Ap police constable notification 2022
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ రోజు వరకు (26-11-2022) ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు
- 1) క్రొతగా AP CMMS APP ప్రారంభం
- 2) 6,511 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ కి సంబంధించి
- 3) కానిస్టేబుల్ పోస్టులో హోమ్ గార్డ్ లకు రిజర్వేషన్లు
- 4) పాస్ పోర్ట్ లో ఇంటి పేరు ఉండాలని నిబంధన
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవగలరు.
![]() |
WATSAPP & TELEGRAM |
1) క్రొతగా AP CMMS APP ప్రారంభం
పురపాలక,పట్టణాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులతో శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి సూచించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అందులో AP CMMS (AP Consulting Monitoring Of Muncipal Services) అనే యాప్ గురించి చెబుతూ,ఈ యాప్ నగరాలు,పట్టణాలలో కనీస మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ మరియు సమస్యల పరిష్కారాని కోసం ప్రత్యేకంగా తయారుచేయనున్నారు.
ఈ యాప్ పనితీరు - ఉపయోగాలు
ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మరో నెల రోజుల్లో ఈ యాప్ ని డిజైన్.దీని ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే నగరాలు,పట్టణాలకు సంబంధించి ఎక్కడైనా, ఎప్పుడైనా,ఎవ్వరైనా రోడ్ల మరమ్మతులు కి సంబంధించిన సమస్యలపై ఫోటో తీసి ఈ యాప్ లో అప్లోడ్ చేస్తే, ఆ వ్యక్తి సూచించిన సమస్య బట్టి ఎన్ని రోజుల్లో మరమ్మతులు చేయగలమో కూడా ఒక SLA పీరియడ్ కూడా ఇవ్వాలని సూచించారు.
2) 6,511 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ కి సంబంధించి
ఆంద్రప్రదేశ్ లోని పోలీస్ ఉద్యోగార్థులకు ఒక శుభవార్త తెలియజేసారు.రాష్ట్ర ప్రభుత్వం 6,511 పోస్టులకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలియజేసారు.దీనికి సంబంధించి పోస్టుల వివరాలు మరియు ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
SI (Civil) - 387 Posts
SI (APSP) - 96 Posts
Constable (Civil) - 3508
APSP Constable (AR Betalian) : 2,520
ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరణ : డిసెంబర్ నాటికి
ఎంపికైన వారికి శిక్షణ : జూన్ 2023 నుండి ప్రారంభం
పోస్టింగ్ : ఫిబ్రవరి 2024 లో ఇవ్వనున్నారు.
3) కానిస్టేబుల్ పోస్టులో హోమ్ గార్డ్ లకు రిజర్వేషన్లు
ఈ పోస్టలలో హోమ్ గార్డ్ లకు ఎప్పుడూ లేని విధముగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది.అది కూడా వివిధ కేటగిరీలు ప్రకారం ఇవ్వనున్నారు.పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
4) పాస్ పోర్ట్ లో ఇంటి పేరు ఉండాలని నిబంధన
తమ దేశానికి వచ్చే పర్యాటకులు మరియు వర్క్ వీసా పొందినవారు మీ పాస్ పోర్టులలో తప్పనిసరిగా ఇంటి పేరుని జత చేసుకోవాలని UAE (United Arab Emirates) అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కావున భారతీయులు చాలా మందికూడా పొట్టకూటి కోసం అరబ్ దేశాలకు వెలితూ వుంటారు. కావున ఖచ్చితంగా దీనిమీద ప్రభుత్వం విధించిన క్రొత్త నిబంధనను కూడా తెలుసుకుని ఆ లాగా ఇంటి పేరు లేకుంటే Online లో దరఖాస్తు చేసుకోవాలని UAE లోని భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.
0 Comments