ఆధార్ కార్డ్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు
ఈ పేజీ లో ప్రధాన అంశాలు
- ఆధార్ లో వివరాలు మార్చుకోవాలి అనుకుంటే జైలు శిక్ష తప్పదు.
- చిన్న ఆధార కార్డ్ లు ఇక చెల్లవు
- ఆధార్ సమస్యలపై సలహాలు & ఫిర్యాదుల కొరకు
ఆధార్ కార్డు లో ఈ రెండు తప్పులు మాత్రం ఎప్పటికి చేయకూడదు.ఆది తెలిసి చేసినా,తెలియక చేసినా జైలు శిక్ష మాత్రం తప్పదు అంటున్నారు.పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్ ప్రాముఖ్యత : మొదటగా ఆధార్ కార్డ్ కి మన జీవితంలో ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో మనం చూస్తూనే ఉన్నాము. సంక్షేమ పథకాల అమలు తీరులో గానీ, అదేవిధంగా ఆర్థిక కార్యకలాపాలలో మరియు ఏ డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ ప్రక్రియలో గానీ ఈ ఆధార్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా అయితే ఉంది.
ఉదాహరణకు : అందులో మరీ ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా, తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో అమలు అవుతున్నాయి.ఈ పథకాలలో లబ్ధిదారుల అర్హత లు ను చాలా సులభంగా పారదర్శకంగా గుర్తించడానికి చాలా బాగా ఈ ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది.మరియు ఆ లబ్ది దారులకు ఆర్ధిక సహాయం చేసేటప్పుడు కూడా మధ్య వర్తిత్వం లేకుండా ముఖ్యమంత్రి గారు NPCI ప్రాతిపధికన వారి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేసుకుంటే చాలు డైరెక్ట్ గా ఆకౌంట్ లోకి డబ్బులు పడేటట్టు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఈ విధంగా అమలు చేస్తూ చాలా పారదర్శకంగా ఈ కార్యక్రమాలు జరగడానికి ఈ ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది స్వార్థపూర్వకంగా సంక్షేమ పథకాలలో లబ్ది పొందుటకు మరియు ఏ ఇతర రిజిస్ట్రేషన్ కార్యక్రమాలో వారికి అర్హత లేకున్నా కూడా అబద్ధపు డాకుమెంట్స్ చూపి ఆధార్ కార్డ్ లో వివరాలు మార్చుకుంటున్నారు.అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఆధార్ లో వివరాలు మార్చుకోవాలి అనుకుంటే జైలు శిక్ష తప్పదు.
అసత్యపు డాకుమెంట్స్ పెట్టి ఆధార్ కార్డులో వివరాలు మార్చుకున్నట్టు రుజువు అయితే వారిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయుదురు. అవి ఏ విధంగా ఉంటాయి అంటే భారతీయ శిక్షాస్మృతి 1860, సెక్షన్ 463,464 & 465 మరియు భారతీయ ఆధార్ చట్టం 2019 సెక్షన్ 34 & 42 ప్రకారం జరిమానా మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించబడును. కావున ఆధార్ కార్డ్ లో ఏదైనా మార్పులు చేసుకోదలస్తే సరైన డాకుమెంట్స్ ఉంటేనే మార్చుకోండి.లేదంటే ఇబ్బందులు పాలవుతారు.
చిన్న ఆధార కార్డ్ లు ఇక చెల్లవు
ఆధార్ కార్డ్ అవసరం ఎప్పుడు,ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి సాదరణంగా బయట షాప్ లలో మన జేబులో పట్టే విధంగా చిన్నదిగా చేసుకుని వాడుకుంటున్నాము.కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా బయట మార్కెట్లలో తయారుచేసుకునే చిన్నపాటి ఆధార్ కార్డ్ లు ఎక్కడ చెల్లవు అని చెబుతున్నారు.
విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వమే చిన్నపాటి ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ అంటే PVC CARD ని అందిస్తుంది. దాని ఖరీదు కేవలం రూ.50 లకే అందిస్తుంది. ఇది కూడా పోస్ట్ ద్వారా మన ఇంటి అడ్రెస్ కి 10 రోజుల లోపల వచ్చేస్తుంది.
దీని ప్రత్యేకతలు ఏమిటంటే ఈ క్రింది విధముగా ఉంటాయి.
ఆధార్ ఆఫీషల్ వెబ్సైట్: CLICK HERE
PVC కార్డ్ ఆర్డర్ : CLICK HERE
0 Comments