ఈ పేజీలో మనం ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నందు పేదవారికి పెళ్లి కార్యక్రమంలో ఆర్ధిక సాయం చేయడం కోసం ప్రకటించిన వైస్సార్ కల్యాణ మస్తు మరియు మైనార్టీ లకు సంబంధించి షాదీ తోఫా పతకం కి సంబంధించిన విధి విధానాలు మరియు షరతులు,ప్రజలకు ఉన్న సందేహాలు గురించి వివరంగా చెప్పుకుందాం.
YSR కల్యాణమస్తు: ఆడపిల్లలను కన్న పేద తల్లిదండ్రులుకు పెళ్లి కార్యక్రమం మోయలేని భారం అయి,అప్పులు పాలు కాకూడదు,అనే ఉద్దేశ్యంతో గతంలో ఇచ్చే ఆర్ధిక సాయం కన్నా ఇంకా పెంచి ఎక్కువ మందికి,మరియు అధిక మోతాన్ని ఆ తల్లిదండ్రులు కి ఆర్ధిక సాయం చేయాలని రూపొందించిన పథకమే ఈ వైస్సార్ పెళ్లి కానుక.ఇప్పుడు ఈ పథకాన్ని పేరు మార్చి వైస్సార్ కల్యాణ మస్తు గా నామకరణం చేయడం జరిగింది.ఇప్పటివరకు మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాలు అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ 3 సంవత్సరాలలో దాదాపు 95% హామీలు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇవ్వబోయే కల్యాణ మస్తు పథకం కూడా ప్రారంభం కి నోచుకోవడం వల్ల ఇప్పుడు దీంతో 98.44% ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.కావున ఈ పేజీ లో ఆ పథకం యొక్క విధి,విధానాలు చెప్పుకుందాం.
ఈ వైస్సార్ కల్యాణ మస్తు పథకం ఎప్పటి నుండి ప్రారంభమగును ?
ఈ 2022 వ సంవత్సరం అక్టోబర్,1 వతేదీ నుండి ఈ పతకం ప్రారంభమగును.
ఈ ఆర్ధిక సాయం ఏయే కులాల వారికి అందించబడును ?
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం నిరు పేదలైన SC,ST,BC & మైనారిటీ కులాలకు చెందిన తల్లిదండ్రులు కి ఈ ఆర్ధిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.
ఎంత మేరకు ఆర్ధిక సాయం చేయనున్నారు ?
1) SC కులానికి చెందిన వారికి 1లక్ష రూపాయలు సహాయం చేయబడును
2) SC లో కులాంతర వివాహం చేసుకున్న వారికి 1లక్ష 20 వేల రూపాయలను అందిచనున్నారు.
3) ST కులానికి చెందిన వారికి కూడా 1లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు.
4) ST లలోని వారు కులాంతర వివాహం చేయూకున్న వారికి 1లక్ష 20 వేల రూపాయలని అందిచనున్నారు.
5) BC కులాల వారికి గతం కన్నా మిన్నగా 50 వేల రూపాయలు ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నారు.
6) BC లలో కులాంతర వివాహం చేసుకున్న వారికి 75 వేల రూపాయలు ను అందిచనున్నారు.
7) మైనారిటీ కులాలకు చెందిన వారికి షాదీ తోఫా పేరుతో 1 లక్ష రూపాయలను ఆ పేద కుటుంబానికి పెళ్లి కార్యక్రమం కోసం ఇవ్వనున్నారు.
8) ఏ కులానికి చెందిన వారైననూ, వారు దివ్యా0గులు అయి ఉంటే అలాంటి వారికి 1 లక్ష 50 వేల రూపాయలను ఇచ్చి వారికి తోడుగా వుండనున్నారు.
9) అదేవిధంగా ఏ కులాల వారైననూ భవన కార్మికుల వివాహాలకు అయితే 40 వేల రూపాయలను అందిచనున్నారు.
ఈ పథకం పొందడం కొరకు నిబంధనలు
1) వివాహం అయ్యే తేదీ నాటికి పెళ్లి కుమారుడికి 21 సంవత్సరాలు, మరియు పెళ్లి కుమార్తె కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
2) మొదటి సారి వివాహం చేసుకుంటున్న వారికి మాత్రమే ఈ YSR కల్యాణ మస్తు పథకం ద్వారా అందిచే ఆర్ధిక సాయాన్ని పొందడానికి అర్హులవుతారు.
3) పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె ఇద్దరూ కూడా తప్పకుండా 10 వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.(ఈ క్రొత్త నిబంధన 12/09/22 న వచ్చినది)
4) ఈ ఆదాయ నిబంధనలు మాత్రం పెళ్లి కుమార్తె కుటుంబం మరియు పెళ్లి కుమారుడి కుటుంబం ఇద్దరికి వర్తిస్తుంది.
I) గ్రామాల్లో నివసించేవారికి అయితే కుటుంబ ఆదాయం నెలకు10 వేలు లోపు ఉండాలి.అదేవిధంగా పట్టణాలలో వారికి అయితే నెలకు 12 వేలు కంటే మించరాదు.
II) వ్యవసాయ భూమి మాగాణి అయితే 3 ఎకరాల లోపు ఉండాలి.అదే మెట్ట అయితే 10 ఎకరాలు లోపు ఉండాలి.లేదా మెట్ట,మాగాణి రెండూ కలిపి అయితే 10 ఎకరాలు లోపు వరకు వుండచ్చును.కావున దానికన్నా పైన భూమి ఉన్న వారికి ఈ పథకం వర్తించదు.
III) ఆ కుటుంబంలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కానీ లేదా అదే విధంగా పెన్షనర్ గానీ ఉన్నచో ఈ పథకం వర్తించదు.కానీ పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఈ నిబంధన వర్తించదని తెలియజేసారు.
IV) ఆ కుటుంబానికి 4 చక్రాల వాహనం కలిగి ఉన్నచో ఈ పథకానికి అనర్హులు.కానీ టాక్సీ,ట్రాక్టర్,ఆటో కలిగి ఉన్న వారికి మాత్రం ఈ పథకానికి అర్హులుగా భావిస్తారు.
V) ఆ కుటుంబ విద్యుత్ వాడకం 300 యూనిట్స్ లోపల ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది.(దానిని 12 నెలల కరెంట్ వాడకాన్ని సరాసరి నెలకు 300 యూనిట్స్ కన్నా తక్కువ ఉన్నవారికే)
Checking Link: CLICK HERE
VI) ఆ కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్ళు ఉంటే ఈ పథకానికి అనర్హులు.
VII) మున్సిపల్ ఏరియా లో నివసించే భవనం 1000 చ.అడుగుల కన్నా మించరాదు.
మరిన్ని ప్రభుత్వ పరమైన నూతన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవగలరు.
0 Comments