thalliki vandanam released 2025, Eligibility, status checking
ఈ పేజీలోని ముఖ్యాంశాలు
- తల్లికి వందనం లో Eligibility (అర్హతలు)
- ఈ తల్లికి వందనం పథకంలో ఎంత డబ్బులు వేస్తారు ?
- ఈ తల్లికి వందనం పథకంలో మాకు అర్హత ఉందా/లేదా ఎలా తెలుసుకోవాలి ?
- లిస్ట్ లో పేరు లేనివారు ఏమి చేయాలి?
- తల్లికి వందనం లో పేమెంట్ స్టేటస్ చెకింగ్ ఎలా?
- హౌస్ మ్యాపింగ్ చెకింగ్ విధానము ఎలా ?
- 1వ తరగతి మరియు ,10 పాస్ అయిన వారికి ఎప్పుడు వేస్తారు ?
- తల్లికి వందనము G.O
   మీ మద్దిమడుగు మునిరత్నం (ప్రభుత్వ పథకాల వారధి)
Introduction of ThallikiVandanam - ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మ్యానిఫెస్టో లో చెప్పిన సూపర్-6 సంక్షేమ పథకాలలో భాగంగా అందులో వున్నఈ పథకమే "తల్లికి వందనం". మ్యానిఫెస్టోలో  చెప్పిన ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థి కి సంవత్సరానికి 15,000 చొప్పున, కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికి వర్తింపచేసే పథకమే ఈ తల్లికి వందనం పథకం. అందులో భాగంగానే ఈ సంవత్సరం రాష్ట్రంలోని 54,94,703 మంది విద్యార్థులకు అమౌంట్జమ జమ అవుతున్నాయి.
తల్లికి వందనం లో Eligibility (అర్హతలు)
- 1 వరగతి నుండి 12 వతరగతి వరకు విద్యార్థులకు ఇస్తారు. (ITI ,పాలిటెక్నీక్, IIIT విద్యార్థులకు ఇది వర్తించదు.)
- గత విద్యా సంవత్సరంలో కనీసం విద్యార్థికి 75% హాజరు ఉండాలి. ఈ 2025-26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందినవారు కూడ అర్హులే.
- కుటుంబ ఆదాయం - గ్రామీణ ప్రాంత కుటుంబాల సంవత్సర ఆధాయం నెలకి రూ 10,000 మించకూడదు. అదే పట్టణ ప్రాంత కుటుంబాల ఆదాయం నెలకు రూ 12,000 కంటే మించకూడదు.
- కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి బియ్యం కార్డు కలిగి ఉండాలి.
- కుటుంబంలో ఎవరికైనా 4 చక్రాల వాహన కలిగివున్నచో అర్హులు కారు, కానీ టాక్సి, ఆటోలకు మరియు ట్రాక్టర్ కలిగివున్నవారికి మినహాయింపు కలదు .
- కుటుంబ మొత్తానికి మాగాణి భూమి 3 ఎకరాల లోపు, అదేవిధంగా మెట్ట భూమి 10 ఎకరాల లోపు వున్నవారు మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి అర్హులు.
- కుటుంభం మొత్తం వాడే కరెంట్ వాడకం నెలకు 300 యూనిట్లు లోపు ఉంటే వారు మాత్రమే అర్హులు.దీనిని 12 నెలల యూనిట్స్ మొత్తంలో సరాసరి వేసి లెక్కిస్తారు .
- పట్టణ ప్రాతాలలో నివసించే వారి స్థిరాస్తి 1000 చ.అ కంటే తక్కువగా వున్న వారు మాత్రమే అర్హులు.
- కుటుంబలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు గానీ పెన్షనర్లు గానీ ఉంటే ఇది వర్తించదు. కానీ ఇక్కడ పారిశుధ్య కార్మికులకు మినహాయింపు కలదు .
- కుటుంభంలో ఎవరైనా ఆదాయపు పన్నుచెల్లిచే వాళ్ళు ఉంటే మాత్రం అర్హులు కారు.
- లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం చేసే హౌస్ మాపింగ్ లో ఉండాలి. ఒకవేల విద్యార్థి ఉండి , తల్లిలేకపోతే సిబ్బంది గ్రౌబెడ్ లెవెల్ లో తనికీ చేసి మ్యాపింగ్ చేస్తారు.
ఈ తల్లికి వందనం పథకంలో ఎంత డబ్బులు వేస్తారు ? 
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వదనం పథకంలో ప్రతి బడికి వెళ్లే విద్యార్థికి సంవత్సరానికి 15 వేలు వేస్తామన్నారు,అందులో భాగంగానే ఈ జూన్ 12,2025 న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి లోకేష్ గారు ఈ తల్లికి వందన పథకాన్ని ప్రారంభించారు. అందులో చెబుతూ ప్రతి విద్యార్థి యొక్కతల్లి ఖాతాకి కి రూ 13,000 మాత్రమే వేయడం జరుతుందని, మరో రూ 2000 మాత్రం  పాఠశాల నిర్వహణ ఖర్చు క్రింద తీసుకొవడం జరుగుతుందని ప్రకటించారు. ఈ అమౌంట్ ఈ జూన్ 12 వ తేదీ నుండే తల్లుల ఖాతాలో జమ అవుతాయి. 
ఈ తల్లికి వందనం పథకంలో మాకు అర్హత ఉందా/లేదా ఎలా తెలుసుకోవాలి ?
ఈ తల్లికి వందనంకి సంబంధించిన అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితాని సచివాలయంలో NBM పోర్టల్ లో ప్రింట్ తీసి ఈ జూన్ 12 వ తేదీ నుండి అందుబాటులో ఉంచారు, కనుక వెళ్లి తల్లి తండ్రులు వెళ్లి చెక్ చేసుకోగలరు. 
