10 వ తరగతి తర్వాత తీసుకోవాల్సిన కోర్సులు - ఉద్యోగ అవకాశాలు
ఈ పేజీ నందు ప్రముఖంగా చెప్పబడిబనది
- 10 వ తరగతి తర్వాత చదవడానికి ఉన్న కోర్సులు
- ఏ కోర్సు తీసుకుంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి
- 10 వ తరగతి తర్వాత వుండే కోర్స్ లను చిత్ర పటం తో కూడా ఇవ్వడం జరిగింది
విద్యార్థులు తమ కెరీర్ ని ఎంచుకునే ఘట్టం ఇప్పుడు మొదలైంది.ఎందుకంటే 10 వ తరగతి వరకు అన్నీ సబ్జెక్టు లపై ప్రాథమిక అవగాహన చేసుకుంటారు.ఆ పదవ తరగతి తర్వాత మీకు ఇష్టమైన సబ్జెక్ట్ లలో ఒకదానిని ఎంచుకుని,దానిలో వుండే ఉపాధి అవకాశాలను కూడా ఒడిసి పట్టుకుని ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో, వాళ్లే జీవితంలో ఉన్నత స్థితికి వెలుతారు.కాబట్టి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చదువుకుని ఇంకా పలు చోట్ల సరైన సమాచారాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను.
మనం ఇప్పుడు ఈ పేజీ నందు 10 వ తరగతి చదివిన తర్వాత విద్యార్థులు మంచి ఉపాధి అవకాశాల కొరకు ఏ కోర్సు తీసుకుంటే..ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో..చాలా సులభంగా అందరికి అర్ధం అయ్యేటట్టు చెప్పుకుందాం.ఎందుకంటే ఇలాంటి సమాచారం తెలియక గతం నుంచి చాలా మంది కూడా గమ్యం తెలియని ఏదో ఒక గ్రూప్ తీసుకుని, అందులో బాగా రాణించలేక,అనుకున్న ఆశయాలను నెరవేర్చుకోలేక సరైన జీవితానికి సరైన అడుగులు వేయలేక చాలా మంది అనుకున్న గమ్యానికి చేరకుండానే మధ్యలోనే నిలచిపోయారు.అందులో నేను కూడా ఒక బాధితుడినే.కాబట్టి నాలాంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి మనకు తెలిసిన కొన్ని మార్గాలను తెలియజేస్తే విద్యార్థులకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అని సదుద్దేశ్యం తోనే ఈ సమాచారంని మీకు అందిస్తున్నాను.
ముందుగా 10 వతరగతి తర్వాత ఎలాంటి కోర్సులు ఉన్నాయి - వీటితో ఉపాధి అవకాశాలు ఏవిధంగా ఉంటాయి?
తొలి అడుగు ఇంటర్మీడియట్ : 10 వతరగతి పూర్తయిన విద్యార్థులు ఎక్కువ శాతం ఎంచుకునే కోర్సు ఈ ఇంటర్మీడియట్.ఇందులో ప్రధానమైనవి సైన్స్ మరియు ఆర్ట్స్ ని రెండు విభాగాలుగా ఉంటాయి. అందులో వుండే కోర్సులు MPC, BIPC, CEC, HEC ఇప్పడు వీటి గురించి కొంచెం విపులంగా చెప్పుకుందాం.
MPC : ఈ MPC గ్రూప్ నందు పూర్తిగా మాథ్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ లకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ గ్రూప్ ని అల్ రౌండర్ గ్రూప్ గా కూడా చెప్పుకొనవచ్చును. కాబట్టి ఈ సబ్జెక్టులో మీకు ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా ఈ గ్రూప్ ని ఎంచుకోండి.ఈ కోర్సు అనంతరం పై చదువుల కి విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు BSC కి అవకాశాలు ఉంటాయి.
