చోరీ నేరస్తుల అరెస్ట్ – బంగారు నగలు, మోటార్ సైకిళ్లు స్వాధీనం
MR News Telugu
రిపోర్టర్ - మద్దిమడుగు మునిరత్నం
ఈ రోజు తిరుపతి క్రైమ్ పోలీసులు పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆదనపు ఎస్పీ లు క్రైమ్ విభాగం నాగభూషణరావు మరియు శాంతి భద్రతలు విభాగం రవి మనోహర్ ఆచారి పాల్గొని కేసు వివరాలను వివరంగా వెల్లడించడం జరిగినది.
నిందితుల యొక్క వివరాలు
(బ్యాగు దొంగతనాలు చేసిన నిందితులు)
1) A-1: ఎస్. జ్యోతి, 32 సంవత్సరాలు, భర్త పేరు ఎస్. పార్తిబన్.
2) A-2: వి.నందిని, 30 సంవత్సరాలు, భర్త పేరు వి.వినోద్
3) A-3: ఎ. ప్రియ, 26 సంవత్సరాలు, భర్త పేరు అరుణ్ (లక్ష్మీపురం గ్రామం, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా)
వీరిపై ఇదివరకే విశాఖపట్నం, మల్కాపురం, కోడూరు, అలిపిరి, తమిళనాడు ప్రాంతాలలో పాత కేసులు నమోదై ఉన్నాయని తెలియజేసారు.
మోటార్ సైకిళ్ల దొంగలు
1) A-1: కొండరాజు రత్తయ్య @ రత్తయ్య, 29 సం., తండ్రి పేరు లేట్ కె. చిన్న వెంకటయ్య,కొండరాజుపల్లి గ్రామం, సి.ఎస్.పురం మండలం, ప్రకాశం జిల్లా
2) A-2: కందన్ సాయి @ ఆటో సాయి, 28 సం., తండ్రి పేరు పి. కందన్, బండ్ల వీధి, తిరుపతి టౌన్.
వీరిపై కూడ ఇదివరకే తిరుపతి, పుత్తూరు, గాజులమండ్యం, పాకాల, కార్వేటినగరం, కడప, నెల్లూరు జిల్లాలలో పాత కేసులు నమోదు అయి ఉన్నాయన్నారు.
ఈ కేసు వివరాలు
బస్ స్టాండ్లు మరియు ప్రయాణికుల గుమికూడే ప్రాంతాలలో జరుగుతున్న బ్యాగు దొంగతనాలు, మోటార్ సైకిల్ చోరీలను అరికట్టడంలో భాగంగా, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, తిరుపతి CCS అదనపు ఎస్పీ నాగభూషణం రావు గారి పర్యవేక్షణలో, CCS డీఎస్పీ శ్యామ్ సుందరం నేతృత్వంలో,ఇన్స్పెక్టర్లు వి. చిన్న పెద్దయ్య, ఎన్. శివకుమార్ రెడ్డి, జి. ప్రకాష్ కుమార్,ఎస్.ఐలు ప్రదీప్ కుమార్ రెడ్డి, సుబాన్ నాయక్ తో కూడిన బృందాలు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి సమాచారం సేకరించారు. దీని ఫలితంగా, 18-10-2025 ఉదయం 8.00 గంటలకు తిరుపతి జయాశ్యామ్ రోడ్డులో పై ముగ్గురు మహిళా నిందితులను, తరువాత 9.00 గంటలకు నెహ్రూ హైస్కూల్ గ్రౌండ్ సమీపంలోని రోడ్డులో మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేయడమైనది. ప్రయాణీకుల బ్యాగులలోని బంగారు నగలను మరియు మోటార్ సైకిల్ లను దొంగతనం చేస్తున్న దొంగలను క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసి, వారి వద్ద నుండి సుమారు 230 గ్రాముల బంగారు నగలు, 04 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకోవడమైనది. స్వాధీనం చేసిన మొత్తం సొత్తుల విలువ సుమారు 25 లక్షలు వరకు ఉంటుందన్నారు.
ఈ కేసు ఛేదనలో విశేష ప్రతిభ కనబరిచిన CCS ఇన్స్పెక్టర్లు చిన్న పెద్దయ్య, శివకుమార్ రెడ్డి, ప్రకాష్ కుమార్ ఎస్.ఐలు: ప్రదీప్ కుమార్ రెడ్డి, సుబాన్ నాయక్, క్రైమ్ పార్టీ సిబ్బంది: ASIs మురళి, వెంకటేశ్వరరావు, HCs మునిరాజులు, విశ్వనాధం, రవిప్రకాశ్, వసంతకుమార్ PCs మోహన్, రమేష్, దాము, నాగరాజా శెట్టి వీరందరిని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు రివార్డులు అందజేయనున్నట్టు తెలిపారు.
0 Comments