Header Ads Widget

member addition in ration card ap -2025

member addition in ration card ap -2025

Ration card member e addition online   How to add member in Ration card in AP  Ration card add member application form   Member edition in Ration card status   Rice card adding application sachivalayam   AP ration card download  AP ration card apply   Ration card apply AP   Member edition in Ration card form   Member edition in Ration Card AP   Ration card member correction form   Ration card e k y c AP   Ration card status AP   Ration card download AP

ఈ పేజీలోని ముఖ్యాంశాలు 


1) రేషన్ కార్డులో సభ్యులను జోడించే విధానము  
2) క్రొత్త వ్యక్తికి జోడించేటప్పుడు గుర్తించుకోవాల్సిన అంశాలు ఏమిటి ?
3) ఫీజు మరియు పేమెంట్ సులభంగా చేయు వివరాలు 
4) కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ? 
5) దరఖాస్తు తరువాత ప్రాసెస్ ఏమిటి ? 
6) మన అప్లికేషన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ ఎలా తెలుసుకోవాలి ? 
7) క్రొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది?
8) ఈ రేషన్ కార్డు సర్వీసులకు చివరి తేదీ?

Ration Card - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సేవలను అతి దగ్గరగా ప్రభుత్వ కార్యాలయాలకు కూడ పోనవసరం లేకుండా, మన మొబైల్ లో watsapp App ఉంటే చాలు, అన్నిఅంటే  ప్రస్తుతం 409 సేవలను సులభంగా పొందే విధంగా "మనమిత్ర" పేరుతో  అవకాశం కల్పించింది. కనుక అందులో భాగంగానే Ration Card లో ఓక వ్యక్తి ని జోడించాలంటే ఏ విధమమైన ప్రాసెస్ లో చేసుకుంటే విజయవంతంగా లబ్ది పొందగలమా అనే విషయాన్నీ ఈ పేజీలో వివరంగా తెలియపరుస్తాను. 

ఇలాంటి ప్రభుత్వ పరమైన అధికారిక సమాచారాలు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పొందాలి అనుకుంటే ఈ క్రింది Whats app Group లో జాయిన్ అవగలరు. 

ప్రభుత్వ పథకాల వారధి వాట్సాప్ ఛానల్ 

            JOIN LINK - Click 

గమనిక - రేషన్ కార్డుకి సంబంధించి వాట్సాప్ గవర్ననన్స్ లో సర్వీసులు పొందాలి అనుకుంటే సంప్రదించండి. 
Cell - 9700565505 (మద్దిమడుగు మునిరత్నం)




1) రేషన్ కార్డులో సభ్యులను జోడించే విధానము 


  • ముందుగా స్మార్ట్ ఫోన్ వున్న అప్రతి ఒక్కరు కూడ 9552300009 అనే నంబర్ ని మీ ఫోన్లో,మీకు నచ్చిన పేర్లతో SAVE చేసుకోవలెను. 
  • ఆ తరువాత వాట్సాప్ లో ఆ నెంబర్ ని ఓపెన్ చేసుకుని "Hi" అని టైపు చేసి సెండ్ చేయండి . 
  • ప్రభుత్వం నుండి "సేవను ఎంచుకోండి" అనే ఆప్షన్ వస్తుంది.ఇక్కడ మీకు ఇంగ్లీష్ అక్షరాలలో కావాలంటే EN అని టైపు చేసి సెండ్ చేస్తే బాష మారుతుంది.
  •  ఇక్కడ దయచేసి ఒక సేవని ఎంచుకోండి అని చెప్పి ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్స్ జాబితాని చూపిస్తోంది.అందులో "సివిల్ సప్లై" అనే విభాగాన్నీ ఎంచుకోవాలి.
  • అక్కడ ప్రభుత్వం నుండి "ఏపీ ప్రభుత్వం సివిల్ సప్లై సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు , అని చెబుతూ "తెరవండి " అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొవాలి. 
  • ఇక్కడ HOF ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. (రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందొ, వారి ఆధార్ తో లాగిన్ అవ్వాలి)
  • (HOF అంటే HEAD OF THE FAMILY )
  • OTP వస్తుంది. (ఆదార్ కి లింక్ అయిన మొబైల్ కి) 
  • ఇక్కడ HOF యొక్క ప్రాధమిక వివరాలను కొన్నింటిని ఇవ్వాలి.
గమనిక - ఈ ప్రభుత్వం ఇచ్చిన మరొక అంశం ఏమిటంటే ఇది వరకు ఎక్కడా కార్డులో లైన్ వ్యక్తులను కూడా జోడించుకోవచ్చును. (గతంలో 15 సంవత్సరాల లోపు వాళ్లకు మాత్రమే అవకాశం వుండేధి ) 



2) క్రొత్త వ్యక్తికి జోడించేటప్పుడు గుర్తించుకోవాల్సిన అంశాలు 


  • ఇక్కడ రేషన్ కార్డులో ప్రస్తుతం వున్నఅన్నీ సర్వీసులను చూపిస్తుంది. 
  • అందులో "రేషన్ కార్డులో సభ్యులను జోడించడం" అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని Submit చేయాలి. 
  • రేషన్ కార్డు లో జోడించే వారి ఆధార్ ని ఎంటర్ చేయాలి.
  • అక్కడ "జోడించు రకం" అని ఆప్షన్ దగ్గర ఈ క్రింది రెండు ఆప్షన్ లు ఉంటాయి. 
                 1) జననం 
                 2) వివాహం 
  • జననం ద్వారా అయితే జనన ధ్రువీకరణ సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ చేసి, PDF (25 MB) కూడ అప్లోడ్ చేయాలి. 
  • వివాహం ద్వారా జోడించాలంటే పెళ్లి ఫోటో మరియు వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్ (25 MB) ని కూడా అప్లోడ్ చేయాలి. 
      
గమనిక - వివాహం ద్వారా కార్డులో యాడ్ అవ్వాలంటే మ్యారీజీ సర్టిఫికెట్ అవసరం లేదని, ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చాలా సార్లు ప్రకటనలు చేశారు. కానీ వాట్సాప్ గవర్నెన్స్ లో ఖచ్చితంగా సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలనే ఆప్షన్ అయితే అలానే ఉంచారు.

  • Add Another Member అనే ఆప్షన్ అయితే వుంది, కానీ ఒకేసారి ఇద్దరికీ జోడించాలంటే తీసుకోవడం లేదు, బహుశా తరువాత app ని అప్డేట్ చేస్తారేమో ప్రస్తుతం ఈ తేదీకి రెండుసార్లు వేర్వేరుగా యాడ్ చేస్తే అవుతున్నాయి .  


3) ఫీజు మరియు పేమెంట్ చేయు వివరాలు 

  • రేషన్ కార్డు నందు జననం ద్వారా అయినా, వివాహం ద్వారా అయినా రేషన్ కార్డు నందు యాడ్ అవ్వాలంటే అది సచివాలయంలో అయినా వాట్సాప్ గవర్నెన్స్ లో అయినా రూ 24/- లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 
  • పేమెంట్ చేసేటప్పుడు అక్కడ చాల మందికి అర్ధంకాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అక్కడ ప్రముఖంగా ఈ క్రింది విధంగా 3 ఆప్షన్స్ చూపిస్తాయి.
 
               1) Credit Card / Debit Card
               2) Internet Banking
               3) Wallets

 1) Credit Card / Debit Card 

 ఈ ఆప్షన్ ద్వారా క్రెడిట్ కార్డు వున్నా లేదా డెబిట్ కార్డు (ATM కార్డు) వున్ననూ, దానియొక్క వివరాలు ఇచ్చి పేమెంట్ చేయవచ్చును. ఇక్కడ గమనించుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే డెబిట్ కార్డులో "Rupay" కార్డు ఉంటేనే పేమెంట్ చేయడానికే అవకాశం కల్పించారు.

 2) Internet Banking

ఈ internet Banking ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చును,కానీ ఈ తేదీ నాటికీ ప్రధాన బ్యాంకులను (SBI) అందులో ఇవ్వలేదు.బహుశా తరువాత రోజుల్లో Update చేయవచ్చును. 


3) Wallets

ఈ ఆప్షన్ దగ్గర చాలా మంది డైరెక్ట్ గా Phone pay, G Pay, PAY TM లాంటి ఆప్షన్స్ రాలేదని కంగారు పడుతున్నారు. నిజమే ప్రభుత్వం అక్కడ సులభతరంగా ఇవ్వచ్చు, కానీ ఎందుకో పేమెంట్ దగ్గర చాలా ఇబ్బందికర ఆప్షన్స్ ఇవ్వడం జరిగినది. 



4) Wallet ద్వారా సులభంగా పేమెంట్ చేయు విధానం 


  • ఈ ఆప్షన్ ఎంచుకున్నాక Search లో కూడా Mobikwik ని ఎంచుకుని Make Payment క్లిక్ చేసుకోవాలి. 
  • కాబట్టి ముందుగా Mobikwik App ని తప్పకుండా Install చేసుకోవాలి. 
                  App Link  - Download 

  • ఇక్కడ మీ Mobikwik లో రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. 
  • OTP ని ఎంటర్ చేసుకోవాలి.
  • ఇక్కడ UPI అని ఆప్షన్ దగ్గర దాదాపు 8 రకాల పేమెంట్ methods కి అవకాశం లభిస్తుంది. 
  1. Mobikwik
  2. paytm
  3. BHIM
  4. YONO SBI
  5. Navi
  6. Gpay
  7. Phonepe
  8. Bajaj Finserv
  • ఇక్కడ మీకు నచ్చిన పేమెంట్ పద్దతిలో ఫీజు కట్టవచ్చును .


5) దరఖాస్తు తరువాత ప్రాసెస్ ఏమిటి ? 

