Open School Students Hall Tickets Download -2022

A.P. ఓపెన్ స్కూల్ సొసైటీ : కొంతమంది చదువు కోవాల్సిన వయస్సులో పేదరికం వల్లనో లేదా ఇంకేదైనా కారణాల వల్లనో చదువుని మధ్యలో ఆపేసి, వివిధ రకాలైన పనులకు వెళ్లి పోవడం లేదా వివాహము చేసుకోవడం ఇలా చాలా కారణాలతో చదువు కోవాలన్న ఆశని కూడా అర్థాంతరంగా ఆపేసి వుంటారు.కానీ ఇప్పుడు బాల, బాలికలు ఎవ్వరైనా, ఏ వయస్సులో వున్నా కూడా ఇంకా చదువు కోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తోడుగా ఉంటూ ఈ ఓపెన్ స్కూల్ లను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే 10 వ తరగతి నుండి డిగ్రీ చదువుల వరకు వయస్సుతో నిమిత్తము లేకుండా ఎక్కువ శాతం ఇంటి దగ్గర నుండే చదువుకునే అవకాశాన్ని ఇస్తూ, వారికి తగిన రీతిలో ఉచితం గా బోధనలు కూడా చేస్తూ ప్రభుత్వాలు ఎల్లపుడూ తోడుగా వుంటాయి.
అదే విధంగా ఈ సంవత్సరానికి సంబంధించి {2021-22} 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులుకు ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు జరగనున్నాయి.వాటికి సంబంధించి Online లో ఉచితంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.
ఈ పేజీ నందు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్ధాం
10 వ తరగతి పరీక్షలు వ్రాసే వారికి పరీక్ష తేదీ వివరాలు {Time Table}
10 వ తరగతి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయు విధానం
APOSS అధికారిక వెబ్సైట్ లింక్ : CLICK HERE
10 TH CLASS HALL TICKET DOWNLOAD LINK
పై లింక్ పై క్లిక్ చేశాక ఏ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.ఇందులో APOSS SSS Hall Tickets అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరొక పేజీ లొకి వెళుతుంది.
PAGE -2
ఈ పేజీ నందు 3 ఆప్షన్స్ వుంటాయి.
1) జిల్లా ని ఎంచుకోవాలి ( పాత జిల్లాలు మాత్రమే ఎంచుకోవాలి)
2) స్కూల్ ని ఎంచుకోవాలి
3) అందులో మీ పేరుని ఎంచుకున్న తర్వాత Download Hall Ticket పై క్లిక్ చేయాలి.
DEMO VIDEO
Hall Ticket నమూనా ఈ క్రింది విధంగా ఉంటుంది
ఇంటర్మీడియట్ వారికి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయు విధానం
Intermediate పరీక్షలు వ్రాసే వారికి పరీక్ష తేదీ వివరాలు {Time Table}
HALL TICKET DOWNLOAD LINK : ఈ పేజీ నందు Aposs Inter Hall Tickets అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
తరువాత ఈ పేజీ నందు 3 ఆప్షన్స్ వుంటాయి.
1) జిల్లా ని ఎంచుకోవాలి ( పాత జిల్లాలు మాత్రమే ఎంచుకోవాలి)
2) స్కూల్ ని ఎంచుకోవాలి
3) అందులో మీ పేరుని ఎంచుకున్న తర్వాత Download Hall Ticket పై క్లిక్ చేయాలి.
DEMO VIDEO
Hall Ticket నమూనా ఈ క్రింది విధంగా ఉంటుంది
పై సమాచారం పై మీకు ఎటువంటి సందేహాలు వున్నా మరియు మీ అభిప్రాయాలు చెప్పదలచుకున్నా క్రింద Comment ఆప్షన్ ద్వారా తెలుపగలరు. నన్ను సంక్షేమ పథకాల సందేహాలు కొరకు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ లింక్ ద్వారా మాట్లాడవచ్చును.
0 Comments