Pradhan Mantri Jan Arogya Yojana(PMJAY)
ఈ పేజీలో మనం ప్రధానంగా ఈ క్రింది విషయాలను తెలుసుకోబోతున్నాము
1) అయుష్మాన్ భారత్ కి సంబంధించిన సర్వే యొక్క సారాంశం
2) ఇప్పుడు వాలంటీర్స్ చేయాల్సిన ప్రక్రియ ఏమిటి ?
3) ఈ సర్వే కి చివరి తేదీ ఏమిటి ?
4)ఈ ఆయుష్మాన్ కార్డ్ ని డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి ?
6) క్లస్టర్ నందు ఈ PMJAY కలిగి ఉన్న కార్డ్ లను ఎలా గుర్తించాలి ?
అయుష్మాన్ భారత్ కార్డ్: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పేద కుటుంబాలకు పెద్ద జబ్బులు ఏవైనా చేసినప్పుడు వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ లో డబ్బులు వెచ్చించి వైద్యం చేసుకోలేని పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కావున అలాంటి ఇబ్బందులు పేదవాళ్లకు ఉండకూడదు అని కొన్ని పెద్ద జబ్బులకు పేదవాడు కుడా ప్రైవేట్ హాస్పిటల్ లో వెళ్లి చికిత్స పొందిన తర్వాత అక్కడ చెల్లించిన డబ్బులుని మళ్లీ రీ ఫండ్ చేసే విధముగా తీసుకొచ్చిన పథకమే ఈ PMJAY (Pradhan Mantri Jan Arogya Yojana).
ఈ పథకాన్ని ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వం వివిధ పేర్లతో అమలు చేస్తుంటారు.కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకు మాత్రమే వర్తించేటట్టు రూపకల్పన చేయడం జరిగింది.కనుక ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలలోనూ మరియు కేంద్ర పాలిత ప్రాంతలలో కూడా అమలు చేయడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ PMAJY పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో కూడా YSR ఆరోగ్య శ్రీ గా మరికొన్ని రోగాలను జాబితాలో చేర్చి అమలు చేస్తున్నారు.మిగతా చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఆ ఆర్ధిక భారాన్ని భరిస్తూ రైస్ కార్డ్ వున్నా లేకున్నా సంవత్సర ఆదాయం 5 లక్షల లోపల ఉంటే అట్టి కుటుంబాలను ఈ ఆరోగ్య శ్రీ పరిధిలో తెచ్చి వారికి అండగా నిలుస్తోంది
2) ఇప్పుడు వాలంటీర్స్ చేయాల్సిన ప్రక్రియ ఏమిటి ?
జ) రాష్ట్ర ప్రభుత్వం ఈ PMJAY లబ్దిదారుల్ని గుర్తించి, వారికి ఆధార్ అతేంటికేషన్ చేయించి,తద్వారా ఈ కార్డ్ PVC రూపంలో జెనరేట్ అవగా,ఆ కార్డ్ ని మళ్లీ వాలంటీర్ ద్వారా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమాన్ని మొత్తం సచివాలయంలోని ANM ఆధ్వర్యంలో చేయాల్సి వుంటుంది.
3) ఈ సర్వే కి చివరి తేదీ ఏమిటి ?
జ) ఈ PMJAY కార్డ్ కి సంబంధించి ఆధార్ అతేంటికేషన్ చేయుటకు ఈ అక్టోబర్ 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.
4)ఈ ఆయుష్మాన్ కార్డ్ ని డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి ?
ఆంద్రప్రదేశ్ కి సంబంధించి వాలంటీర్స్ అందరూ ఈ ఆయుష్మాన్ భారత్ క్రింద ఉన్న లబ్ధిదారులను గుర్తించి వారికి ఆధార్ ekyc చేసిన తర్వాత ఆ లబ్ధిదారుని పేర్ల పైన చిన్న పాటి కార్డ్ జెనరేట్ అవుతుంది.ఆ తదుపరి అవి PVC కార్డ్ లపైన్ ప్రింట్ అయ్యాక సచివాలయం లోని ANM కి అందిస్తారు.అప్పటినుండి మల్లీ వాలంటీర్ చేత పంపిణీ కార్యక్రమం ఉంటుంది.అప్పుడే ఇదే యాప్ లో పంపిణీ చేసినట్లు ఆతేంటికేషన్ చేయూకోవాల్సి ఉంటుంది.
5) ఈ సర్వే వాలంటీర్ క్లస్టర్ లి ఉన్న అందరికి చేయాలా ?
జ) గ్రామాల్లో కానీ ఇటు పట్టణాలలో కానీ ప్రతి వాలంటీర్ కి 50 నుండి 80 వరకు కుటుంబాలను మ్యాప్ చేసుకుని వుంటారు.కానీ అందులో ప్రభుత్వ ఉద్యోగులను తీసివేయగా ఆరోగ్య శ్రీ కొంతమందికి మాత్రమే ఉంటుంది.అందులో కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ PMAJY క్రింద లబ్దిపొంది వుంటారు.కనుక వారికి మాత్రమే ఈ సర్వే చేస్తే సరిపోతుంది.
6) క్లస్టర్ నందు ఈ PMJAY కలిగి ఉన్న కార్డ్ లను ఎలా గుర్తించాలి ?
దీనిని రెండు రకాలుగా గుర్తించవచ్చును.
మొదటి రకం
ఆంద్రప్రదేశ్ కి చెందిన వారికి ప్రభుత్వమే సచివాలయంలోని పంచాయతి సెక్రెటరీ/ డిజిటల్ అసిస్టెంట్ కి వాళ్ళు ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఆ కుటుంబాల లిస్ట్ ని వాలంటీర్ ప్రకారం అందిస్తారు.కనుక వారికి మాత్రం సర్వే చేస్తే సరిపోతుంది.
PMJAY BENEFICIARY DETAILS DOWNLOAD
PMJAY DETAILS |
రెండవ రకం
ఈ పద్దతి లో ఆంద్రప్రదేశ్ కి సంబంధించిన వారు మరియు తెలంగాణ కి సంబంధించిన వాళ్ళు కూడా చెక్ చెసుకోవచ్చును.
PMJAY |
ఈ క్రింది లింక్ లో మొబైల్ నెంబర్ OTP తో లాగిన్ అయ్యి తర్వాత మీ వివరాలు ఇచ్చి మీకు అయుష్మాన్ భారత్ కార్డ్ Approved అయిందా లేదా అని తెలుసుకోవచ్చును.
ఈ సర్వేకి సంబంధించిన మొబైల్ యాప్స్
ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన వాలంటీర్స్ ఈ సర్వే చేయడానికీ ఈ దిగువన ఇచ్చిన రెండు యాప్ లు ఇన్స్టాల్ చేసుకుని తద్వారా ఆధార్ అతేంటికేషన్ చేయాల్సివుంటుంది.ఆయుష్మాన్ భారత్ కి సంబంధించిన యాప్ న్యూ వెర్షన్ 3.0.68 గా అప్డేట్ అవడం జరిగింది.దీనిలో టెక్నికల్ టీం వాళ్ళు ఇదివరకే ఉన్న యాప్ లో చిన్నపాటి సమస్యలన్నిటిని రెక్టీఫ్య చేస్తున్నట్లు చెబుతున్నారు
AYUSHMAN BARATH APP(3.0.73)
FACE AUTHENTICATION APP
1 Comments
Super
ReplyDelete