Pm Vishwakarma yojana Scheme-2023 in Telugu
ముఖ్యాంశాలు
1) Introduction
2) PM విశ్వకర్మ వెబ్సైటు లింక్
3) 18 రకాల చేతి వృత్తులు ఏమిటి ?
4) అర్హతలు - అనర్హతలు
5) 3 లక్షల ఋణం పొందే వివరాలు
6) దగ్గర్లోని CSC సెంటర్ లను తెలుసుకునే లింక్
7) help Line Numbers
8) PM విశ్వకర్మ యోజన పథకం వీడియో రూపంలో
ఈ పేజీ లో మనం కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టినటువంటి Pm Vishwakarma yojana అనే పథకం గురించి చాలా వివరంగా చెప్పుకోబోతున్నాము.
1) Introduction
ఈ Pm Vishwakarma yojana పథకం అనేది దేశవ్యాప్తంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో వున్న చేతి వృత్తి కళాకారులకు, వారు చేసేటటువంటి వృత్తులలో ఇప్పటి కాలానికి తగ్గట్టుగా మరింత నైపుణ్యత పెంపొందించేటట్టు చేస్తూ అదే క్రమంలో వాళ్ళు చేసే వృత్తికి ఆర్ధికంగా తోడ్పాటునిచ్చే విధంగా ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను 1 లక్ష నుండి 3 లక్షల వరకు ఇవ్వనున్నారు.
ఈ పథకాన్ని గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి అయినంటువంటి నిర్మల సీతారామన్ గారు గత 2023-24 బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేస్తూ, ఈ పథకం కొరకు దేశవ్యాప్తంగా వున్న హస్త కళాకారులకు అందులో మొదటి విడత క్రింద దాదాపు 30 లక్షల మందికి 13 వేల కోట్లను ఖర్చు చేయనున్నామని, మరియు ఈ పథకం అనేది 2027-28 వ ఆర్ధిక సంవత్సరం వరకు అమలు చేస్తూన్నారని తెలియజేసారు. ఈ పథకాన్ని మొదటగా PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన అని కూడ పిలిచేవాళ్ళు.ఇంకా సులభంగా అందరూ PM విశ్వకర్మ యోజన అని చెప్పుకుంటున్నారు.అలాగే ఈ పథకానికి సంభందించి ప్రధాన మంత్రి నరేంద్ర మోధీ పుట్టిన రోజు అయినటువంటి Sep 17 వతేదీన Online Registrations ని తీసుకోనున్నారు.
గమనిక - దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో 254 జిల్లాలను పైలట్ ప్రాజెక్టు క్రింద తీసుకుని రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన 3 జిల్లాలు అంటే తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలలోని చేతి వృత్తి కళాకారులకి ప్రస్తుతం ఈ అవకాశాన్ని కల్పించివున్నారు.కానీ త్వరలోనే అన్ని జిల్లాలలో కూడా అమలు అయ్యేలా చూస్తారు.
2) Pm Viswa karma Yojana Official Website
PM విశ్వకర్మ యోజన అధికారిక వెబ్సైటు
3) PM విశ్వ కర్మ పథకం అనేది ఎయే వృత్తుల వారికీ వర్తిస్తుంది?
Who is Eligible For PM Viswakarma Yojana Scheme
ఈ విశ్వ కర్మయోజన పథకాన్ని మొదటి విడతలో భాగంగా ఈ క్రింది సూచించిన 18 రకాల చేతి వృత్తుల వారికీ అవకాశం కల్పించారు.
1) వడ్రంగులు
2) పడవలు తయారు చేసేవాళ్ళు
3) ఆయుధాలు లేదా కవచ తయారీ దారులు
4) కుమ్మరులు
5) సుత్తి / మరేదైనా పరికరాల తయారీ
6) తాళాలు తాయారు చేసేవాళ్ళు
7) కమ్మరులు (eg: కుండలు తయారు చేసేవాళ్ళు )
8) శిల్పులు ( ప్రతిమలు,రాళ్ళపై శిల్పాలు చెక్కేవాళ్ళు లేదా రాళ్లను పడగల గొట్టే వృత్తిలో వున్ననూ)
9) బంగారం పని చేసే వాళ్ళు
10) చెప్పులు తయారీ దారులు మరియు చర్మకారులు
11) తాపీ పని చేసేవాళ్లు
12) గంపలు/చాపలు/చీపురులు తయారు చేసే వాళ్ళు
13) కొబ్బరి నారతో తయారు చేసే వస్తువులు లేదా సంప్రదాయ ఆట బొమ్మలు తయారు చేసేవాళ్ళు
14) క్షురకులు (నాయి బ్రాహ్మణులు )
15) పూల మాలలు తయారీదారులు
16) రజకులు
17) టైలర్లు
18) చేపలు పట్టె వలలను తయారు చేసే వాళ్ళు
4) PM విశ్వ కర్మ పథకం యొక్క అర్హతలు ఏమిటి ?
PM Viswakarma Yojana Scheme Eligibility ?
- కనీస వయస్సు రిజిస్ట్రేషన్ చేయు సమయానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- పైన తెలిపిన 18 రకాల వృత్తులలో ఏదైనా ఒక వృత్తి అయినననూ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి.
- గత 5 సంవత్సరాలలో PMEGP, PM SVANIDHI, MUDRA వంటి లోన్ లు పొంది ఉండకూడదు.ఒకవేళ గతంలో ఋణము పొంది తరువాత పూర్తిగా చెల్లించి ఉన్నట్లయితే ఈ పథకానికి అర్హులు.
