సిటిజన్ ఔట్రేచ్ సర్వే - ఏప్రిల్ 2022
ఈ పేజీ లో అందిస్తున్న ముఖ్యమైన అంశాలు
Citizen Beneficiary Outreach 2.0
ప్రముఖ విషయం : సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ నెలకు ఒక్కసారి చివరి వారంలో వారి సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆ ప్రభుత్వ ఉద్యోగి వెళ్లి రాబోవు నెలలో అమలు జరగబోవు పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి మరియు ఇప్పటి వరకు అర్హత ఉండి ఏమైనా పథకాలు పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా..అని ప్రజల బాగోగులు అడుగుతూ మరియు వాళ్లలో భరోసా కూడా నింపుతూ ఈ కార్యక్రమం జరుగుతుంది.
అందులో బాగంగానే ఈ నెలకి సంబంధించి ఏప్రిల్ 29 వ తేదీ మరియు 30 వతేది ఈ కార్యక్రమం జరిగే విధంగా ఉత్తర్వులు రావడం అయితే జరిగింది.
HALF DAY Training Programme: దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారుల నుండి ఒక ఉత్తర్వు కూడా వచ్చింది. దాని యొక్క ఉధ్యేశ్యం ఏమిటంటే ఈ నెలకు సంబంధించి సర్వే ని ఏవిధంగా చేయాలో వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి హాఫ్ డే ట్రైనింగ్ ఇవ్వాలని దీని యొక్క ముఖ్య ఉద్ద్దేశ్యం.
ఈ హాఫ్ డే ట్రైనింగ్ కి సంబంధించి PDF కూడా మీ సౌకర్యార్ధం ఈ క్రింద ఇవ్వబడుతుంది.కాబట్టి ఒకసారి చదువుకోగలరు.
ప్రదానంగా ఈ యాప్ యందు నందు క్రొతగా సర్వే చేయాల్సిన అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే..?
మే నెలలో అమలు కాభివూ పథకాలు అంతే జగనన్న విద్యా దీవెన, ఉచిత పంటల బీమా, YSR రైతు భరోసా, మత్యకార భరోసా (వేట నిషేధ సమయంలో ఆర్ధిక భరోసా) మరియు అదే మత్యకార భరోసా లో (డీజిల్ సబ్సిడీ కి ఇవ్వడం) వంటి పథకాల గురించి అవగా అవగాహన చేయడం మరీ ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఆధార్ బ్యాంక్ కి లింక్ చేయాలనే విషయాన్ని గురించి ఈ శిక్షనలో చెప్పబడుతోంది.
ఈ యాప్ లో సర్వే చెయ్ విధానము
STEP 1 : ముందుగా ఈ యాప్ నందు సచివాలయ ఉద్యోగి వాళ్ల సచివాలయ కోడ్ మరియు ఆ ఉద్యోగి యొక్క హోదా ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి
ఉదాహరణకు : 12345648-DA
12345678-WEA
పై విధంగా ఏ ఉద్యోగి లాగిన్ అవుతారో ఆ ఉద్యోగి హోదా తో పాటు ఎంటర్ చేయాలి
STEP 2 : ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి
1) Search by Cluster
2) Search by Adhar
ఈ సర్వేని క్లస్టర్ ప్రజలయొక్క ఆధార్ తో కానీ లేదా వాలంటీర్ కి సంబంధించిన క్లస్టర్ ద్వారా కూడా మొదలు పెట్టచ్చు.
STEP 3: ఆ ఉద్యోగి, మరియు వాలంటీర్ వెళ్లిన క్లస్టర్ లోని కుటుంబాలు అన్నీ ఇక్కడ వస్తాయి.ఒక కుటుంబం పై క్లిక్ చేస్తే అక్కడ ప్రదానంగా ఆ కుటుంబ సభ్యుల వివరాలలో NPCI మరియు EKYC స్టేటస్ చూపిస్తుంది.
ఇక్కడ ఎవరికైనా active గా లేకపోతే ఖచ్చితంగా బ్యాంకు లకు వెళ్లి NPCI లింక్ చేసుకోమని చెప్పాల్సి వుంటుంది. అదే విధంగా EKYC కూడా చూసి లేకపోతే వాలంటీర్ దగ్గర AEPDS లో చేయించాల్సి వుంటుంది.
STEP 4 : ఇక్కడ 3 ప్రశ్నలు వస్తున్నాయి
1) మీ వాలంటీర్ ఎన్ని రోజులకు ఒకసారి మీ ఇంటిని సందర్శిస్తారు
2) ఆధార్ నెంబర్ ని బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేయించాలని మీకు తెలుసా
3) రేపు నెలలో జరగబోవు పతకాలు వివరాలు ఏవో మీకు తెలుసా..?
పై ప్రశ్నలకు జవాబులు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఫోటో తీసి సబ్మిట్ చేయాలి
STEP 5 : ఆ తర్వాత మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడుగుతారు
1) మొబైల్ నెంబర్ ని ఎంటర్ ఆచేయాలి
2)మీకు స్మార్ట్ ఫోన్ ఉందా..?
3) మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా వ్యాపారం చేస్తున్నారా ..?
4)మీరు ఎంత వరకు చదువుకున్నారు
5) కుటుంబ పెద్దతో ఉన్న సంబంధం ఎంచుకోవాలి
పై ప్రశ్నలు అన్నింటికీ సరైన సమాధానాలు ఎంచుకున్నాక సబ్మిట్ చేయాలి.ఇంతటితో సర్వే కంప్లీట్ అవుతుంది.
గమనిక : పైన చెప్పిన ప్రాసెస్ మొత్తం అందరి కుటుంబ సభ్యులకి ఈ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అందరికి సర్వే అనేది చేయాల్సి వుంటుంది.
పై యాప్ నందు సర్వే ఎలా చేయాలో తెలిపే SOP లింక్ ఈ క్రింద ఇస్తున్నాను. కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి
లేదా ఇక్కడే PDF ద్వారా చదువుకోవాలంటే ఈ క్రింద ఇస్తున్నాను,చదువుకోగలరు
పై సమాచారం పై మీకు ఎటువంటి సందేహాలు వున్నా మరియు మీ అభిప్రాయాలు చెప్పదలచుకున్నా క్రింద Comment ఆప్షన్ ద్వారా తెలుపగలరు. నన్ను సంక్షేమ పథకాల సందేహాలు కొరకు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ లింక్ ద్వారా మాట్లాడవచ్చును.
0 Comments