Voter Card Download Process-2022
ఈ పేజీ నందు మనం ప్రధానంగా వివరించుకోబోయే అంశాలు ఇవే..!
1) ఓటరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎవరికి అవకాశం ఉంది ?
2) ఓటరు కార్డ్ డౌన్లోడ్ కొరకు కావాల్సిన వివరాలు ఏమిటి ?
3) ఓటరు కార్డ్ డౌన్లోడ్ చేయు విధానము
4) ఓటరు కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏమి చేయాలి ?
మరిన్ని ఇలాంటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నారా..అయితే ఈ క్రింది ఇచ్చిన గ్రూపు లలో జాయిన్ అవండి.ఎల్లప్పుడూ అప్డేట్స్ ఇస్తుంటాను.
JOIN WATSAPP : CLICK HERE
JOIN TELEGRAM : CLICK HERE
ఓటరు కార్డ్: దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ రకమైన అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అది ఏమిటంటే గత రెండు,మూడు సంవత్సరాలుగా ఓటరు కార్డ్ కొరకు క్రొతగా దరఖాస్తు చేసుకున్నవారు,ఏదైనా వివరాలు మార్చుకున్న వారు ఉన్నా మరీ ముఖ్యంగా ఓటరు కార్డ్ ఏ కారణం చేతనైనా పోగొట్టుకుని ఉన్నవారికి మరలా ఓటరు కార్డ్ పొందాలంటే డౌన్లడ్ ఆప్షన్ లేకుండా అయిపోయింది.కావున ప్రజలందరూ ఈ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.బహుశా అందరూ ఎదురు చూస్తున్నట్టు గానే ఈ డౌన్లోడ్ ఆప్షన్ రానే వచ్చింది.ఇంకెందుకు ఆలస్యం అందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.
1) ఓటరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎవరికి అవకాశం ఉంది ?
జ) ఈ ఓటరు కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇప్పటి వరకు క్రొతగా నమోదు చేసుకున్న వారికి ఉండేది.కానీ ఇప్పుడు క్రొత్త,పాత ఎవరైనా ఓటరు కార్డ్ లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు.
2) ఓటరు కార్డ్ డౌన్లోడ్ కొరకు కావాల్సిన వివరాలు ఏమిటి ?
జ) ఇప్పుడు వచ్చిన క్రొత్త నిబంధనల ప్రకారం ఓటరు కార్డ్ ని సిటిజెన్ డౌన్లోడ్ చేసుకోదలస్తే తప్పకుండా ఓటరు కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది.కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు.
3) ఓటరు కార్డ్ డౌన్లోడ్ చేయు విధానము ఎలా ?
జ) ముందుగా ఈ ఓటరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసుకోండి.ఈ రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.
VOTER DOWNLOAD |
PAGE 1: మొదట ఈ రకమైన పేజీ ఓపెన్ అయినప్పుడు సిటిజెన్ అక్కడ చూపించే ఏ సర్వీస్ అయిననూ స్వoతంగా చేసుకోదలస్తే ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
గమనిక: అక్కడ లాగిన్ అవ్వాలంటే అంతకుముందుగా ఈ సైట్ నందు రిజిస్టర్ చేసుకోవాల్సిఉంటుంది.ఈ క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ కి సంబంధించిన లింక్ ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ మరియు OTP సాయంతో USER NAME అదేవిధంగా PASSWORD ని సెట్ చేసుకోవాలి.
REGISTRATION LINK |
PAGE 2: పైన చెప్పిన విధంగా విజయవంతం గా User Name, Password Create చేసుకున్నాక, దాని సాయంతో లాగిన్ అవ్వాలి.లాగిన్ అయితే ఈ క్రింది చూపించిన ఆప్షన్ లలో epic Card Download అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాల్సి వుంటుంది.
PAGE 3: ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ కానీ లేదా రెఫరెన్స్ నెంబర్ గానీ ఇచ్చి,దాని క్రింద ఆప్షన్లో మీ రాష్ట్రం ని ఎంచుకుని Search ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మొబైల్ నెంబర్ లింక్ లేకపోతె !
ఇక్కడ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతె ఈ క్రింది విధమైన వివరాలు చుపిస్తోంది.దాని అర్థం ఏమిటంటే మీ ఓటరు కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేనందున కార్డ్ డౌన్లోడ్ చేయుటకు వీలుపడదు,అని అర్థం.
మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఈ క్రింది విధంగా చూపించినట్లు Send Otp పై క్లిక్ చేసి,ఓటరు కార్డ్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసి VERIFY చేయాలి.అంతటితో విజయవంతం గా వెరిఫై చేసుకుని CAPTCHA ని ఎంటర్ చేస్తే DOWNLOAD ఆప్షన్ వస్తుంది.దాని మీద క్లిక్ చేయగా మీకు ఓటరు కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది.
ఈ ఓటరు కార్డ్ PDF లో డౌన్లోడ్ చేసుకుని మాములు గా లామినేషన్ చెసుకోవచ్చు.లేదంటే మార్కెట్లలో అందిచే PVC కార్డ్ ల పై కూడా ప్రింట్ తీసుకుని ఓటరు కార్డ్ ని ఉపయోగించుకోవచ్చును.
4) ఓటరు కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏమి చేయాలి ?
జ) Offline లో అయితే మీరు చేయాల్సిందల్లా FORM-8 అనేది అప్లికేషన్ నింపి అందులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తున్నట్టు పెట్టి మీ BLO కి అందచేస్తే దానిని APPROVE చేస్తారు.
PDF APPLICATION: CLICK HERE
మీ BLO ని తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకోండి
KNOW YOUR BLO |
ONLINE లో మొబైల్ నెంబర్ లింక్ చేయడం
దీనిని రెండు రకాలుగా చేసుకోవచ్చు
1) NVSP వెబ్సైట్ లో లాగిన్ అయ్యి చెసుకోవచ్చు.
2) ఈ పద్దతిలో Voter Help Line అనే App ద్వారా సులభంగా చేసుకోవచ్చు.నేను మాత్రం ఈ పద్ధతినే ఖచ్చితంగా రేకమాండ్ చేస్తాను.చాలా సులువుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు.
APP LINK: DOWNLOAD
0 Comments