Header Ads Widget

అమ్మఒడి ఫైనల్ లిస్ట్ లో కలిగే 5 సందేహాలు - సమాధానాలు

 

 అమ్మఒడి ఫైనల్ లిస్ట్ లో కలిగే 5 సందేహాలు - సమాధానాలు





ఈ పేజీలో ప్రధానంగా మనం ఇప్పడు అమ్మఒడి పథకానికి సంబంధించి 5 రకాల సందేహాలకు సమాధానాలు చెప్పుకుందాం


అమ్మఒడి: అమ్మఒడి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ 27,2022 వ తేదీన విద్యార్థి తల్లుల ఖాతాలో అమౌంట్ వేయనున్నారు.ఈ విడత శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్నారు.



ఈ విడత ఎంత అమౌంట్ వేయనున్నారు?


      ఈ సంవత్సరం అమ్మఒడి పథకానికి సంబంధించి ముందుగా చెప్పిన విధంగా రూ 15 వేలు లో 1000/-లు టాయిలెట్ల నిర్వహణ ఖర్చు క్రింద తగ్గించి మిగతా రూ.14 వేలు వేసేవారు.అదే విధముగా ఈ సంవత్సరం వచ్చేసరికి పాఠశాల నిర్వహణ ఖర్చు క్రింద మరో రూ 1000లు తగ్గించి, రూ13 వేలు మాత్రమే తల్లుల ఖాతాలో జమ అవనున్నట్లు కొన్ని వార్తాపత్రికల్లో కూడా చూసాము.కానీ ఇప్పుడు సచివాలయంలో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేసాకా అందులో రూ.14000 వేయనున్నట్లు ఆ లిస్ట్ లో చూపించడం జరుగుతూవుంది.కాబట్టి ఈ సారి అదే అమౌంట్ ఆ తల్లుల ఖాతాలో జమ అవుతుంది అని ఆ అధికార లిస్ట్ ప్రకారం చెప్పుకోవచ్చు.





ప్రాథమిక అర్హుల లిస్ట్ లో పేరు ఉండి, ఇప్పుడు ఫైనల్ లిస్ట్ లో పేరు రాని వారి పరిస్థితి ఏమిటి..?


   ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రాథమిక లిస్ట్ నందు అర్హుల లిస్ట్ లో పేరు ఉండి,ekyc కూడా పూర్తిచేశాకా, ఇపుడు వచ్చిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ లో గానీ ఇన్ ఎలిజిబుల్ లిస్టు లో గానీ పేరు రాలేదు.దీంతో ఆ తల్లులు కి ఆ కారణాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.



   దీనికి సంబంధించి అలాంటి సమస్య ఉన్న వాళ్ళని కొంతమంది ని బాగా వెరిఫై చేయగా తెలిసిన విషయం ఎమిటంటే ఈ క్రింది 2 కారణాలు తెలియవచ్చాయి.


1) ఆ విద్యార్థి తల్లిపేరు వాలంటీర్ యొక్క హౌస్ హోల్డ్ మాపింగ్ లో  లేకపోవడం.


2) హౌస్ మాప్పింగ్ ఫ్యామిలీ మొత్తం ఒక చోట ఉండి కూడా,ఇప్పుడు అమ్మఒడి లో పేరు వచ్చిన విద్యార్థి మాత్రం వేరే చోట చదువుకుంటూ ఉండడం, అక్కడే ఆ వాలంటీర్ పరిధిలోకి కూడా ఈ పేర్లు వచ్చి ఉన్నాయి.



  కాబట్టి మీరు చేయించాల్సింది అల్లా  ఆ తల్లి ఆధార్ నెంబర్ తో ఈ క్రింది లింక్ లో చెక్ చేసుకుంటే,ఆమె పేరు ఏ ఊరి లిస్ట్ లో వుందో ఇట్టే తెలుసుకోవచ్చును.

