Header Ads Widget

Adhar Card Download just 1 click -2022

 ఒక నిమిషంలో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయు విధానం


ADHAR


     ఈ పేజీ లో మనం ప్రధానంగా చెప్పుకోబోయే అంశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
  • ఆధార్ డౌన్లోడ్ చేసుకునే పద్దతి
  • ఆధార్ పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి
  • ఆధార్ కార్డ్ పై సంతకం ని కంప్యూటర్ లోగానీ లేదా మొబైల్ ఫోన్ లో అయినా ఎలా వెరిఫై చేసుకోవాలి.


      ఆధార్ కార్డ్ అనేది పుట్టిన పిల్లాడి నుండి పండు వృద్దుల వరకు పొందవచ్చును.ఈ ఆధార్ కార్డ్ యొక్క ఆవశ్యకత అనేది ఇప్పుడు మన జీవితాలలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.ఈ కార్డ్ వచ్చినప్పటి నుండి దేశంలో చాలా వరకు కూడా ఆర్థిక పరమైన నేరగాళ్లను కట్టడి చేయడంలో గానీ, మరియ ప్రభుత్వ పథకాలు గానీ,ఆస్తుల వ్యవహారంలో గానే ఇలా ఇంకా చాలా వాటిలో కూడా మోసాలను కట్టడి చేస్తూ, మరియు వ్యక్తి యొక్క ఇండిటిటీ గా గానీ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నది.

      కాబట్టి  మనిషి యొక్క దైనందిక ప్రస్తుత జీవితంలో ఆధార్ కార్డ్ మనలో ఒక భాగం అయిపోయింది.కావున కొన్ని సమయాలలో ఆధార్ అవసరమైనప్పుడు, ఆ సమయానికి అందుబాటులో లేనప్పుడు కేవలం ఒక నిమిషంలో మనమే మన ఫోనే లొనే కూడా డౌన్లోడ్ చెసుకోవచ్చును.


ఆధార్ డౌన్లోడ్ చేసుకునే పద్దతి


గమనిక : 

  1. ఆధార్ కార్డ్ ని మనమే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ చేసుకుని ఉండాలి.
  2. మొబైల్ నంబర్ లింక్ లేని వాళ్ళు ఆధార్ సెంటర్ వద్ద బియోమెట్రిక్ ద్వారా కూడా ఆధారకార్డు ని పొందవచ్చును.


STEP 1 : ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఓపెన్ చేయగా ఆధార్ కార్డ్ యొక్క ఆఫీషియల్ పేజీ లోకి వస్తుంది.ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ మరియు అక్కడ ఇచ్చిన CAPTCHA ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

STEP 2 : ఈ పేజీ నందు ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది

ADHAR DOWNLOAD LINK : CLICK HERE


ADHAAR


Next download Adhar ఆప్షన్
Next మన ఆధార్ లో ఉన్న వివరాలు వస్తాయి. అక్కడే Download ఆప్షన్ పై క్లిక్ చేయాలి
Download అయిపోతుంది



ADDHAR

ఆధార్ పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి


 ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు మీ పేరు లోని మొదటి 4 అక్షరాలు మరియు పుట్టిన సంవత్సరం ఎంటర్


ఉదాహరణకు : 

1) Maddimadugu Munirathnam అని ఇంటి పేరుతో పాటు ఉన్న వారు అన్నీ కాపిటల్ లెటర్ లో MADD అని ఎంటర్ చేసి ప్రక్కన పుట్టిన సంవత్సరం వేయాలి
ఈ విధంగా MADD1988

2) ఒకవేళ M. Munirathnam అని ఉంటే MMUN అని 4 అక్షరాలు టైప్ చేసి తరువాత పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి.


ఆధార్ కార్డ్ పై సంతకం ని కంప్యూటర్ లోగానీ లేదా మొబైల్ ఫోన్ లో అయినా ఎలా వెరిఫై చేసుకోవాలి.


కంప్యూటర్ లో అయితే Adobe Reader ని Install చేసుకోండి


ADOBE READER LINK : CLICK HERE

ఆ తరువాత మీ డౌన్లోడ్ అయిన ఆధార్ ని ఓపెన్ చేసాక సంతకం ఈ క్రింది విధంగా ఉంటుంది. దానిపైన మౌస్ తో రైట్ క్లిక్ చేసి Valid Signature పై క్లిక్ చేసి Signature Properties పై క్లిక్ చేసి,Show Signature పై క్లిక్ చేసి,పైన Trust పై క్లిక్ చేసాక 
Add to Trusted certificates పై క్లిక్ చేసి
అక్కడున్న అన్ని ఆప్షన్స్ Tick చేసుకుని ok చేసాక
చివరన valid Signature పై క్లిక్ చేయగానే Signature valid అని ఈ క్రింది విధంగా వస్తుంది

Mobile లో సంతకం ని verify చేయు విధానం


ముందుగా ఈ క్రింది లింక్ ఓపెన్ చేయండి 

PDF UNLOCK : CLICK HERE




ఈ పేజీ లో క్రిందకు వచ్చాక See All PDF Tools అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి

ఆ తరువాత పేజీ లో చివరన Unlock PDF ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ అయిన ఆధార్ ని సెలెక్ట్ చేసుకోవాలి


ADHAR


ఆ ప్రక్కనే చెక్ బాక్స్ లో టిక్ పెట్టి UNLOCK PDF పై క్లిక్ చేయాలి.పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంతటితో  ఆధార్ కార్డ్ లో lock పోయి మాములుగా ఎప్పుడయినా ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.


JOIN WATSAPP GROUP :
CLICK HERE


Post a Comment

0 Comments