్వం నుండి ఈ క్రింది విధంగా ఒక సమాచారం వస్తుంది. అక్కడ "సేవను ఎంచుకోండి" అనే Option వస్తుంది.
Step 3 - ఇక్కడ దయచేసి ఏదైనా ఒక సేవని ఎంచుకోండి అనే ఆప్షన్ చూపిస్తుంది.
Step 4 - ఇక్కడ మనం "సివిల్ సప్ప్లై" అనే విభాగాన్ని ఎంచుకోవాలి.
Step 5 - ఇక్కడ ఈ క్రింది విధంగా మూడు ఆప్షన్లు చూపిస్తుంది.
Step 6 - ఇక్కడ చివరన వున్న "రైస్ ekyc స్థితి" అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
Step 7 - ఇక్కడ మీ రైస్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి "నిర్ధారించండి" అనే దానిమీద క్లిక్ చేసుకోవాలి.
Step 8 - ఇక్కడ మనకి కావాల్సిన సమాచారాన్ని ఇస్తూ, ఇక్కడ ఆ రైస్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు మరియు ఎంతమందికి E Kyc పూర్తి అయినది / కాలేదు అని స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్లో రైస్ కార్డు ఈ కేవైసీ చివరి తేదీ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైస్ కార్డులో ఉన్న సభ్యులకు ఈ కేవైసీ కొరకు జూన్ 7 వరకు అవకాశం కల్పించినది. (బహుశా పెంచే అవకాశం కూడా ఉండచ్చు / ఉండకపోవచ్చు )
రైస్ కార్డు ఈ కేవైసీ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు?
1) మీ దగ్గరలోని రేషన్ షాపు నందు
2) మీ సచివాలయంలోని సచివాలయ సిబ్బంది యొక్క Mobile App ద్వారా (VRO, PS, DA, మహిళా పోలీస్)
ముఖ్య గమనిక - రైస్ కార్డులో 5 సంవత్సరాల లోపు పిల్లలకు గానీ అదేవిధంగా 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు గాని ఈ కేవైసీ అవసరం లేదు.
Related Links
Rice Card Ekyc Status Check - 2 Method Video
1) AEPDS Site - https://epos.ap.gov.in/aepds/api/repos/%3Ahome%3Aadmin%3AAePDS.wcdf/generatedContent
2) EPDS Site - https://epds2.ap.gov.in/
0 Comments