లిస్ట్ లో పేరు లేనివారు ఏమి చేయాలి?
మీకు ఈ పథకానికి అర్హత ఉండి అనర్హుల జాబితాలో పేరు వచ్చిఉంటే మాత్రం సచివాలయలో గ్రీవెన్స్ పెట్టుకోవాలి అధికారిక ఉత్తర్వులలో ఇవ్వడం జరిగినది.
- అర్హుల/ అనర్హుల జాబితా ప్రదర్శన తేదీ - 12-06-2025
- ఫిర్యాదుల స్వీకరణ తేదీలు - 12-06-2025 నుండి 20-06-2025 వరకు
- వెరిఫికేషన్ అయ్యాక జాబితా - 21-06-2025 నుండి 28-06-2025 వరకు
- అమౌంట్ రిలీజు తేదీ - 05-07-2025
తల్లికి వందనం లో పేమెంట్ స్టేటస్ చెకింగ్ ఎలా?
గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకంలో అయితే లబ్ధిదారుడు ఏ ఖాతాలో జమ అయిందో తెలుసుకునే వెసులుబాటు సిటిజెన్ కి ఉండేది , కానీ ఇప్పుడు ఈ పోస్ట్ వ్రాసే ఈ తేదీ నాటికీ ఈ తల్లికి వందనం డబ్బులు చెకింగ్ కి ఎటువంటి links లేవు, బహుశా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన watsapp గవర్నెన్స్ (మన మిత్ర) లో ఈ పేమెంట్ స్టేటస్ ఇచ్చే అవకాశం వుంది . 
 కానీ ప్రస్తుతం చెక్ చేసుకోవాలంటే మాత్రం విద్యార్థి యొక్క తల్లి ఆధార్ కార్డు ఏ బ్యాంక్ కి లింక్ అయిందో, దానిలోనే డబ్బులు వేస్తారు. దానినే NPCI లింక్ అని కూడా అంటారు. కనుక ఈ కింది లింక్ ఓపెన్ చేసుకుని అందులో ఎలా చెక్ చేసుకోవాలో అని వివరంగా ఇస్తూ అక్కడే చెకింగ్ Link ఇవ్వడం జరిగినది, కనుక మీరే సులభంగా చెక్ చేసుకోగలరు.
NPCI లింక్ చెక్ - click 
NPCI లింక్ చెకింగ్ చేయు విధానము -  Click 
NPCI లింక్ బ్యాంకు కు వెళ్లకుండా స్వంతంగా link చేసుకునే విధానము
- ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18,55,760,
- (ఒకరు చొప్పున - ₹13,000/-)
- ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322,
- (ఇద్దరు చొప్పున - ₹26,000/-)
- ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు 2,10,684,
- (ముగ్గురు చొప్పున - ₹39,000/-)
- నలుగురు పిల్లలు ఉన్న తల్లులు 20,053 మందికి,(నలుగురు చొప్పున - ₹52,000/-)
- తల్లికి వందనం ! మొత్తంగా... 67,27,164 మంది పధకం లబ్ధిదారులు !!
- వీళ్ళల్లో 54,94,703 మంది తల్లులకు.. బిడ్డకు 13 వేలు చొప్పున జూన్ 12 రాత్రి నుంచి డబ్బులు అకౌంట్లలో జమ చేయడం మొదలవుతున్నాయని విశ్వసనీయంగా తెలిసిన సమాచారం !
హౌస్ మ్యాపింగ్ చెకింగ్ విధానము ఎలా ?
తల్లికి వందనంలో ఖచ్చితముగా లబ్ధిదారులు హౌస్ మాపింగ్ డేటా బేస్ లో ఉండాలనే నిబంధన పెట్టడం జరిగినది. కనుక ఈ క్రింది ఇచ్చే లింక్ ద్వారా ఇప్పటివరకు ఎక్కడ మ్యాప్పింగ్ లో లేకపోతే Self గా Add చేసుకునే అవకాశం కలదు. కనుక ఈ link ద్వారా చేసుకుని లబ్ది పొందండి.
ఒకవేళ మీరు హౌస్ మాపింగ్ లో ఎంతమంది వున్నారో చెక్ చేసుకోవాంటే మాత్రం ఖచితంగా ప్రస్తుతం వున్నా options ప్రకారం సచివాలయంకి వెళ్ళాలి.
H H లింక్ చెకింగ్ - CLICK   
1వ తరగతి మరియు ,10 పాస్ అయిన వారికి ఎప్పుడు వేస్తారు ?
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాదిరిగా 1 తరగతికి మరియు జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు ఇంకనూ జరుగుతున్నాయి, కనుక ఆ అడ్మిషన్లు పూర్తి అయ్యాక జూలై 5, 2025 వ తేదీన డబ్బులు జమ చేస్తామన్నారు. 
- 1 వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ అర్హుల జాబితా ప్రదర్శన - 30-06-2025
- పేమెంట్ రిలీజు తేదీ - 05-07-2025
తల్లికి వందనము G.O -
టెలిగ్రామ్ లో ఇచ్చాను,అక్కడ నుండిచదువుకోగలరు
.Thallik Vandanam 
 Thallik Vandanam status check 
 Thalika Vandanam  Status 
 Thallika Vandanam eligible list 2025
 Salika Vandanam official website 
 Thallik Vandanam apply online 
 thalliki Vandanam list 
 Thallik Vandanam release date 
 Thallika Vandanam  Eligibility



 
 
 
 
 
 
 
 
 
.png) 
 
 
 
 
 Posts
Posts
 
 

0 Comments