MLC Vote Card Application Status Check -2022

ఈ క్రింది పేజీ నందు మనం ప్రధానంగా చెప్పుకోబోయే అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1)MLCకి సంబంధించి అప్లికేషను స్టేటస్ తెలుసుకోవడం ఎలా ?
2) BLO ని తెలుసుకోవడం ఎలా ?
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం పొందాలి అనుకున్నవారు ఈ క్రింది గ్రూప్ లలో జాయిన్ అయ్యి నూతన అప్డేట్స్ పొందవచ్చును.
ప్రభుత్వ పథకాల వారధి గ్రూప్
![]() |
TELEGRAM & WATSAPP |
MLC: ముందుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ మరియు టీచర్స్ MLC లకు సంబంధించి ఈ 2023 జనవరి నెల యందు ఎన్నికలు నిర్వహించనున్నారు.కావున అర్హులైన ప్రతి యొక్క గ్రాడ్యుయేట్ మరియు ఉపాధ్యాయులు తప్పకుండా ఓటర్ కార్డ్ ని నమోదు చేసుకోవలెను.దీనికి సంబంధించి ఇదే వరకే కావాల్సిన అర్హతలు ఏమిటి,ఈ ఓటు కార్డ్ కి Offline మరియు Online లో ఏవిధంగా చేసుకోవాలో కూడా చెప్పడం జరిగింది. కావున కావాలంటే ఈ క్రింది లింక్ లు ఓపెన్ చేసి తెలుసుకోగలరు.
ఈ MLC ఓటర్ కార్డ్ నమోదుకు కావాల్సిన అర్హతలు,నిబంధనలు,చివరి తేదీ ఇలాంటి వివరాలకు ఈ క్రింది ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి తెలుసుకోగలరు.
LINK: CLICK HERE
ONLINE లో మన ఓటు కార్డ్ ని మనమే రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కలదు.కావున దీనికి సంబంధించిన లింక్ ఈ క్రింద ఇవ్వబడుతుంది. దానిమీద క్లిక్ చేసి సులభంగా రిజిస్టర్ అవగలరు.
Website Link: CLICK HERE
1) MLCకి సంబంధించి అప్లికేషను స్టేటస్ తెలుసుకోవడం ఎలా ?
జ) ఇక్కడ గ్రాడ్యుయేట్ కి సంబంధించి FORM-18 ద్వారా మీరు ONLINE లో నమోదు చేసుకుని వున్నా,లేదా టీచర్స్ కి సంబంధించిన FORM-19 ద్వారా రిజిస్టర్ చేసుకుని వున్నా మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వచ్చి వుంటుంది. ఇప్పడు ఆ అప్లికేషన్ నెంబర్ ఆధారంగా మన అప్లికేషన్ APPROVE అయిందా లేదా REJECT అయిందా అని మనమే స్టేటస్ ని తెలుసుకోవచ్చును.కావున దీనికి సంబంధించిన లింక్ ఈ క్రింద ఇవ్వబడింది. దానిమీద క్లిక్ చేసుకోవాలి.
పై లింక్ ఓపెన్ చేయగా మొదటి పేజీ ఈ క్రింది విధంగా వస్తుంది.ఇక్కడ FORM-18 మరియు FORM-19 అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.అందులో మీరు గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డ్ కి సంబంధించిన స్టేటస్ చూసుకోవాలి అనుకుంటే మొదటగా వుండే FORM-18 ని సెలెక్ట్ చేసుకొని క్రింద నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. లేదా మీరు టీచర్స్ MLC లకు సంబంధించిన స్టేటస్ చూసుకోవాలి అనుకుంటే FORM-19 పై సెలెక్ట్ చేసుకుని మీ అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి.
గమనిక: ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మనకు ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా మొత్తాన్ని ఎంటర్ చేసుకోవాలి.
ఉదాహరణకు: F18-33270XXXX
పైన వివరాలు ఇచ్చి Search పైన క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా దరఖాస్తుదారుని వివరాలు కనిపిస్తాయి.ఆ తరువాత చివరన View Status అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిమీద క్లిక్ చేయాలి.
ఇక్కడ ఈ పేజీ నందు ఏ క్రింది విధంగా MLC REGISTRATION USER STATUS అని మీ వివరాలతో పాటు STATUS ఆప్షన్ దగ్గర Application is Sent to BLO Verification అని అయినా ఉండచ్చు.లేదా APPROVED,REJECT అని ఉంటాయి.
Application is Sent to BLO Verification
ఈ విధమైన స్టేటస్ చూపిస్తే మీరు ఆన్లైన్ లో మీ సర్టిఫికెట్స్ ని ఏవైతే ఇచ్చారో వాటికి సంబంధించిన ఒరిజినల్స్ ను వేరిఫికేషన్ చేయడానికి మిమ్మల్ని కలుస్తారు.
APPROVED: ఈ విధముగా ఉంటే మీ కార్డ్ విజయవంతంగా ధృవీకరించబడిందని అని అర్థం.ఆ తరువాత కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చెసుకోవాలో కూడా తెలియజేస్తాను.
REJECTED: ఈ విధమైన స్టేటస్ చూపించినట్లయితే మీ అప్లికేషను కి తగిన ఆధారాలు లేనిచో రిజెక్ట్ చేయబడుతుంది.
మీ BLO కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ని ఏ విధంగా తెలుసుకోవాలి ?
జ) దీనికి సంబంధించి ఎలెక్షన్ కమిషన్ ప్రతి సిటిజెన్ కి కూడా మీ సాధారణ ఓటర్ కార్డ్ నెంబర్ (సార్వత్రిక ఎన్నికలలో వాడే కార్డ్) ని ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసుకున్నట్లయితే ఈ క్రింది విధంగా మీ BLO పేరు, మొబైల్ నెంబర్ కూడా వస్తుంది.కావున మీకు ఎలాంటి సందేహాలు ఉన్ననూ వారికి కాంటాక్ట్ అవచ్చును.
ఈ MLC ఓటర్ కార్డ్ పైన ఎలాంటి సందేహాలు ఉన్ననూ,లేదా ఏదైనా ఫిర్యాదు చేయదలచిన ఎన్నికల కమీషన్ ఒక TOLL FREE NUMBER ఇచ్చింది,అది 1950. ఈ నెంబర్ కి ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సంప్రదించవచ్చును.
EMAIL: ceo_andrapradesh@eci.gov.in
0 Comments