ఉపాధి అవకాశాలు : ఇందులో ఫిజిక్స్,కెమిస్త్రీ,సైన్స్ విభాగాలలో లెక్చరర్లగానూ, ఇంజినీర్ లగానూ, సైంటిస్టులు లగానూ,సాఫ్ట్ వేర్ రంగాలలో స్థిరపడాలనుకునే వారికి ఈ MPC గ్రూప్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
BIPC : ఈ BIPC గ్రూపు లలో బయాలజీ,ఫిజిక్స్,కెమిస్ట్రీ లకు సంబంధించిన పాఠ్యoశాలు బోధిస్తారు.కావున వృక్ష, జంతు శాస్త్ర సంబంధించిన పరిశోధనా రంగాలపై ఆసక్తి ఉన్నవారు ఈ గ్రూప్ ని ఎంచుకోండి
ఉపాధి అవకాశాలు : వైద్యం,వ్యవసాయ, డెంటల్, ప్రసూతి, హోమియోపతి,యోగ,ఆయుర్వేద లాంటి రంగాలలో మంచి భవిష్యత్ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఎక్కువ శాతం మెడికల్ ఫీల్డ్ లలో అవకాశాలు మెండుగా ఉండడంతో పాటు ఆర్ధికంగా కూడా తొందరగా స్థిరపడవచ్చును.
CEC : ఈ గ్రూప్ నందు ప్రధానంగా అకౌంట్లు కి సంబంధించిన వివరాలని నేర్పుతారు.ఈ కోర్సు కి సమాజంలో మంచి డిమాండ్ కూడా వుంది
ఉపాధి అవకాశాలు : బ్యాంక్ లకు సంబంధించిన క్లరికల్ పోస్టులకు,కంపనీ మేనేజర్లుగా, ఆడిటర్లుగా,సెక్రెటరీలుగా మరియు ఆర్మ్ లాంటి ఉద్యోగాలలో కూడా స్థిరపడవచ్చును.ఇదే కాకుండా కంపెనీల యొక్క ఆర్ధిక వ్యవహారాలు లెక్కించండం, స్టాక్ ఎక్స్చేంజె మరియు మార్కెట్ వ్యవహారాలపై పట్టు సాధించి మెరుగైన అవకాశాలు పొందవచ్చును.
ప్రత్యేకత : ఈ కోర్సు పెద్దగా ఖర్చుతో కూడుకున్న కోర్సు కాకపోవడంతో మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు ఎక్కువగా తీసుకుంటూ వుంటారు.
HEC : సమాజంలోని సామాజిక అంశాలు పై ఆసక్తి ఉన్నవారు మరియు ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను అన్వేషించే ఆసక్తి కలిగిన వారికి ఈ గ్రూప్ ఎక్కువగా ఉపయోగపడుతుంది.ఈ గ్రూప్ అయ్యాక డిగ్రీ లాంటి పై చదువుల కూడా పూర్తిఅయ్యాక, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కాంపిటేటివ్ పరీక్షలో మంచి నైపుణ్యం కూడా కలిగి త్వరగా ఉద్యోగాలు సాధించే అవకాశం కూడా కలదు.
MEC : ఈ గ్రూప్ నందు మనం ఇంతకుముందు చెప్పినట్టు MPC,CEC ఈ రెండు గ్రూపు లలో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ని బోధిస్తారు.ఈ కోర్సు అనంతరం B.A,M.A,PHD తో పాటు సివిల్స్, గ్రూప్స్ లలో కూడా సులభంగా రాణించవచ్చును.
ఓకేషనల్ గ్రూప్స్ : ఈ ఓకేషనల్ గ్రూప్స్ నందు చాలా అంశాలకు సంబంధించినవి భోదిస్తారు. ముఖ్యంగా త్వరగా టెక్నీకల్ గా జీవితంలో త్వరగా స్థిరపడలనుకున్న వారు దీనిని ఎంచుకోవచ్చు. ఈ కోర్సు అయ్యాక డిప్లొమా రెండో సంవత్సరం లోకి డైరెక్ట్ గా జాయిన్ అవచ్చు. మరియు ITI కి సంబంధించిన కొన్ని ట్రేడ్ లలో శిక్షణ తీసుకుని స్వయం ఉపాధికి అవకాశం లభిస్తాయి.
