Ysr Village Health Clinic Notification-2022
వైస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్ట మొదటసారిగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు వైద్య సేవలు దగ్గరగా చేయడానికి ఈ వైస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ప్రతి 2500 జనాభాకు ఒక క్లినిక్ ని అందుబాటులో ఉంచి అక్కడే BSC నర్సింగ్ చేసిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లను మరియు ఇప్పటికే సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ANM లు అదే విధంగా ఆశ వర్కర్ లను కూడా ప్రజలకు దగ్గరగా ఉంచి ఆరోగ్య పరమైన సేవలను అందించడానికి ఈ విధమైన వ్యవస్థ ని డిజైన్ చేశారు.
పోస్టుల వివరాలు మరియు జీతం
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మేరకు వైస్సార్ హెల్త్ క్లినిక్ లకు కావాల్సిన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకునేలా ఒక సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన 1681 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ని జారీచేశారు.ఈ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు వేతనాలు నెలకు Rs 25,000 వేలు గా నిర్ణయించారు.
విద్యార్హతలు మరియు వివిధ రకమైన అర్హతలు
ఖచ్చితంగా BSC నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.లేదా BSC లోనేఇంటెగ్రల్ CPCH కోర్సు పూర్తి చేసివున్నా పర్లేదు.
వయస్సు: 01-08-2022 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు మధ్య కలిగి ఉండాలి.ఇక్కడ SC, BC,ST, EWS కి చెందిన వారికి మరో 5 సంవత్సరాలు మినహాయింపు కలదు.అంటే 40 సంవత్సరాలు వరకు వయస్సు వున్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చును.అదే విధంగా విభిన్న ప్రతిభావంతులైనచో 10 సంవత్సరాలు వరకు మినహాయింపు కలదు.అంటే 45 సంవత్సరాలు వయస్సు వున్నా కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
పరీక్ష ఫీజు మరియ ఇతర వివరాలు
ఈ పోస్టులకు ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.కావున ఈ పోస్టు దరఖాస్తునకు పరీక్షా ఫీజుని SC, ST, BC, EWS వారికి రూ.300గా నిర్ణయించారు.అదే విధంగా OC అభ్యర్థులకు రూ.500 లుగా పరీక్ష దరఖాస్తు ఫీజుగా నిర్ణయించనట్లు ఆ జి.ఒ లో తెలిపివున్నారు.
పరీక్ష విధానం గురించి
ఈ పరీక్ష పూర్తిగా ఆన్లైన్ లో జరపబడును.కావున కంప్యూటర్ పరిజ్ఞానం ఖచ్చితంగా వుండి తీరాలి.దీనిలో 200 ప్రశ్నలకు గానూ 200 మార్కులకు BSC నర్సింగ్ కి సంబంధించిన బహులైచ్చిక ప్రశ్నలు (Multiple Choice) ఉంటాయి.దీనికి గానూ 03 గంటల సమయం ఉంటుంది.
దరఖాస్తు తేదీలు
ఈ క్రింది లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసుకోండి.
LINK 1 :
![]() |
Website Link |
LINK 2 :
![]() |
Website Link |
ప్రారంభ తేదీ: 09-08-2022
చివరి తేదీ: 22-08-2022
After Qualify.....కావాల్సిన డాకుమెంట్స్
ఈ Job Notification PDF కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
![]() |
Notification |
0 Comments