AP లో వృద్దులకు సంఘాలు-డ్వాక్రా సంఘాల తరహా
ఈ పేజీ నందు వివరించిన ముఖ్యమైన అంశాలు
- వృద్ధుల సంఘాల అంటే ఏమిటి?
- ఈ సంఘాల వల్ల వృద్దులకు ఉపయోగాలు ?
- ఈ సంఘాలకు ప్రభుత్వం నుండి సహాయం ఏ విధముగా వుంటుంది?
- ఈ సంఘాలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తున్నారు?
- ఇప్పటివరకు ఏర్పడిన సంఘాలు ఎన్ని,ఏక్కడెక్కడ మొదలయ్యాయి?
S.No | Group Name | Link |
---|---|---|
1 | Munirathnam Updates | Click Here |
వృద్దుల సంఘాలు (ESHG) : ఆంధ్రప్రదేద్ రాష్ట్రం నందు ఇప్పుడు ఉన్న మహిళ డ్వాక్రా సంఘాలు మాదిరిగానే 60 ఏళ్ల పైబడిన వృద్దులకు కూడా ఇప్పుడు ఇలాంటి సంఘాలను ఏర్పాటు చేయాలని భావించి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా పైలట్ ప్రాజెక్ట్ క్రింద కొన్ని మండలాలో ఏర్పాటు చేయబడివున్నారు.ఇలాంటి వృద్ధులతో ఏర్పాటైన సంఘాలకు ఎల్డర్లీ స్వయం సహాయక సంఘాలు (Elderly Self Help Groups - ESHG) గా కూడా నామకరణం చేయడం జరిగింది.
అర్హతలు : దీనిలో 60 సంవత్సరాల వయస్సు పై బడిన వారు పురుషులు మరియు మహిళలు ఇద్దరూ కూడా ఒకే గ్రూప్ నందు ఉండచ్చు.లేదా పురుషులు, మహిళలు వేర్వేరుగా సంఘాలు ఏర్పాటుకు మొగ్గు చూపితే కూడా చేస్తారు.కానీ ఒక సంఘానికి కనీసం 10 మంది సభ్యులుగానూ మరియి గరిష్టంగా 20 మంది సభ్యుల వరకు కూడా వుండచ్చును.
వెసులుబాటు : కొండ ప్రాంతాలలో నివసించే వాళ్ళు మరియు గిరిజన ప్రాంతాలలో అత్యంత వెనుకబడిన 12 రకాల వర్గాలకు చెందిన వృద్ధుల అయితే కనీసం 5 మంది సభ్యలతో కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును.
ఈ సంఘాలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తున్నారు?
ఈ వృద్ధుల యొక్క సంఘాలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరిస్తారు.
- వృద్ధులు తమ వ్యక్తిగత పనులను వాళ్లే చేసుకుంటూ, వారి జీవన ఉపాధి కోసం ఇతర పనులను చేసుకుంటూ వుండేవాళ్లను ఒక రకంగా గుర్తిస్తారు
- రెండవ రకం ఎవరంటే తమ వ్యక్తిగత పనులును తామే చేసుకుంటూ,వేరే ఉపాధి పనులు ఏమి చేసుకోలేని వారిని రెండవ రకంగా గుర్తిస్తారు
- మూడవ రకం గా ఎవరిని పరిగణిస్తారు అంటే తమ వ్యక్తి గత పనులను కూడా తాము చేసుకోలేకుండా వేరే వల్ల పై ఆధార పడి పరిస్థితి ఉంటే అలాంటి వారిని మూడవ రకంగా పరిగణిస్తారు
గమనిక : ప్రస్తుతం మొదటి రెండు రకాలైన వృద్దులకు ఏ సంఘాలను ఏర్పాటు చేయనున్నారు
ఈ సంఘాల వల్ల వృద్దులకు ఉపయోగాలు ?
- వృద్ధాప్యం లో ఉన్న వారు,సమాజంలో గౌరవ ప్రదంగా జీవించేవిధముగా మనోధైర్యాన్ని ఇవ్వడం.
- వారి కుటుంబ సభ్యుల తో ఉన్న ఇబ్బందులు వల్ల మానసికంగా కృంగి పోతున్నవారందరిని ఒకే చోట ఆహ్లాదకరమైన వాతావరణం లో సంఘ సభ్యులు అందరూ మాట్లాడుకోవదాన్ని ప్రోత్సాహించడం.
