how to check aadhar bank linking status-2023
ఈ పేజీ లోని ముఖ్యాంశాలు (NPCI)
1) Introduction (NPCI అంటే ఏమిటి)
2) మీ ఆధార్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో చెక్ చేసుకోవడం
3) అకౌంట్ కి ఆధార్ లింక్ లేకపోతే ఏమి చేయాలి?
4) ఆధార్ కి సంబంధించిన మరిన్ని సిటిజెన్ సర్వేసులు
1) Introduction (NPCI అంటే ఏమిటి)
Aadhar bank linking status - కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆర్ధికంగా సాయం చేయాలి అనుకున్నపుడు గతంలో అయితె ఆ స్థానిక మండల అధికారుల ద్వారా లేదా పంచాయతీ అధికారుల ద్వారా లేదా స్థానిక రాజకీయనాయకులు చేత చెక్ ల రూపంలోనో లేదా డబ్బుల రూపంలోనే అందిచేవారు.ఆలా చేయడం వలన ఎక్కువశాతం మంది ప్రజలకు ఎంత అయితే సాయం చేయాలి అనుకున్నారో అంత మొత్తం అందడం లేదు (ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే)
అలాంటప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిని తగ్గించే దిశగా ఆలోచించి ఆధార్ నెంబర్ ఆధారంగా పేమెంట్స్ ఇవ్వాలని నిశయించుకున్నారు.అప్పటినుండి మీ ఆధార్ కార్డు నంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ నకు లింక్ అయిందో ఆ బ్యాంకు కి ఆటోమాటిక్ గా మీ అకౌంట్ లో పూర్తి అమౌంట్ జమ అయ్యేలా చేస్తున్నారు.ఆ విధంగా చేయడానికి NPCI (National Payment Corporation Of India) వారి సహకారం తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జమ చేస్తున్నారు.అదే బాటలోనే ఆంధ్రప్రదేశ్ నందు పలు రకాల సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బులను కూడా ఇదే పద్దతిలోనే ఇస్తున్నారు.
2) మీ ఆధార్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో చెక్ చేసుకోవడం
మీ ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో తెలుసుకోవడానికి ఇంతకముందు ఎటువంటి లాగిన్ లేకుండా సులభంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉండేది.కానీ అదార్ వెబ్సైటు ఈ మధ్య కాలంలో చేసిన మార్పులకనుగుణంగా ఇప్పుదు చెప్పుకుందాం.
Step 1- ముందుగా ఈ క్రింద ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసుకున్నాక, అక్కడ క్రింది ఫొటోలో చూపించిన విధంగా Login పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ ఆధార్ ఎంటర్ చేసి OTP కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది.
Link - Click Here
Step 2 - Login అయ్యాక మరోక పేజీ ఈ క్రింది విధంగా వస్తుంది.అక్కడ మార్క్ చేసిన విధంగా Bank Seeding Status అనే ఆప్షన్ వస్తుంది.దాని మీద క్లిక్ చేసుకోవాలి.
Step 3 - ఈ ఆప్షన్ నందు ఆటోమేటిక్ గానే మన ఆధార్ కార్డు నెంబర్ ఏ బ్యాంకు కి లింక్ అయిందో ఈ క్రింది ఫొటోలో చూపించిన విధంగా వస్తుంది.అక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే banking seeding status దగ్గర Active గా ఉందా లేదా అనే అంశాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోగలరు.
3) అకౌంట్ కి ఆధార్ లింక్ లేకపోతే ఏమి చేయాలి?
1) ఒకవేళ మీరు చెక్ చేసుకున్నాక అక్కడ ఏ బ్యాంక్ చూపించక పోయినట్లయితే మీ బ్యాంకు కి మీ ఆధార్ కార్డు తీసుకెళ్లి అక్కడ NPCI కి లింక్ చేయండి అడగాలి.ఆలా చేసిన 24 గంటల్లో లింక్ ఐయిపోతుంది.
2) మరికొంతమందికి అక్కడ Inactive అని వున్నా కూడా బ్యాంకు దగ్గరకు వెళ్లి Active చేయించుకోవాలి.
3) మరికొంతమందికి వాళ్ళు రెగ్యులర్ గా ఉపయోగించుకునే బ్యాంక్ అకౌంట్ కి కాకుండా పెద్దగా ఉపయోగించని అకౌంట్ కి లింక్ అయి ఉంటుంది.అలాంటప్పుడు కూడా మీ పాత బ్యాంకు దగ్గరకు వెళ్లి ఆ అకౌంట్ కి NPCI ని De-link చేయమని కొరవలెను.లేదా డైరెక్ట్ గా మీకు కావలసిన బ్యాంకు దగ్గరకు వెళ్లి కూడా De-link చేయమని కోరవచ్చు.
0 Comments