YSR Kalyana Masthu-YSR Shadi Thofa Apply Process-2022
ఈ పేజీ లో మనం ఇప్పుడు YSR కల్యాణ మస్తు మరియు YSR షాదీ తోఫా కి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసుకుందాం.ఈ పేజీ లో ఉన్న సమాచారం పూర్తిగా తెలుసుకుంటే ఇక ఈ పథకం లో ఎలాంటి సందేహాలు రావు.
YSR కల్యాణ మస్తు & YSR షాదీ తోఫా: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా ఆడపిల్లలు కన్న పేద తల్లి తండ్రులకు పెళ్లి సమయం లో ఆర్ధిక భారం తో ఇబ్బందులు పడుతారని..అలాంటి వారికి సహాయం చేయడం కొరకు తెచ్చిన పథకమే ఈ YSR కల్యాణ మస్తు అదే విధంగా ముస్లిం కుటుంబాలకు సంబంధించి YSR షాదీ తోఫా తేవడం జరిగింది.ఇప్పుడు మనం ఏయే కులాల వారికి ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నారు,అదేవిధంగా దీని పొందుటకు ఉండాల్సిన అర్హతలు గురించి తెలుసుకుందాం.
1)ఈ పథకాల ద్వారా ఏయే కులాల వారికి,ఎంత ఆర్ధిక సాయం చేస్తారు?
జ) SC కులానికి చెందిన అమ్మాయి అదే కులానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటే రూ1,00,000 ఇస్తారు.
SC కులానికి చెందిన అమ్మాయి వేరే కులస్తులును వివాహం చేసుకుంటే రూ 1,20,000 ఇస్తారు.
ST కులానికి చెందిన అమ్మాయి అదే కులానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటే రూ 1,00,000 ఇస్తారు.
ST కులానికి చెందిన అమ్మాయి వేరే కులస్తుల అబ్బాయిని వివాహం చేసుకుంటే రూ 1,20,000 ఇస్తారు.
BC కులానికి చెందిన అమ్మాయి అదే కులానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటే రూ 50,000 ఇస్తారు.
BC కులానికి చెందిన అమ్మాయి వేరే కులస్తులును వివాహం చేసుకుంటే రూ 75,000 ఇస్తారు.
ముస్లిం & మైనారిటీ కులాల అమ్మాయి పెళ్లికి అక్షరాల రూ.1,00,000 లు ఇస్తారు.
విభిన్న ప్రతిభా వంతులైన అమ్మాయి వివాహానికి అక్షరాల రూ.1,50,000 ఇస్తారు.ఇక్కడ అబ్బాయికి అంగవైకల్యం వున్నా, లేకపోయిన పర్లేదు అని చెబుతున్నారు.
భవన కార్మికులు అయితే ఈ ఆర్ధిక సాయం క్రింద రూ 40,000 లు ఇవ్వనున్నారు.
2) దరఖాస్తు చేసుకున్నాక ఎప్పుడు డబ్బులు ఇవ్వనున్నారు ?
జ) రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ అక్టోబర్ 1, 2022 నుండి వివాహం చేసుకున్న వారికి ఈ ఆర్ధిక సాయం ఇవ్వనున్నారు.ఇక్కడ G.O లో ఉన్న విధంగా అక్టోబర్, నవంబర్,డిసెంబర్ లో ధరఖాస్తు చేసుకున్న వారందరికి ఫిబ్రవరి నెలలో డబ్బులు జమ చేయనున్నారు. అదే విధంగా జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలలో ధరఖాస్తు చేసుకున్న వారికి మే నెలలో ఇవ్వనున్నారు,మరియు ఏప్రిల్,మే, జూన్ నెలలలో దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్ట్ లో డబ్బులు ఇవ్వనున్నారు.అదేవిధంగా జులై,ఆగస్టు, సెప్టెంబర్ లలో దరఖాస్తు చేసుకుంటే నవంబర్ లో ఇవ్వనున్నారు.
అర్హతలు
1) వయస్సు: అమ్మాయికి 18 సంవత్సరాలు మరియు అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
2) మొదటి సారి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది.కానీ ఇక్కడ వితంతులు (భర్త చనిపోయిన) మళ్లీ వివాహం చేసుకుంటే మాత్రం వర్తిస్తుంది.
