జగనన్న విద్యా దీవెన ekyc కొరకు క్రొత్త మొబైల్ యాప్ BOP 6.5 విడుదల
ఈ పేజీ నందు ప్రధానంగా విద్యార్థులు కి సంబంధించిన ఫీజు రీఎంబర్సుమెంట్ పొందుటకు ముందస్తుగా ఇప్పుడు ఇచ్చిన మొబైల్ యాప్ నందు ekyc చేయు విధానం
జగనన్న విద్యా దీవెన: ఈ జగనన్న విద్యాదీవెన అంటే ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న విద్యార్థులు కి వారి యొక్క కోర్సు ఫీజు ని మొత్తాన్ని అదే సంవత్సరం పూర్తి ఫీజుని 4 దఫాలుగా చెల్లిస్తుంటారు.ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం కి రెండవ వాయిదాని గత మే నెలలో అయితే వేయడం జరిగింది.అదే విధంగా ఇప్పుడు 3 వ వాయిదాకు సంబంధించి ఆగస్ట్-2022 నెలలో డబ్బులును విడుదల చేయనున్నారు.అందులో భాగంగా ముందస్తుగా విద్యార్థి దగ్గర బయోమెట్రిక్ తీసుకునే విధానాన్ని జగనన్న విద్యా దీవెన ekyc అంటారు.
మరిన్ని ప్రభుత్వ పరమైన నూతన అప్డేట్స్ పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి పొందగలరు.
విద్యా దేవెన ekyc మొబైల్ యాప్ వెర్షన్ 6.5
![]() |
BOP Version 6.5 |
సర్వే చేయు విధానము: ముందుగా ఈ యాప్ ని సచివాలయ ఉద్యోగి అయిన వెల్ఫేర్ సెక్రటరీ లేదా పట్టణాలలో అయితే ఎడ్యుకేషన్ సెక్రటరీ యొక్క లాగిన్ తో ఓపెన్ చేస్తారు.
మొదట పేజీ ఓపెన్ చేసి అక్కడ జగనన్న విద్యా దీవెన అనే ఆప్షన్ ఎంచుకుంటారు.
ఈ పేజీ లో ekyc, Acknowledgement అనే రెండు ఆప్షన్స్ చూపిస్తాయి.
Ekyc: పథకం ప్రారంభం కి ముందుగా విద్యార్థి దగ్గర ekyc తీసుకుంటారు.
Acknowleegement: ప్రభుత్వం ఫీజుని విడుదల చేసాకా, డబ్బులు అందిదా..లేదా అనే క్లారిటీ కోసం విద్యార్థి యొక్క తల్లి దగ్గర బయోమెట్రిక్ వేసుకుంటారు.
ఇక్కడ ekyc ఆప్షన్ ఎంచుకుంటే 2 Quarter, 3rd Quarter అనే ఆప్షన్స్ చూపిస్తాయి.ఇందులో ఇప్పుడు ఆగస్ట్ లో వేయబోయేది 3rd Quarter కాబట్టి ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఇక్కడ ఆ సచివాలయ పరిధిలో ఉన్న విద్యార్థులు వివరాలు చూపిస్తాయి.ఒక ఒకవేళ విద్యార్థులు వేరే ప్రాంతాల్లో చదువుతూవుంటే అక్కడే ఉన్న సచివాలయంలో కూడా Search By Adhar ద్వారా కూడా బయోమెట్రిక్ వెసుకోవచ్చు
Ekyc ఆప్షన్ లో సచివాలయ కోడ్ మరియు వాలంటీర్ యొక్క క్లస్టర్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.ఇక్కడ ఆ వాలంటీర్ కి సంబంధించిన విద్యార్థులు వివరాలు వస్తాయి.
ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాక ఇక్కడ విద్యార్థి యొక్క వివరాలు చూపిస్తాయి.ఇక్కడ ముఖ్యంగా పెట్టాల్సిన ఆప్షన్స్ ఇక్కడ నుండి జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది.
Select Student Status: ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి.1)Live. 2) Death. 3) Discontinued from the college/ Drop Out అనే ఆప్షన్స్ లో ప్రస్తుత విద్యార్థి యొక్క స్థితి ని ఎంచుకోవాలి.
LIVE అని ఎంచుకుంటే స్టూడెంట్ దగ్గర బయోమెట్రిక్ వేసుకోవాలి.
DEATH అని ఎంచుకుంటే సచివాలయ ఉద్యోగి గానీ లేదా వాలంటీర్ గానీ బయోమెట్రిక్ ద్వారా ఆమోదం తెలిపాల్సివుంటుంది.
Discontinued from the college/Drop Out: ఈ ఆప్షన్ లో కూడా వెరిఫికేషన్ చేసుకున్నాకా వాలంటీర్ గానీ లేదా సచివాలయ ఉద్యోగి గానీ ఆమోదం తెలిపినట్టు బయోమెట్రిక్ వేయాల్సివుంటుంది.
0 Comments