Header Ads Widget

శ్రీకాళహస్తిలో 6 మందిపై కేసులు - జాగ్రత్త సుమా!

శ్రీకాళహస్తిలో 6 మందిపై కేసులు - జాగ్రత్త సుమా!

  • డిసెంబర్ 31 రాత్రి తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు.

MR News Telugu, డిసెంబర్ 27

మేనేజంగ్ డైరెక్టర్ - మునిరత్నం


తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు యొక్క ఆదేశాలతో శ్రీకాళహస్తి డి.ఎస్.పి నరసింహమూర్తి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ కుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పట్టణంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఆరుగురు వాహనదారులను గుర్తించి కేసులు నమోదు చేశారు. వారిని శ్రీకాళహస్తి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం ప్రతి ఒక్కరికి రూ10,000 చొప్పున మొత్తం రూ.60,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని, ఇది చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ప్రజల ప్రాణాల భద్రత కోసమే ఈ చర్యలని, భవిష్యత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments