AP Ration Card New Services 2025 – How to Apply Online in Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదట సారి Ration card కి సంబంధించి 6 సర్వీసులను ప్రారంభించారు. కనుక ఈ Website లో ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తున్నాను, కాబట్టి ప్రజలకు రేషన్ కార్డులపై వున్న సందేహాలు అన్నీ కూడా వివరించడం జరుగుతుంది.
What are the New Ration Card Services Launched in AP (2025)?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఈ క్రింది సర్వీసులను 07-05-2025 నుండి ప్రారంభించింది.
1.కొత్త బియ్యం కార్డు
2. బియ్యం కార్డు లో వ్యక్తులను జోడించడం
3. బియ్యం కార్డు విభజన
4. బియ్యం కార్డు లో వ్యక్తిని తొలగించుట
5. ఆధార్ సీడింగ్ కరెక్షన్
6. అడ్రస్ చేంజ్
7. సరెండర్ రైస్ కార్డు
Who is Eligible for a New Ration Card in Andhra Pradesh?
కొత్తగా రైస్ కార్డు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తేదీ నాటికి అంటే ఈ మే 8 వ తేదీ వరకు ఎలాంటి అధికారక సమాచారం ఇవ్వలేదు.
రైస్ కార్డు కి సంబంధించిన అర్హతలు ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఇదే వెబ్సైట్లో ఇక్కడే వివరాలను అప్డేట్ చేస్తాను.
గమనిక - హౌస్ మ్యాపింగ్ ఆధారంగా మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.
Documents Required to Apply for AP Ration Card
రైస్ కార్డు పొందుటకు అర్హతలు :
1.కొత్త బియ్యం కార్డు :
- బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడు అయ్యి ప్రజసాధికార సర్వే అనగా హౌస్ హోల్డ్ మాపింగ్ లో తప్పనిసరిగా ఉండవలెను.
- ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయ్యి వుంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రమే అయ్యి ఉండాలి.
ముఖ్య గమనిక : ఇప్పటి వరకు ఎవరికీ అయితే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మ గారి బియ్యం కార్డు లో కానీ అత్త గారి కార్డు లో కానీ లేని వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడును.
2. బియ్యం కార్డు లో వ్యక్తులను జోడించడం :
- చిన్నపిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, పెళ్లి అయిన వధువు ని జోడించుటకు వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు లో వారి యొక్క భర్త పేరు వున్నచో దానిని పరిగణలోకి తీసుకోవడం జరుగును
- ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ఆ గ్రామానిది అయ్యి ఉండవలెను.
Application ఫీజు ఎంత ?
- రైస్ కార్డు అన్ని సర్వీసులకు సచివాలయంలో రూ24/- సర్వీసు ఛార్జ్ ఉంటుంది .
- రైస్ కార్డు విభజన కి మాత్రం రూ 48/- ఉంటుంది.
3. బియ్యం కార్డు విభజన :
బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజాసాధికార సర్వే లో సెపరేట్ గా ఉండవలెను. లేనిచో విభజించుట కుదరదు.
4. బియ్యం కార్డు లో వ్యక్తిని తొలగించుట :
చనిపోయిన వ్యక్తిని మాత్రమే మనం బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగును.
అలా కాకుండా చాలా మంది మా అబ్బాయి అమెరికా లో వున్నాడు తను సంపాదించేది మాకు పెడతాడా కార్డు లో నుంచి తీసేయండి ప్రజాసాధికార సర్వే లో నుంచి తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు అలాంటివాళ్ళకి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ ఇచ్చినపుడు మాత్రమే చేయటం జరుగును గమనించగలరు.
5. ఆధార్ సీడింగ్ కరెక్షన్
తప్పుగా వున్నా ఆధార్ నీ అలా వదిలేసి కొత్త ఆధార్ తో ముందుగా ప్రజాసాధికార సర్వే (హౌస్ మాపింగ్ డేటా) లో యాడ్ అయిన తరువాత మాత్రమే ఆధార్ సీడ్ చేయగలము. గమనించగలరు
6. అడ్రస్ చేంజ్ :
ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా గా ఆ సచివాలయం అడ్రస్ ఉండవలెను మరియు కుటుంబ పెద్ద వేలి ముద్రతో మాత్రమే మనం ఇది చేయగలము గమనించగలరు.
