పోస్టల్ జాబ్స్ కి అప్లై చేయు విధానం - 2022
కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా ఇచ్చే నోటిఫికేషన్ లలో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇస్తూవుంటారు.అందులో భాగంగానే ఈ సంవత్సరం 10 వతరగతి అర్హతతో దాదాపు 38,926 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.
నోటిఫికేషన్ లింక్ : CLICK HERE
మీ జలాల్లో ఉన్న ఖాళీలు - డివిజన్ వారీగా పోస్టులు
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వెబ్సైట్ : CLICK HERE
ఈ జాబ్ నకు అప్లై చేయాలంటే ఈ మూడు విభాగాలుగా చేయాల్సి ఉంటుంది
- రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి
- ఫీ కట్టుకునే పద్దతి
- జాబ్ కి అప్లై చేసే పద్దతి
అప్లై చేసే ముందు కావలసిన డాకుమెంట్స్
- ఫోటో 50 kb లోపు ఉండాలి
- సంతకం 20 kb లోపు ఉండాలి
- మొబైల్ నెంబర్
- ఈ - మెయిల్
- 10 వ తరగతి మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకోండి
(పైన చెప్పిన ఫోటో సైజ్ తగ్గించుటకు ఈ విధానం లో కూడా చేసుకోవచ్చు)
మీ సౌకర్యం కోసం కావాలంటే
వీడియో డెమో : ఈ వీడియో లో 4.15 నుండి ఇక్కడ 6.00 వ నిమిష0 వరకు చూసి,దానిని నేర్చుకుని ఆ విధంగా సైజ్ తగ్గించుకుని రెడి చేసి పెట్టుకోండి
ఈ పోస్టులకు 3 విభాగలలో చేసుకోవాల్సి ఉంటుంది
- రిజిస్ట్రేషన్
- ఫీజు చెల్లింపు
- దరఖాస్తు
రిజిస్ట్రేషన్ : దీనికి సంబంధించిన లింక్ క్రింది విధంగా ఉంటుంది.
ఈ పేజీ నందు మీ వ్యక్తిగత వివరాలు 10 వతరగతి మార్క్ లిస్ట్ లో ఏవిధముగా ఉందొ అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
STEP : 1
పైన ఫోటో లో చూపించిన విధంగా మొదట మీ మొబైల్ నెంబర్ (మొబైల్ లేకపోతే,ఇంట్లో ఎవరిదైనా కూడా ఇవ్వవచ్చు)మరియు ఈమెయిల్ ఎంటర్ చేసి ప్రక్కన ఉన్న Validate పై క్లిక్ చేస్తే OTP లు వస్తాయి అవి ఇచ్చి సబ్మిట్ చేస్తే సక్సెస్ అని వస్తాయి.ఆ తరువాత మన వివరాలు మరియు ఫోటో మరియు సంతకం చేసిన ఫోటో లను అప్లోడ్ చేయాలి. క్రింద CAPCHA ఇచ్చి సబ్మిట్ చేస్తే మరలా మరి కొన్ని వివరాలు ఇచ్చాక మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.దానిని జాగ్రత్తగా పెట్టుకోండి
ఫీ కట్టుకునే పద్దతి : BC, OC లోని వర్గాలలో ఉన్న పురుషులు మాత్రమే రూ.100/- కట్టాల్సి వుంటుంది.
గమనిక : ఏ కులాలలోని మహిళలకు అయినా, మరియు SC,ST,
(పురుషులు,మహిళలు)ట్రాన్సజెండర్ లకు అయినా ఫీ కట్టాల్సిన అవసరం లేదు..ఇది పూర్తిగా ఉచితం.
Fee Payment link : CLICK HERE
ఈ లింక్ ఓపెన్ చేశాక ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ ఇంతకుముందు మనకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.
ఆ తరువాత Make Payment ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజు కట్టాల్సిఉంటుంది.
పేమెంట్ చేయుటకు 5 అవకాశాలు
నెట్ బ్యాంకింగ్ - రూ 10 చార్జీ అవుతుంది
క్రెడిట్ కార్డ్ - 1% చార్జీ అవుతుంది
డెబిట్ కార్డ్ Rupay (ATM) - చార్జీలు ఏమి ఉండవు
డెబిట్ కార్డ్(Master/Visa) - 0.9%
UPI - ఎలాంటి చార్జీలు ఉండవు.
కాబట్టి ఎక్కువ శాతం UPI ద్వారా పేమెంట్ చేసేయండి. సులువుగా ఉంటుంది
జాబ్ కి అప్లై చేయు పద్దతి :
APPLY STATUS LINK : CLICK HERE
దీనిలో ఎక్కువ మందికి చాలా సందేహాలు వస్తున్నాయి.కాబట్టి ఎక్కడ ఎక్కువ సందేహాలు వస్తున్నాయో వాటిపై కొంచెం వివరంగా చెప్పుకుందాం
పై లింక్ ఓపెన్ చేయగానే పేజీ పై రకముగా ఒపెన్ అవుతుంది
ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయగా OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి CAPTHA పై క్లిక్ చేసి నెక్స్ట్ పేజీ కి వెళతారు.
ఈ పేజీ ఈ క్రింది విధంగా ఉంటుంది
Qualification Details ఎంటర్ చేయాలి
ఎక్కువ మందికి సందేహం వచ్చే అంశాలు ఇవే
Select Board: ఈ ఆప్షన్ దగ్గర మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే వద్దు,ఎందుకంటే మీరు ఏ సంవత్సరం లో 10 వతరగతి పాస్ అయ్యారో ఆ సంవత్సరం ఉన్న దానిని సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది.
కొంచెం వివరంగా చెప్పాలంటే : 2011 సంవత్సరం కి ముందు పాస్ అయిన వారికి మార్కుల రూపం లో సర్టిఫికెట్ ఇచ్చి వుంటారు.
2012 - 2016 మధ్యలో పాస్ అయిన వారికి గ్రేడ్ లు లేదా పాయింట్ లు ఇచ్చి వుంటాయి
కాబట్టి ఆ ప్రకారంగా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
Select Result Type : ఇక్కడ మీకు 10 వతరగతి లో వఛ్ఛిన మార్కుల రకం ని సెలెక్ట్ చేసుకోవాలి
దీనితర్వాత Save & Continue పై క్లిక్ చేసి మీ మార్కులు, లేదా గ్రేడ్ లు, పాయింట్ లు మీది ఏది అయితే అలా మార్క్ లిస్ట్ చూసి ఎంటర్ చేసుకోండి
గమనిక : ఇక్కడ First Language,Second language ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వుంటుంది.ఆ తర్వాత నెక్స్ట్ పేజీ కి వెళతారు.
ఈ పేజీ ఈ క్రింది విధంగా వస్తుంది.
ఇక్కడ మీరు జాబ్ ఎక్కడ చెయ్యాలనుకుంటున్నారో మీ ప్రాంతంలో ఉన్న ఖాళీలు చూపిస్తాయి.
అక్కడ Post Preference అని ఉన్న చోట మీరు మొదట ఎక్కడ జాబ్ కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని నంబర్ల రూపం లీక్ ఒకటి, రెండు, మూడు అని నెంబర్స్ వేయాలి.
చివరన Declaration పై క్లిక్ చేసి Save Print పై క్లిక్ చేయాలి.
ఇంతటితో మీ అప్లై ప్రాసెస్ పూర్తి అయ్యి పీ అప్లికేషన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు
For More Updates Join watsapp Group
0 Comments