ఇందులో కొన్ని ముఖ్యమైన కోర్సులు:
క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్
అకౌంటింగ్ అండ్ టాక్సేషన్
ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్
వాటర్ సప్లై అండ్ సానిటరీ ఇంజినీరింగ్
ఇలా చాలా కోర్సులు అందుబాటులో ఉంటాయి. వీటిలో కోర్సు పూర్థి చేసిన వెంటనే చిన్న, చిన్న ఉపాది అవకాశాలు వెంటనే రావడానికి అవకాశాలు ఉంటాయి
ITI : ఈ ITI కోర్సు ని ఎవరు తీసుకోవాలంటే జీవితంలో త్వరగా స్థిరపడలనుకున్న వారు అంటే స్వయం ఉపాధి ఎంచుకునే వారు అని చెప్పుకోవచ్చు.
ఉపాధి అవకాశాలు : ఎలెక్ట్రిషియన్, ఫిట్టర్,ప్లంబర్,ఇలాంటి పనులకు నేర్పడం వల్ల త్వరగా స్వయం ఉపాధి దొరుకుతుంది.
పాలిటెక్నీక్: పదవ తరగతి తర్వాత పొలిటెక్నీక్ ఎంట్రన్సు టెస్ట్ వ్రాసి పాలిటెక్నీక్ కాలేజీలలో జాయిన్ కావచ్చును. ఈ పాలిటెక్నీక్ కోర్సు పూర్తి చేసిన వారు ఇంజనీరింగ్ లోకి డైరెక్ట్ గా రెండోసంవత్సరం కి చేరవచ్చును.
వెటర్నరీ డిప్లోమా : పడవ తరగతి పూర్తి చేసిన తర్వాత వేటర్నిటీ డిప్లొమా కోర్సు ని ఎంపిక చెసుకోవచ్చును.ఈ కోర్సు పూర్తి చేసిన వారికి పశు సంవర్ధక శాఖలో అవకాశాలు ఉంటాయి.
వ్యవసాయ పొలిటెక్నీక్ : వ్యవసాయం పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు పొలిటెక్నీక్ కోర్సు విత్తనోత్పత్తి, వేటర్నిటీ,హార్టీ కల్చర్ మొదలగు కోర్సు లు ఉంటాయి.ఈ కోర్సు అనంతరం B,SC అగ్రికల్చర్ పూర్తి చేస్తే వ్యవసాయ విస్తరణ అధికారిగా మంచి అవకాశాల ఉంటాయి.
IIIT : 10 వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోగగలితే పై కోర్సుల అన్నిటికంటే మంచి భవిష్యత్ ఉన్న కోర్సు అని చెప్పవచ్చును.దీనిలో సీట్ సంపాదిస్తే 10 వతరగతి పూర్తి అయ్యాక ఈ కోర్సు 6 సంవత్సరాలు ఉంటుంది.
మొదటి భాగం : రెండు సంవత్సరాలు ప్రీ యూనివర్సిటీ కోర్సు
రెండవ భాగం : మరో 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్సులతో మిలితమైన సబ్జెక్స్ తో కలిపి బోధన ఉంటుంది.
ప్రత్యేకత : ఈ IIIT పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్ష పోటీలలో చాలా సులువుగా పోటీపడి ఉద్యోగాలు సంపదిస్తారు.
UPSC లాంటి పరీక్షల కొరకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఏ కోర్సు తీసుకున్నా పర్వాలేదు.ఎందుకంటే ఈ UPSC లాంటి కోర్స్ లకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది.
10 వ తరగతి తర్వాత ఉన్న కోర్సుల వివరాలను నమూనా ఆధారంగా ఇస్తున్నాను.
మనకున్న పరిజ్ఞానం ప్రకారం చాలా వరకు వివిధ రకాలైన ప్రధాన కోర్సుల గురించి అయితే వివరించడం జరిగింది.ఇంకా కూడా మరిన్ని నూతన కోర్సుల గురించి కూడా తెలుసుకుంటూ, మీకు ఇష్టమైన కోర్సులను సెలెక్ట్ చేసుకుని, వాటిని అభ్యసించి మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొందాలని కోరుకుంటూ..మీ మునిరత్నం
0 Comments