  • వాట్సాప్ గవర్నెన్స్ లో రేషన్ కార్డులో ఏ రకమైన సర్వీసుకి దరఖాస్తు చేసుకున్నా, ఈ విధంగా T20..XXXX   ఒకటి వస్తుంది. 
  • ఈ T నెంబర్ మీ మొబైల్ కి Massage రూపంలోనూ మరియు వాట్సాప్ లోనూ వివరంగా వస్తుంది. 
  • ఈ T నెంబర్ వచ్చిన తరువాత మీ సచివాలయంలో వెళ్లి Ekyc చేసుకోవాల్సి ఉంటుంది. 
    Ekyc చేయువిధానము 
  • Ekyc అనేది సచివాలయంలో (1) పంచాయతీ కార్యదర్శి / అడ్మిన్ (2) VRO (3) మహిళా పోలీస్  (4) డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగుల దగ్గర T నెంబర్ వచ్చిన 3 రోజుల లోపల చేయించుకోవాలి. 
  • Ekyc పూర్తి అయ్యాక మీ అప్లికేషన్ VRO కి వెరిఫికేషన్ కోసం వెళుతుంది. అక్కడ ఆ ఉద్యోగి మీ అప్లికేషన్ వివరాలను Six Step Verification లో 7 రోజుల లోపల వెరిఫికేషన్ చేసి, ఆ తరువాత ఆ అప్లికేషన్ MRO కి పంపబడుతుంది . 
  • ఈ విధంగా పంపిన అప్లికేషన్ MRO లాగిన్ లో 11 రోజులు ఉండి, అక్కడ Approve / Reject అనేది చేస్తారు. 



 రేషన్ కార్డులో మెంబెర్ ని యాడ్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది?


ఈ విధంగా రేషన్ కార్డులో మెంబెర్ ని యాడ్ చేయాలంటే SLA పీరియడ్ 21 రోజులు అవుతుంది.అదే కార్డులోని సభ్యులను విభజన చేయమంటే మాత్రం180 రోజుల SLA పీరియడ్ ఉంటుంది . 

6) మన అప్లికేషన్ ఏ అధికారి స్థాయిలో ఉందొ ఎలా తెలుసుకోవాలి ? 


మనం రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ సచివాలయంలో లేదా వాట్సాప్ గవర్ననన్స్ లో పెట్టుకున్నా, ప్రస్తుతం మన అప్లికేషన్ ఏ అధికారి స్థాయిలో ఉందొ T నెంబర్ తో సులభంగా ఎటువంటి లాగిన్ లేకుండా ఈ క్రింది లింక్ ద్వారా  తెలుసుకోవచ్చును. 
Ration Card Status Checking Link - Click Here 

స్టేటస్ చెకింగ్ డెమో - Click Here 
 
Ration card member e addition online   How to add member in Ration card in AP  Ration card add member application form   Member edition in Ration card status   Rice card adding application sachivalayam   AP ration card download  AP ration card apply   Ration card apply AP   Member edition in Ration card form   Member edition in Ration Card AP   Ration card member correction form   Ration card e k y c AP   Ration card status AP   Ration card download AP


7) కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ?

వాట్సాప్ గవర్నెన్స్ లో రేషన్ కార్డలో సభ్యుడిని జోడించాలంటే ఈ క్రింది డాకుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. 
  • HOF ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి 
  • జనన ధ్రువీకరణ పత్రం (పుట్టిన పిల్లలను యాడ్ చేయుటకు)
  • వివాహాఁ జరిగినప్పటి ఫోటో (వివాహం ద్వారా జోడించుటకు)
  • విహవా ధ్రువీకరణ పత్రం (వివాహం ద్వారా జోడించుటకు)
  • మీ సచివాలయం పేరు 


8) క్రొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది?


ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఏడాది తరువాత గత ప్రభుత్వం ఇచ్చిన రైస్ కార్డుల స్థానంలో క్రొత్తగా "Smart Ration Card" లను ఈ జూన్ 7 తరువాత ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేసారు . 

9) ఈ రేషన్ కార్డులకు సర్వీసులకు చివరి తేదీ?

 ఈ రేషన్ కార్డుల యొక్క సర్వీసులకు చివరి తేదీ ఎప్పుడు అనే సందేహం అయితే చాలా మందిలో వుంది, కానీ దీని మీద ప్రభుత్వం చాల క్లారిటీ ఇచ్చింది, అదేమిటంటే జూన్ 7 వ తేదీ లోపల Updation చేసుకున్న వివరాలతో క్రొత్త "Smart Ration Card" లను ఇవ్వనున్నామని, అంతేకానీ రేషన్ సర్వీసులు అనేది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలియజేసారు. 

10) Ration Card Download Process ?


ఈ రేషన్ కార్డు డౌన్లోడ్ ఎలా అనే విషయాన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారు, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక website అయితే ఇవ్వలేదు,కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన "Digi locker" నందు అయితే రేషన్ కార్డు వివరాలతో వున్న PDF ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ కార్డుని ఎక్కడైనా ప్రస్తుతానికి అవసరానికి ఉపయోగించుకోవచ్చును.  
Ration Card Download - Click Here 

Related Links 






Post a Comment

0 Comments