- కుటుంభంలో ఒకరు మాత్రమే అర్హులు
అనర్హతలు
- ప్రభుత్వ ఉద్యోగులు గానీ వారి బార్యా,పిల్లలు గానీ ఈ పథకానికి అనర్హులు.
- ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేయు సమయానికి PMEGP, PMSVANIDHI, MUDRA లాంటి లోన్స్ Active గా ఉండకూడదు.
ఈ PM విశ్వకర్మయోజన పథకానికి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి?
Documents Requires For PM Viswakarma yojana Scheme In Telugu
1) హస్తకళ లబ్ధిదారుడు యొక్క జెరాక్స్
2) కుటుంభం సభ్యుల అందరి ఆధార్ కార్డులు జిరాక్సులు
3) బ్యాంక్ పాస్ బుక్
4) అడ్రెస్స్ ప్రూఫ్ (రేషన్ కార్డు / రైస్ కార్డు / కరెంట్ బిల్/ ఓటరు కార్డు / ప్రభుత్వ ఆమోదించిన కార్డ్స్ )
5) మీ ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ (OTP తో చేయాల్సి వుంది కాబట్టి )
6) రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా లబ్ది పొందబోయే వ్యక్తి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది.
7) పాన్ కార్డు (తప్పని సరి కాదు)
5) ఈ Pm Viswakarma పథకం వలన లాభాలు ఏమిటి ?
Benefits Of Pm Viswakarma Yojana Scheme
- ఈ పథకం ద్వారా కళాకారులకు వారి వృత్తి మీద నైపుణ్యత ఇంకా బాగా వచ్చే విధముగా శిక్షణ ఇస్తారు.
- శిక్షణ తీసుకున్న వారికీ PM విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు ID కార్డు లను ఇస్తారు.
- ఈ శిక్షణ కూడా 2 దఫాలుగా ఉంటుంది.మొదటి దఫాలు ప్రాథమిక శిక్షణ క్రింద 5 నుండి 7 రోజులు (గరిష్టంగా 40 గంటలు) ఇస్తారు.మరియు Advanced Training క్రింద మరో 15 రోజులు మార్కెటింగ్ ( గరిష్టంగా120 గంటలు) మరియు అమ్మకాలపై ఉచిత ట్రైనింగ్ ఇస్తారు.
- ఈ ఉచిత ట్రైనింగ్ లో హస్త కళాకారులకు సర్టిఫికెట్ తో పాటు రోజుకి రూ 500 ను శిక్షణ కాలంలో వసతి,భోజనం తోపాటు స్టైఫండ్ రూపంలో ఇవ్వనున్నారు.
- అలాగే శిక్షణ పూర్తి అవగానే ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా అధునూతన పరికరాలు ఏవైనా కొనుగోలు చేసుకోవడానికి రూ 15,000 లను ఆర్థికసాయం చేయనున్నారు.
- వారి యొక్క వృత్తి కి తోడ్పాటుగా ఉండటం కొరకు శిక్షణ పూర్తి అయినా తర్వాత మొదటి విడతగా1 లక్ష రూపాయలు మరియు రెండవ విడత క్రింద మరో 2 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాన్ని మంజూరు చేయనున్నారు.
- డిజిటల్ చెల్లింపులు చేసేవారికి రూ100 లకు 1 రూపాయి వచ్చేవిధంగా గరిష్టంగా నెలకు 100 transactions కి ఇది వర్తించేటట్టు ప్రోత్సహిస్తున్నారు.
లోన్ చెల్లింపు విధానము మరియు వడ్డీ లెక్కింపు విధానము
PM Viswa karma Loan And Interest
- 1లక్ష రుణాన్ని 18 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది.
- 2 లక్షల రుణాన్ని 30 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది.
- 5% వడ్డీ రేటు తో సబ్సిడీ గా ఇవ్వనున్నారు.
PM విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తు చేయు విధానము ఎలా?
How to apply PM Viswakarma Yojana scheme
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి Sep -17వ తేదీ నుండి Online లో అవకాశం ఇచ్చారు.కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క హస్త కళాకారుడు సద్వినియోగం చేసుకోవలెను.
Online Apply Website Link
- ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు అయితే మాత్రం మీ దగ్గర్లోని సచివాలయంలోకి వెళ్లి వెల్ఫేర్ సెక్రటరీని సంప్రదించాలి.వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ ద్వారా CSC లాగిన్ లో ఉచితంగా దరఖాస్తు చేసి ఇస్తారు.
- తెలంగాణా కి చెందిన వాళ్ళు ఉంటే మాత్రం దగ్గరలోని CSC సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవలెను.
PM Viswa karmaYojana CSC లాగిన్ - Click Here
6) దగ్గర్లోని CSC సెంటర్ ని తెలుసుకునే లింక్ - Click Here
గమనిక: సిటిజెన్ లాగిన్ ప్రస్తుతానికి ఓపెన్ చేస్తుంటే CSC లాగిన్ లో వెళ్లి చేసుకోండి అని చూపిస్తుంది.
7) HELP LINE NUMBERS
ఈ పథకానికి సంబంధించి మీ రాష్ట్రాలలో ఏమైనా సమస్యలు మరియు సందేహాలు ఉన్నచో అధికారికంగా ఇచ్చిన రాష్ట్రాల వారీగా నోడల్ ఆఫీసర్స్ యొక్క నంబర్స్ ని సంప్రదించవచ్చును.
0 Comments