     

Know Your Volunteer





SAMPLE:  




3) In Active అని ఉన్నవారి పరిస్థితి ఏమిటి?


   ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారం పేదలకు చేసే సాయం DBT  (Direct Benefit Transfer) ద్వారా మాత్రమే చేయాలని సూచించారు.కాబట్టి అప్పటినుండి అర్హులైన వారికి అమౌంట్ వేయాలంటే ఆ లబ్ధిదారులు యొక్క ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ కి అయితే NPCI లింక్ అయిందో,ఆ అకౌంట్ లో డైరెక్ట్ గా అమౌంట్ వేయనున్నారు.


NPCI Status Checking With Adhar Number


   కానీ ఈ అమ్మఒడి అర్హుల జాబితాలో అర్హులై వున్నా, మరియు ఆన్లైన్ లో NPCI లింక్ Active అని చూపించిన ఈ జాబితాలో మాత్రం In Active అని చూపిస్తోంది. ఇలాంటి వారు మళ్లీ ఒకసారి బ్యాంక్ మేనేజర్ గారిని కలసి, ఒకసారి మళ్లీ NPCI లింక్ ని UNLINK చేసి మరలా LINK చేయమని అభ్యర్థన చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమాచారం ప్రభుత్వం నుండి అధికారికంగా వచ్చిన సమాచారం.



4) అనర్హత లిస్ట్ లో ఒకే కార్డు లో తల్లి, పిల్లలు లేరని వచ్చిందా..?


ఈ సమస్యకి సంబంధించి మొదటగా ప్రాథమిక అర్హుల లిస్ట్ వచ్చినప్పుడు, ప్రభుత్వం నుండి కొన్ని సందేహాలకు సమాదానాలు అని కొన్ని పరిష్కారాలు తెలియ జేశారు.అందులో ప్రత్యేకంగా కూడా   ఫీల్డ్ లెవల్ లో సచివాలయ సిబ్బంది వెరిఫై చేసి ఎలిజిబుల్ అని NBM సైట్ లో గ్రీవెన్స్ పెట్టమని అవకాశం ఇచ్చారు.ఇక్కడ కూడ అలా గ్రీవెన్స్ పెట్టిన పేర్లు కూడా మళ్లీ అనర్హత లిస్ట్ లో వచ్చి ఉన్నాయి.

   

       ప్రభుత్వం చెప్పిన ఈ ఒక్క కారణం మాత్రం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.ఎందుకంటే ఒకే కుటుంబంలో తల్లి,పిల్లలు లేరని మాత్రం అనర్హత జాబితాలో చూపించారు.అలాంటప్పుడు రైస్ కార్డ్ లో సభ్యుల చేరిక ఆప్షన్ మాత్రం గత 7 నెలలుగా సచివాలయాల్లో సర్వర్లు పనిచేయడం లేదు.అని చెబుతూ రైస్ కార్డ్ కి సంబంధించిన సర్వీస్ లు చేయలేదు.అలాంటప్పుడు ఈ కారణాలతో అనర్హత చేయడం ఏమిటని కూడా పలువురు అభిప్రాయ పడుతున్నారు.



5) అనర్హత వారికి మళ్లీ ఏమైనా అవకాశం ఉంటుందా ?


   తప్పకుండా అర్హత ఉండి కూడా అనర్హత లిస్ట్ లో పేరు వచ్చి ఉంటే ప్రభుత్వం ఈ పథకం ప్రారంభం అయ్యాక ఒక నెల మళ్ళీ అవకాశం ఇస్తారు.అలాంటి వారు మళ్లీ తగిన ఆధారాలతో గ్రీవెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే, 6 దశలలో చెక్ చేసి డిసెంబర్ కి అమౌంట్ వేయనున్నారు.



మరిన్ని నూతన అప్డేట్స్ పొందలనుకుంటే ఈ క్రింది గ్రూప్ నందు జాయిన్ అయి పొందగలరు.


watsapp



Thank You

Post a Comment

0 Comments