Ayushman bharath card free Download
ప్రధానాంశాలు
1) Introduction - మొదట గుర్తించుకోవాల్సిన అంశాలు
2) ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు డౌన్లోడ్ లింక్
3) ఈ కార్డు ద్వారా ఏయే హాస్పిటల్స్ లో చూస్తారు
4) Toll Free Numbers
5) Download చేయు విధానం Demo వీడియో
Introduction
Ayushman Bharat Card -ఈ పేజీ లో మనము ఇప్పుడు మన మొబైల్ లోనే ఉచితంగా, సులభంగా Ayushman Bharat Card ని Download చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం.దీనిని మొబైల్ యాప్ ద్వారా అయినా లేదా డైరెక్ట్ వెబ్సైటు ద్వారా అయినా 2 విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.ఈ పేజీ లో మనం వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని చూద్దాం.
గమనిక 1 - నేను క్రింద ఇవ్వబోయే లింక్ మీద క్లిక్ చేసుకుని అక్కడ Approved అని వున్నవారికి మాత్రమే ఈ Ayushman Bharat Card ని Download చేసుకోవచ్చును.అలా కాకుండా పెండింగ్ అని ఉంటే ఎలా చేసుకోవాలో అని తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మరొక్క సారి వివరంగా చెబుతాను.
గమనిక 2 - అంతకంతే ముందు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కి మరియు రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ కార్డు కి మధ్య గల వ్యత్సాసాలను తెలుసుకోవాలి.దీనికి సంబంధించి చాల వివరంగా ఈ క్రింది వీడియో లో ఇవ్వడం జరిగింది.
Ayushman Bharat Card Download Process
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు డౌన్లోడ్
మొట్ట మొదటగా మనం Ayushman Bharat Card ని Download చేసుకోవాలంటే ఖఛ్చితంగా ekyc కంప్లీట్ అయి ఉండాలి.అలాంటి వాళ్ళు మాత్రమే ఈ క్రింద ఇచ్చిన Link ని ఓపెన్ చేసుకుని కార్డు ని డౌన్లోడ్ చేసుకోగలరు.
LINK - CLICK HERE
step 1 - పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగానే పేజీ ఈ క్రింది విధంగా వస్తుంది.అక్కడ Login దగ్గర Beneficiary మరియు Operator అనే ఆప్షన్స్ వస్తాయి.
Beneficiary - దేశంలో ఏ వ్యక్తి అయినా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ ఇచ్చి verify చేసుకున్నాక login,OTP ఇచ్చి సులభంగా లాగిన్ అవచ్చు.
Operator - ఈ ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలంటే ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా అనుమతి కలిగి ఉండాలి.అదే ఆంధ్రప్రదేశ్ కి చెందిన గ్రామ/వార్డ్ వాలంటీర్స్ కి మాత్రo ఇది వరకే అవకాశం కలదు.వారి లాగిన్ ద్వారా గ్రామం,లేదా వార్డు లోని అందరి వివరాలు చెక్ చేయవచ్చును.లేదంటే Ayushman Card లను డౌన్లోడ్ కూడా చేయవచ్చును.
Step 2 - ఇక్కడ రాష్ట్రము,జిల్లా ఎంచుకున్నాక చివరన Search By దగ్గర 5 ఒప్షన్స్ ద్వారా తెలుసుకోవచ్చు.అందులో నేను ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి search మీద క్లిక్ చేస్తే దాని క్రింద మీ కుటుంబ సభ్యుల వివరాలు చూపిస్తుంది.
Step 3 - పైన చూపించిన దగ్గర Approved కార్డు డౌన్లోడ్ అవుతుంది.ఆలా లేకుండా పెండింగ్ ని ఉంటే ఎలా అప్ప్రొవె చేసుకోవాలో మరొక్క వీడియోలో చెప్పుకుందాం.అక్కడే చివరన Action అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా వస్తుంది.అక్కడ ఆధార్ నెంబర్ ప్రక్కన Verify మీద క్లిక్ చేసి OTP లేదా బయోమెట్రిక్,Irish అనే 3 ఆప్షన్స్ ద్వారా authenticate చేసుకోవాలి.
Step 4- ఈ పేజీ లో మీ కుటుంబసభ్యుల ఫోటోలతో చూపిస్తూ అక్కడే చివరన Download ఆప్షన్ ఉండి,అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తుంది.
Step 5 - చివరగా కార్డు డౌన్లోడ్ అయితే ఈ క్రింది విధంగా ఉంటుంది.దీని మీరు ప్రింట్ తీసుకుని దేశవ్యాప్తంగా వున్నా హాస్పిటల్స్ లో చికిత్సలు పొందవచ్చును.
ఈ కార్డు ద్వారా ఎయే హాస్పిటల్స్ లో చూసుకోవచ్చును ?
దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైటు లింక్ ని ఈ క్రింద ఇవ్వబడుతుంది.అక్కడ క్లిక్ చేసుకుని మీ వివరాలు ఇచ్చి ఏ వ్యాధికి ఏ హాస్పిటల్ లో ఈ కార్డు ద్వారా చికిత్సలు చేస్తారో తెలుసుకోవచ్చును.
LINK- CLICK HERE
4) Toll Free Numbers
ఆంద్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళకి - 104 (call)
మిగిలిన అన్ని రాష్ట్రాల ప్రజలకు - 14555 (call)
5) Download చేయు విధానం Demo వీడియో
Related Links
PM విశ్వకర్మ యోజన పథకం - Click here
ఓటర్ కార్డు డౌన్లోడ్ ప్రాసెస్ - Click Here
Conclusion
ఈ పేజీలో కేవలం ekyc కంప్లీట్ అయి వుండి, Approved అని వున్న వారికి కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని చెప్పుకున్నాం, అదే విధముగా మరొక్క పేజీ నందు ఇన్క్ ekyc పెండింగ్ ఉంటే,అలంటి వాళ్లకి ఎలా Ayushman Bharath Card ని Download చేసుకోవాలో చెప్పుకుందాం.
1 Comments
అప్రూవ్ కాలేదు సార్ మాకు అప్రూవల్ కావాలి అంటే ఏమీ చేయాలి ABHA కార్డు కు ఇంతకముందు సచివాలయం లో ekyc చేసినాము సార్
ReplyDelete