7. సరెండర్ రైస్ కార్డు :
బియ్యం కార్డు వద్దు అనుకున్న వారు వారి యొక్క బియ్యం కార్డు ని స్వచ్చందంగా సరెండర్ చేసుకోవచ్చును.
How to Apply for a New Ration Card Online in AP
ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేటటువంటి కొత్త రైస్ కార్డు దరఖాస్తుకు మీ గ్రామ / వార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
మే 12 వ తేదీ నుండి ప్రజలకు వారి ఫోన్ లోనే సొంతంగా పైన తెలిపిన సర్వీసులన్నీ కూడా చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాట్సాప్ గవర్నన్స్ లో అందుబాటులో ఉంచనున్నారు.
వాట్సాప్ గవర్నన్స్ నెంబర్ - 9552300009
Application Status Checking
సచివాలయం లో దరఖాస్తు చేసిన అప్లికేషన్ యొక్క స్థితి తెలుసుకొనుటకు ఈ క్రింది వెబ్సైటు ద్వారా ఆధార్ నెంబర్ తో గానీ లేదా, అప్లికేషన్ నెంబర్ తోగానీ చెక్ చేసుకోవచ్చును.
Status Link - Click Here
Step-by-Step Process Through sachivalayam
- మొదట సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్ నందు అప్లికేషన్ తోపాటుగా తగిన డాకుమెంట్స్ ని జతపరచి 24/- సర్వీసు ఛార్జ్ తో ఆన్లైన్ చేయించుకోవాలి.
- ఆన్లైన్ అయిన తరువాత ఆ అప్లికేషన్ నెంబర్ తో సచివాలయ VRO ద్వారా ekyc చేయాలి.
- ఆ తరువాత ఆప్లికేషన్ ఆమోదం పొందడానికి MRO లాగిన్ కి వెళుతుంది.
- ఈ సర్వీసు యొక్క కాలపరిమితి 21 రోజులుగా ప్రస్తుతం వుంది .
How to Download the Application Forms
1.కొత్త బియ్యం కార్డు - DOWNLOAD
సింగల్ మెంబెర్ కార్డు ఫారం - Download
2. బియ్యం కార్డు లో వ్యక్తులను జోడించడం - DOWNLOAD
3. బియ్యం కార్డు విభజన - DOWNLOAD
4. బియ్యం కార్డు లో వ్యక్తిని తొలగించుట - DOWNLOAD
5. ఆధార్ సీడింగ్ కరెక్షన్ - DOWNLOAD
6. అడ్రస్ చేంజ్ - DOWNLOAD
7. సరెండర్ రైస్ కార్డు - DOWNLOAD
1A) Required Documents ?
New Rice Card
- application
- All members Adhar Cards
2. బియ్యం కార్డు లో వ్యక్తులను జోడించడం
- Application Form
- Adding Member Adhar Card
- Rice Card
- Birth Certificate (For Child)
- Marriage Certificate (For Bride)
- Marriage Photo (For Bride)
- Bride Parents Aadhaar Cards
3. బియ్యం కార్డు విభజన
- Application Form
- Aadhar cards
- Rice Card
- Marriage Certificate (For Marriage Couple)
4.అడ్రస్ చేంజ్
- Application Form
- Address Proof
- Rice Card
- Adhar Cards
5.సరెండర్ రైస్ కార్డు
- Application Form
- Adhar Cards
- Rice Card
6) బియ్యం కార్డు లో వ్యక్తిని తొలగించుట
- Application Form
- Rice Card
- Death Certificate
7) Adhar Correction
- Application Form
- Adhar Cards
- Rice Card
How to Check Ration Card Status in AP (EPDS Website)
Link - CLICK HERE
0 Comments