work from home survey link||Koushalam survey
Kousalam - ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకమునుపు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ ఉద్యోగులను మరియు నిరుద్యోగులను మరియు గృహిణిలను ఉద్దేశించి పదేపదే చెప్పిన మాటలు ఏమిటంటే ప్రపంచంలోని కంపెనీలన్నింటినీ మీ ఇంటి ముందుకు తీసుకొనివచ్చి, Work From Home కాన్సెప్ట్ తో మీరు ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం చేసి కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సచివాలయ సిబ్బందికి కౌశలం (Kousalam) అనే ఒక సర్వే ఇవ్వడం జరిగింది. ఆ సర్వేలో సచివాలయ సిబ్బందికి ఇచ్చిన మొబైల్ యాప్ లో లాగిన్ అయ్యి, ఆ సచివాలయ పరిధిలో ఆసక్తిగా వున్నా చదువుకున్న యువత పదవ తరగతి లోపల విద్యార్హత ఉన్ననూ లేదా ఆపైన, ఇంటర్ గాని డిగ్రీ గాని, ITI, డిప్లొమా, PhD లాంటి ఉన్నత విద్యార్హతలు ఉన్నవారి ఆసక్తిని బట్టి, ప్రతి ఇంటికి వెళ్లి వారు చదువుకున్న సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి ప్రభుత్వానికి Work From Home (Kousalam) కి ఆసక్తి వున్నారని నిరుద్యోగ వివరాలను పంపిస్తారు.
సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన ఈ సర్వే ప్రభుత్వం అనుకున్నంతగా, నిరుద్యోగుల నుంచి వివరాలను సేకరించడంలో విఫలం అయింది. కావున ప్రభుత్వం Work From Home ని Kousalam రిజిస్ట్రేషన్ అనే వెబ్సైట్ ద్వారా ప్రజలే సొంతంగా ఈ ఉద్యోగానికి ఆసక్తిగా ఉన్నామని, ఆ తగిన విద్యార్హత సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పించారు.
ఈ కౌశలం సర్వే కి చివరి తేదీ ఎప్పుడు ?
జ) ఈ కౌశలం సర్వే కి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశం సెప్టెంబర్ 15 వరకు ఇచ్చారు. ఆ తరువాత పొడిగింపు ఉండచ్చు, ఉండకపోవచ్చు.ఆలా ఏదైనా ప్రభుత్వం నుండి అప్డేట్ వస్తే మన వాట్సాప్ ఛానల్ నందు తెలియపరుస్తాను.
ఈ కౌశలం రిజిస్ట్రేషన్ లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు (Kousalam)
1) ఈ పోస్ట్ వ్రాస్తున్నఈ రోజుకి10వతరగతి లోపల విద్యార్హత ఉన్నవారు కానీ లేదా10th, ఇంటర్ విద్యార్హత ఉన్నవాళ్లు Self Registration లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని, మరియు ఆపైన ఏ విద్యార్హత ఉన్ననూ ఖచ్చితంగా సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయవలెనని చెబుతున్నారు.కానీ ప్రభుత్వం ఇచ్చిన ఈ Self Registration లో విద్యార్హత ఆప్షన్ దగ్గర10 వతరగతి లోపల గానీ, అదే విధంగా ఇంటర్ వాళ్లకు గానీ అక్కడ ఆప్షన్ అనేది లేదు. బహుశా తరువాత అప్డేట్ చేస్తారేమో చూడండి.లేదంటే సచివాలయంకి వెళ్లి ఉద్యోగుల యాప్ లో చేయించుకోగలరు.
2) కోర్సు పూర్తయిన వాళ్లే కాకుండా ఇప్పుడు చదువుతున్న వాళ్లు కూడా ఈ కౌశలం (Kousalam) రిజిస్ట్రేషన్ కి అర్హులు.
ఈ కౌశలం రిజిస్ట్రేషన్ కు కావలసిన వివరాలు - (Kousalam)
1) ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్
2) ఈ మెయిల్ ఐడి
3) ఇంటర్ పైన విద్యార్థి ఉన్నవాళ్లు సంబంధిత మార్క్ లిస్టు మరియు మార్కుల శాతం లేదా GPA స్కోర్
4) కోర్సు పూర్తయిన జిల్లా, సంవత్సరం, కళాశాల లేదా యూనివర్సిటీ
5) ఇంకేదైనా ప్రత్యేక కోర్సులు చేసుంటే జోడించుకునే అవకాశం
కౌశలం రిజిస్ట్రేషన్ లింక్ - (Kousalam)
Link 1 - Click Here
Link 2 - click Here
కౌశలం సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ - (Kousalam)
1) ముందుగా ఆ పైన ఇచ్చిన లింకు పై క్లిక్ చేసుకున్న తరువాత ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.
2) అక్కడ Work From Home అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.
3) మీ ఆధార్ నంబర్ ఇచ్చి, OTP ఎంటర్ చేసుకోవాలి.
4) ఈ క్రింది పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మన మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి ఆ రెండిటికి వచ్చే ఓటిపి ని మళ్లీ ఎంటర్ చేయాలి.
గమనిక - పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నవారు ఇప్పుడు చెప్పిన వివరాల వరకు మాత్రమే ఎంటర్ చేయవలెను. ఇంటర్ పైన విద్యార్హత ఉన్నవాళ్లు మిగతా విద్యార్హత వివరాలు కూడా ఎంటర్ చేసి, సంబంధిత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయవలెను.
5) ఆ తరువాత ఇంకేదైనా ప్రత్యేక కోర్సులు చేసి ఉన్నచో ఆ వివరాలను కూడా Add అనే ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చును.
6) అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత చివరన SUBMIT అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ కౌశలం (Kousalam) నందు విజయవంతంగా నమోదు అయినట్టు ఈ క్రింది విధంగా అప్లికేషన్ ఐడి వస్తుంది.
0 Comments