Header Ads Widget

Jagananna Ammavodi Payment Status without login -2022

 Jagananna Ammavodi Payment Status without login -2022





ఈ పేజీ లో మనం అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఎటువంటి లాగిన్ లేకుండా డబ్బులు పడ్డాయా..లేదా ఎలా తెలుసుకోవాలో వివరంగా చెక్ చేసుకుందాం.


అమ్మఒడి: 2020-21వ విద్యాసంవత్సరం కి సంబంధించి ఆంద్రప్రదేశ్ నందు బడులకు సక్రమంగా పంపించిన తల్లుల ఖాతాలో అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేల రూపాయలు వేయడం మనం చూశాం. అందులో ఈ సంవత్సరం టాయిలెట్స్ నిర్వహణ ఖర్చు, మరియు పాఠశాల నిర్వహణ ఖర్చు క్రింద 2 వేల రూపాయలు ను తగ్గింది రూ.13 వేల రూపాయలను ప్రతి తల్లి ఖాతాలో వేయడం అయితే జరిగింది.

అమ్మఒడి 2020-21సంవత్సరంలో  ప్రారంభ కార్యక్రమము.


  ఈ మూడవ విడత అమ్మఒడి కార్యక్రమం అనేది ఈ జూన్ 27,2022 వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఈ విడతలో దాదాపు 44 లక్షల మంది తల్లులకు రూ.6,595 కోట్లను వేయడం అయితే జరిగింది.


Also Read: మీ వ్యాపారానికి లోన్ కావాలా..అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి



తల్లి ఆధార్ నెంబర్ తో ఎటువంటి లాగిన్ లేకుండా పేమెంట్ స్టేటస్ ని చెక్ చేసుకునే విధానము
 

 ముందుగా అమ్మఒడికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది మొదట సచివాలయం వారి లాగిన్ లో మాత్రమే చెక్ చేసుకునే విధానము ఇచ్చారు. ఆ తరువాత ఈ రోజు నుండి అంటే (05-07-22) ప్రతి ఒక్క సిటిజెన్ కూడా ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా తన ఆధార్ కార్డ్ నెంబర్ తో చెక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మరియు అక్కడ ఇంకా అమౌంట్ పడనివారికి వివిధ రకాల కారణాలు కూడా అందులో చూపిస్తుంది.అందులో ముఖ్యమైనవి 4 రకాలైన కారణాలు చూపిస్తున్నాయి.ఆ కారణాలను ఎలా రెక్టీఫ్య చేయించుకోవాలో కూడా కొంచెం వివరంగా చెప్పుకుందాం.


PAYMENT STATUS




STEP 1: పై లింక్ పై క్లిక్ చేశాకా ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతోంది. ఇక్కడ మొదట ఆధార్ కార్డ్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని, ఆ తరువాత స్కీం ఆప్షన్ లో జగనన్న అమ్మఒడిని ఎంచుకుని Get Details పై క్లిక్ చేయాలి.






STEP 2: ఇక్కడ STATUS దగ్గర అమౌంట్ పడిందా,లేదా అని చూపిస్తూ ప్రక్కన Remarks దగ్గర ఏ బ్యాంక్ లో పడిందో కూడా చూపిస్తారు.లేదా కొంతమందికి ఎందువల్ల డబ్బులు పడలేదో ఆ కారణాన్ని కూడా చూపిస్తూ ఉంది.దానిని ఎలా సరిచేసుకోవాలో కూడా చూద్దాం.






Also Read : మీ బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ అయిందా లేదా 2 నిమిషాల్లో సులభంగా తెలిసుకోండి




డబ్బులు పడని వారికి ఎక్కువగా ఈ క్రింది రకాలైన కారణాలు చూపిస్తున్నాయి.వాటిని ఎలా సరి చేసుకోవాలో కూడా చూద్దాం.


1) Inactive Adhar : ఈ సమస్య వచ్చిన వారు తప్పకుండా బ్యాంక్ కి వెళ్లి వాళ్ళ ఆధార్ నెంబర్ ని బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ చేయించుకోవాలి.


2) Processed For Payment: ఈ కారణం వచ్చిన వారికి ఖచ్చితంగా డబ్బులు పడుతాయి.ఎందుకంటే ఈ 3 వ విడత ప్రారంభించిన్నప్పుడు తల్లుల ఖాతాలో వరుసగా 10 రోజుల వరకు అమౌంట్ పడుతాయి.అని సచివాలయ ఉద్యోగులు చెప్పడం జరిగింది.కాబట్టి ఆ విధంగా ఆలోచించినా ఈ జిల్లా 7 వ తేదీ వరకు పడే అవకాశం వున్నది. కాబట్టి వేచి ఉండచ్చు.అయినా కూడా అమౌంట్ పడకపోయినట్లయితే ఈ జులై 19 వ తారీఖున గతంలో అంటే 3 సంవత్సరాలో అర్హత ఉండి, పథకం రానివారికి డబ్బులు వేయడం జరుగుతుంది. బహుశా అదే రోజున ఈ అమ్మఒడి లో అర్హత ఉండీ పై కారణాన్ని చూపిస్తున్న వారికి డబ్బులు పడే అవకాశం ఉందని కొంతమంది సచివాలయ ఉద్యోగుల అంటున్నారు.కానీ ఈ విషయం పై అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.అలా ఏదైనా సమాచారం వుంటే తప్పక తెలియజేస్తాను.



3) Adhar mapping Doesn't exist/Adhar Number Not Mapped to IIN


IIN అంటే : Issuer Identification Number


ఈ రకమైన సమస్య వచ్చిన వారు మీ బ్యాంక్ అకౌంట్ కలిగిన బ్రాంచ్ కి వెళ్లి మేనేజర్ గారిని కలిసి ఈ స్టేటస్ గురించి వివరించండి.బహుశా ఒకసారి మళ్లీ KYC తీసుకునే అవకాశం ఉన్నది.ఆ తరువాత NPCI కి కూడా ఆధార్ లింక్ ఇవ్వమని చెప్పండి.



Also Read: ఈ శ్రమ్ కార్డ్ నెంబర్ మర్చిపోయివుంటే మరలా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా ?




మరిన్ని క్రొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయి లబ్ధిపొందగలరు.


WATSAPP



Thanking You

Post a Comment

0 Comments