వైస్సార్ కల్యాణమస్తు పథకం లో చిన్న మార్పు చేయడం జరిగింది. దాని గురించి ఈ వీడియో లో ప్రస్తావించుకుందాం.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నూతన వివరాలను పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరి పొందవచ్చును.
వైస్సార్ కల్యాణమస్తు: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పేద తల్లిదండ్రులు కొరకు పెళ్లిళ్ల సమయం లో ఆర్ధికంగా కొంతమేర సహాయం చేయాలని భావించి ఈ కల్యాణ మస్తు పథకం ని ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువడడం చూశాం.అయితే ఆ కల్యాణ మస్తు కి సంబంధించి ఒక చిన్న మార్పు చేయడం జరిగిందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఈ రోజు ప్రెస్సుమీట్ లోచెప్పడం జరిగింది.
అదేమిటంటే ఇప్పుడు ఇచ్చిన G.O లో ఈ పెళ్లి కానుకకి 2024,జూన్ 30 వ తేదీ లోపల దరఖాస్తు చేసుకునే వధూవరులు 10 తరగతి పూర్తి కాకున్నా పర్వాలేదు,దరఖాస్తు చేసుకుని ఈ లబ్దిని పొందవచ్చు. కానీ 2024,జూన్ 30 తర్వాత మాత్రం ఈ ఆర్ధిక సాయం పొందాలంటే ఖచ్చితంగా వధూవరులు ఇద్దరూ పదవ తరగతి చదివి ఉండాలని ఆ G.O లో ప్రముఖంగా చెప్పారు.
కానీ ఈ రోజు తమ్మినేని సీతారాం గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ఈ పథకాన్ని గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడం జరిగిందని, అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏమిటంటే, ఇప్పుడు విడుదల చేసిన G.O లో వధూవరుల విద్యార్హత 2024 జూన్ 30 వ తారీఖు పైన దరఖాస్తు చేసుకునే వారు ఖచ్చితంగా 10 వతరగతి పూర్తి చేసిఉండాలి,ఈ లోపల అప్లై చేసుకునే వాళ్లకు చదువు నిబంధన లేకుండా డబ్బులు ఇస్తాము అని పెట్టాము. కానీ ఇప్పుడు ఆ నిబంధనని సవరణ చేసి వచ్చే 2024 నుండి కాకుండా ఈ అక్టోబర్ 1,2022 నుండే ఖచ్చితంగా 10 వ తరగతి ఉత్తేర్ణత అయివుంటేనే ఈ సహాయం అందుతుంది. కావున ఈ విషయాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయండి అని మరియు త్వరలోనే దీనికి సంబంధించి క్రొత్త G.O కూడా వస్తుందని తెలియజేసినట్లు ఆయన తెలిపారు.
0 Comments