ఈ పేజీ లో NVSP లో క్రొతగా అకౌంట్ రిజిస్టర్ ఎలా చేసుకోవాలో చుద్దాం!
ముందుగా ఎలక్షన్ కమీషన్ ప్రజలకు సులువుగా CSC సెంటర్ లకు, మీ సేవ సెంటర్ లకు,మరియు ఇంటర్నెట్ షాప్ లకు వెళ్లే అవకాశం లేకుండా మనమే ఓటర్ కార్డ్ కి సంబంధించిన ఎటువంటి సమాచారం అయినా పొందేందుకు వీలుగా ఈ ఆన్లైన్ విధానాన్ని తేవడం జరిగింది.
మరిన్ని నూతన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.
ముందుగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ పేజీ చివరన ఇచ్చాను.దాని మీద క్లిక్ చేస్తే ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ కుడి వైపు పైన లాగిన్ పై క్లిక్ చేయాలి.
ఈ పేజీ నందు User Name, Password అడుగుతుంది.మనం ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి,అక్కడే కొంచెం క్రిందకు వస్తే రిజిస్టర్ అనే దానిపై క్లిక్ చేసుకోవాలి
ఇక్కడ ముందుగా మీ మొబైల్ నెంబర్ ని చేసుకోవాలి. ఆ తరువాత అక్కడ ఇచ్చిన కాప్చ ని కూడా ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ చెసుకోవాల్సి ఉంటుంది.అక్కడ OTP ని ఎంటర్ చేశాకా దాని క్రింద Verify OTP పై క్లిక్ చేసుకోవాలి.
ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకుంటారా లేక ఓటర్ కార్డ్ నెంబర్ లేకపోయినా రిజిస్టర్ చేసుకుంటారా అనే ఆప్షన్ ఎంచుకుని ఆ తరువాత ఉంటే ఓటర్ కార్డ్ నెంబర్ మరియు ఇమెయిల్ (Optional) ఎంటర్ చేసి ఆ తరువాత పాస్స్వర్డ్ ని సెట్ చేసుకోవాలి.ఆ తరువాత రిజిస్టర్ పై క్లిక్ చేస్తే విజయవంతం గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది.
గమనిక: ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే మినిమం 6 అక్షరాలు ఉండాలి.అందులో ఒక Capital, ఒక నెంబర్, ఒక గుర్తు ఏదైనా ఉండేటట్లు చూసుకోవాలి.
ఉదాహరణకు : Votercard@345
ఇందులో V - Capital Letter పెట్టాము, మిగతావన్నీ Small Letters, @ - ఒక గుర్తు మరియు 345 అనేది నెంబర్..ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ని సెట్ చేసుకోవచ్చు.
0 Comments