Adhar Link Staus Check At Bank
- ఈ పేజీ నందు మనం ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో అని అధికారిక వెబ్సైట్ నందు తెలుసుకునే పద్దతి గురించి వివరించుకుందాం
- మీ అదార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ లేకపోతే...ఎలా చేసుకోవాలో కూడా ఇదే పేజీ లో తెలుసుకుందాం
NPCI అంటే
NPCI అంటే National Payment Corporation Of India
ఆధార్ తో చెక్ చేసుకునే Link కావాలంటే పేజీ చివర ఉంది.. గమనించగలరు
దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారం ఆయా రాష్ట్రాలు ప్రజలకు ఏదైనా ఆర్ధిక సాయం చేయాలనుకున్నా,లేదా అవినీతి కి తావులేకుండా జవాబుదారీ తనంగా ఉండాలని వారి దగ్గర బ్యాంక్ అకౌంట్ నెంబర్ లు తీసుకుని మాన్యువల్ గా ఎంటర్ చేయకుండా DBT ద్వారా అంటే Direct Bank Transfer పద్దతిలో వేయడం మంచిదని భావించింది.కావున ఆ పద్ధతిలోనే కోవిడ్ సమయంలో పేద ప్రజలకు ఆర్ధిక సాయం చేసేటప్పుడు కూడా దేశవ్యాప్తంగా వారి యొక్క ఆధార్ ఏబ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో దానికి DBT ద్వారా డబ్బులు జమ చేయడం జరిగింది.ఈ సమయంలో ఎక్కువగా జన్ ధన్ ఖాతాలకు వేయడం కూడా మనం ఇక్కడ గమనించాలి.
అదే విధంగా ఆయా రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ఆంద్ర ప్రదేశ్ నందు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా గుర్తించి, ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా ఎంతో కొంత ఆర్ధిక సాయం పొందాలనే లక్ష్యం తో చాలా రకాలైన సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అందులో ఇప్పటివరకు మాన్యువల్ గా బ్యాంక్ అకౌంట్ ని సచివాలయంలో ద్వారా ఎంటర్ చేసి, దాని ఆధారంగా డబ్బులను జమ చేసేవారు. దీని ద్వారా కూడా కొన్ని చోట్ల మాన్యువల్ గా అకౌంట్ నెంబర్ ని పొరపాటున తప్పుగా ఎంటర్ చేయడం వల్ల కానీ, లేదా అకౌంట్ నెంబర్ లలో ఒక నెంబర్ తక్కువగా ఎంటర్ చేయడం వల్ల కానీ, మొత్తానికి ఏదో రకంగా అసలైన లబ్దిదారులు నష్ట పోవడం అయితే జరిగింది.దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కారం లభించేటట్టు మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం కూడా ఆ లబ్దిదారుల యొక్క ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినధో దానికి మాత్రమే డబ్బులు వేయాలని ఈ సంవత్సరం (2022) జనవరి నుండి ఇక మీదట అన్ని పథకాలకు ఈ పద్ధతిని అమలుచేయనున్నారు..ఇప్పటికె అది అమలు అవుతోంది కూడా...
కాబట్టి ఇప్పుడు మనం చాలా సులభంగా మన ఆధార్ నంబర్ ఏ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిందో మనమే మన ఫోన్ లొనే బ్యాంక్ కి కూడా వెళ్ళకుండా తెలుసుకునే పద్దతి చూద్దాం.
- ఈ పద్ధతి ని నమూనా చిత్రాలతో చూపిస్తూ వివరించడం జరుగుతుంది. కావున జాగ్రత్తగా గమనిస్తూ చెక్ చేసుకోగలరు
STEP 1
ముందుగా ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.అక్కడే దాని క్రింద CAPTCHA ఉంటుంది.దాని కూడా ఎంటర్ చేశాక Send Opt ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
NPCI Checking Link :
ఆధార్ తో చెక్ చేసుకునే లింక్ కొరకు
ఇక్కడ క్లిక్ చేయండి
STEP 2 :
ఆ తరువాత మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది. దానికి ఇదే పేజీ నందు క్రింద ఎంటర్ చేసి Sumbit చేయాలి.
STEP 3
మీ ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ అయిందో ఇక్కడ చూపిస్తుంది.అప్పుడు మీరు ఏ పథకానికి లబ్ది పొందలన్నా ఈ అకౌంట్ నంబర్ ని ఇచ్చుకోవచ్చు.
మీ ఆధార్ తో చెక్ చేశాక అక్కడ ఏ బ్యాంక్ చూపించనట్లయితే మీరు మీకు సేవింగ్ అకౌంట్ కలిగిన బ్యాంక్ నకు వెళ్లి అక్కడ ఉన్న సిబ్బంది దగ్గర kyc ఫారం తీసుకుని దానికి నింపి, ఆ ఫారం తో పాటు ఆధార్ కార్డ్ నకలు, మరియు బ్యాంక్ అకౌంట్ నకలు ను జత పరచి సమర్పించవలెను.ఇక్కడ ముఖ్యంగా గుర్తించు కోవాలసిన అంశం ఏమిటంటే మీరు సిబ్బందికి NPCI కి లింక్ చేయండి అని అయితే కొంచెం వివరంగా చెప్పండి.
మరి కొంతమంది కి వారి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ప్రస్తుతం వాడకంలో లేనందున Inctive కూడా అయివుండచ్చు.కాబట్టి అలాంటి వారు వీలయితే మీ అకౌంట్ ని Active అయినా చేయించుకోండి.లేదా ఆ అకౌంట్ కి లింక్ అయిన ఆధార్ ని అక్కడ Remove చేయించుకున్నాక తదుపరి ఇప్పుడు active గా ఉన్న మీ సేవింగ్ ఖాతాకు లింక్ చేయించుకోవాలి.
పైన చెప్పిన అంశాలను ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకుని లబ్ది పొందాలని ఆశిస్తూ, మీలాగే చాలా మంది కూడా ఇలాంటివి తెలియక ఇబ్బందులు పడుతున్నారికి ఈ సమాచారాన్ని చెరవేయండి.మీ ద్వారా వారు కూడా తప్పకుండా లబ్ది పొందగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను
మన సమాచారం నచ్చితే మన వెబ్సైట్ Subscribe చేసుకుని, మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోండి. ఆ తరువాత నా ద్వారా ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది.
నేను ఇచ్చిన ఈ సమాచారం పై మీ విలువైన కామెంట్ తెలియజేయగలరు
Thanking you
6 Comments
Super sir
ReplyDeleteSir meeru aadhar link lo aadhar no check chesanu sir kani vada leni bank account chupistundhi sir present vady bank very vundhi sir aa acount lo amount padutunda sir aa acount ki kuda aadhar link ayyindhi sir please replay evvandi sir
ReplyDeleteఆధార్ కు మొబైల్ లింక్ లేని వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి
ReplyDeleteబ్యాంక్ కు వెళ్లాల్సిందే..సర్.. ఎప్పటికైనా మొబైల్ నెంబర్ లింక్ చేయించుకోండి.... అన్నింటికి అవసరం ఆవుతాయి
DeleteGood information sir 👍 Thank you 🙂
ReplyDeletegdastagiri993@gmail.com
ReplyDelete