3) విద్యార్హత : వధువు,వరుడు ఇద్దరూ కూడా 10 వ తరగతి పాస్ అయి ఉండవలెను.
4)పెళ్లి కూతురు కి కావాల్సిన వివరాలు
1.ఆధార్ నెంబర్
2.లింగం
3.మొబైల్ నెంబర్,ఈమెయిల్
4.పుట్టిన తేదీ కి సంబంధించిన వివరాలు
5.మతం మరియు కుల దృవీకరణ వివరాలు
6.SSC సర్టిఫికెట్
7.తల్లిదండ్రులు పేర్లు,ఆధార్ నంబర్లు
8.తల్లిదండ్రులు శాశ్వత చిరునామా
9.భవన కార్మికుల కార్డ్ నెంబర్ (పెళ్లి కుమార్తెది లేదా తల్లిదండ్రులు ది ఎవరిదైన )
పెళ్లి కుమారుడికి సంబంధించిన వివరాలు
1.ఆధార్ నెంబర్
2.లింగం
3.మొబైల్ నెంబర్,ఈమెయిల్
4.పుట్టిన తేదీ కి సంబంధించిన వివరాలు
5.మతం మరియు కుల దృవీకరణ వివరాలు
6.SSC సర్టిఫికెట్
7.తల్లిదండ్రులు పేర్లు,ఆధార్ నంబర్లు
8.తల్లిదండ్రులు శాశ్వత చిరునామా
4) Ekyc : పెళ్లి కూతురికి మరియు పెళ్లి కొడుకుకి ఆధార్ ekyc చేస్తారు.
5) ఫీల్డ్ వేరిఫికేషన్ చేసేటప్పుడు అవసరమగు డాకుమెంట్స్
1) వివాహ ధ్రువీకరణ పత్రం
2)పెళ్లి పత్రిక మరియు పెళ్లి ఫోటోలు
3) AP సేవా పోర్టల్ పొందిన కుల ధ్రువీకరణ పత్రం(సాచివాలయం / మీసేవ)
4) వయస్సు నిర్ధారణకు పెళ్లి కూతురు మరియు పెళ్లినకుమారుడు యొక్క ఆధార్ నంబర్లు
5) విద్యార్హత కి SSC పాస్ సెర్టిఫికెట్
6) అంగవైల్యం ఉన్నవారు సదరం సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది
7) వితంతువు అయితే మొదటి భర్త డెత్ సెర్టిఫికెట్ లేదా వితంతు పెన్షన్ కార్డ్,ఈ రెండు లేకపోతే అఫిడవిట్ పెట్టాల్సి ఉంటుంది.
8)భవన నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డ్
ఫీల్డ్ వేరిఫికేషన్ చేయు విధానము
వివాహం అయిన 60 రోజుల లోపల సచివాలయం లో ఆన్లైన్ చేశాకా గ్రామాల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ (WEA),అదే పట్టణాలలో అయితే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రెటరీ (WEDS) ఫీల్డ్ వేరిఫికేషన్ ఈ క్రింది విధముగా చేస్తారు.
A) వివాహం అయినట్టు ధ్రువీకరణ కోసం పెళ్లి కూతురు ఇంటికి వస్తారు.
B) పెళ్లి కూతురు చుట్టుపక్కల వారిని విచారించడం జరుగుతుంది.
C) సచివాలయ సెక్రెటరీ పెళ్లి కూతురు మరియు పెళ్లి కుమారుడుతో సెల్ఫీ ఫోటో తీసుకుంటారు.
ఈ పెళ్లి కానుక కోసం ఎన్ని రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చును ?
జ)ఈ ఆర్ధిక లబ్ది కోసం ప్రభుత్వం రెండు రకాల అవకాశం ఇచ్చారు.
Offline: సచివాలయం లో వివాహం జరిగిన 60 రోజుల లోపల పైన తెలిపిన డాకుమెంట్స్ తో దరఖాస్తు చేసుకోవచ్చు.
![]() |
NBM PORTAL |
Online: పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు ఇలా ఎవరైనా నేరుగా ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని అంటున్నారు కానీ ప్రస్తుతం సిటిజెన్ డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఇంకా అమలులోకి రాలేదు.వస్తే తప్పకుండా తెలియజేస్తాను.
0 Comments