- వృధ్యాప్యం లో ఉన్న వారి ఆరోగ్య సమస్యల ఒకరినొకరు చర్చించుకోవడం ద్వారా అవగాహన పెరిగేటట్టు చూసుకోవడం
ఈ సంఘాలకు ప్రభుత్వం నుండి సహాయం ఏ విధముగా వుంటుంది?
మహిళలు మొట్ట మొదట పొదుపు సంఘాలను ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వం నుండి రివాల్వింగ్ ఫండ్ రూపం లో ఆర్ధిక సహాయం ఏవిధముగా చేస్తుందో,అదే విధంగా ఈ వృద్ధులు ఏర్పాటు చేసుకునే సంఘాలు కూడా సంవత్సరానికి 25 వేల రూపాయలు చొప్పున రెండు సంవత్సరాలకి గాను 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సాయాన్ని చేస్తారు.
రెండేళ్ల తర్వాత నుండి మహిళా సంఘాలకు ఏ విధముగా అయితే బ్యాంక్ ల నుండి లోన్సు ఇప్పిస్తారో,అదే విధంగా ఈ ESHG లకు కూడా లోన్స్ ఇప్పిస్తారు.
వృద్ధులు స్వంత గా ఆదాయం పెంచుకోవాలని భావించి వారికి ఆయా రంగాలలో కొంతమేరుగైన శిక్షణ కూడా ఇప్పించి,బ్యాంక్ నుండి రుణాలు కూడా తీసి ఇస్తారు.
ఈ వృద్ధుల సంఘాలకు,సంఘం ఏర్పాటు చేసినప్పుడు 5 వేల రూపాయలు మరియు వాళ్లకు సంఘాలపై శిక్షణా కార్యక్రమాల సమయం నందు మరో 5 వేల రూపాయలను అందజేస్తారు.
ఆ తర్వాత వాళ్ళ చిన్నపాటి వ్యాపారానికి పెట్టుబడి సాయం గా15 వేల రూపాయలు ఇస్తూ, రెండవ సంవత్సరం 25 వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం చేస్తుంది.
ఇప్పటివరకు ఏర్పడిన సంఘాలు ఎన్ని,ఏక్కడెక్కడ మొదలయ్యాయి?
జిల్లా | మండలం | సంఘాల లక్ష్యం | ఏర్పాటు చేసినవి |
---|---|---|---|
శ్రీ కాకుళం | ఎచ్చెర్ల | 260 | 118 |
శ్రీ కాకుళం | పాతపట్నం | 344 | 65 |
విజయనగరం | బొండపల్లి | 193 | 64 |
విశాఖపట్నం | పద్మనాభం | 243 | 64 |
అల్లూరి సీతారామరాజు | అడ్డ తీగల | 166 | 75 |
కోనసీమ | ముమ్మిడివరం | 298 | 69 |
తూర్పుగోదావరి | పెరవలి | 287 | 60 |
ఎన్టీఆర్ | విస్సన్న పేట | 189 | 107 |
పల్నాడు | అమరావతి | 243 | 75 |
నెల్లూరు | కొడవలూరు | 127 | 91 |
నెల్లూరు | గూడ్లూరు | 165 | 74 |
వైస్సార్ | వల్లూరు | 108 | 34 |
నంద్యాల | పగిద్యాల | 118 | 45 |
చిత్తూరు | పులిచెర్ల | 142 | 58 |
మొత్తం | 3,017 | 1,048 |
పైలట్ ప్రాజెక్ట్ క్రింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఒక 15 మండలాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.ప్రభుత్వం విధించిన లక్ష్యం మాత్రం పైలట్ ప్రాజెక్ట్ క్రిందనే 3,017 సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించగా..ఇప్పుటికే SERP ఆధ్వర్యంలో 1,048 సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది.
పై సమాచారం పై మీకు ఎటువంటి సందేహాలు వున్నా మరియు మీ అభిప్రాయాలు చెప్పదలచుకున్నా క్రింద Comment ఆప్షన్ ద్వారా తెలుపగలరు. నన్ను సంక్షేమ పథకాల సందేహాలు కొరకు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ లింక్ ద్వారా మాట్లాడవచ్చును.
పై సమాచారాన్ని 28-4-2022 న సాక్షి దినపత్రిక లో వేసిన ఆధారంగానూ మరియు అధికార సమాచారాన్ని కూడా జోడించి ఇందులో ఇవ్వడం జరిగినది
0 Comments