రేషన్ కార్డ్స్ ఉన్నవారికి న్యూ యాప్ విడుదల -2022
ONORC అంటే : One Nation One Ration Card
NATIONAL FOOD SECURITY PORTAL : LINK
Mobile App పేజీ చివర ఉంది, గమనించగలరు. అందరూ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే దేశం -ఒకే రేషన్ కార్డు (ONORC)అనే నినాదంతో ముందుకెళ్తుంది.ఈ యాప్ ని గతంలోనే ఇచ్చారు.కానీ అప్పుడు Trail Version లాగా ఉండేది.దానిని ఇప్పుడు పూర్తిగా డేవలప్ చేసి అందులో ప్రజలకు 9 రకాలైన సేవలును కుడా అందుబాటులోకి తెచ్చారు.ఇందులో అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా వుంటుంది. కాబట్టి సామాన్య ప్రజలకు కూడా సౌలభ్యంగా ఉంటుంది
ఉపయోగాలు : ఈ యాప్ వినియోగం ప్రముఖ ఉద్దేశ్యం ఎమిటంటే ప్రజలు ఇబ్బందులు పడకుండా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో అయినా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటును కల్పించారు.
చిన్న,పెద్ద జాబ్ నోటిఫికేషన్లు కొరకు
ఆ APP నందు 9 రకాల సేవలు గురుంచి ఈ పేజీ నందు వివరంగా చెప్పుకుందాం
మొదటగా ఈ యాప్ ఓపెన్ చేశాక హోమ్ స్క్రీన్ నందు మీ రేషన్ కార్డు నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
1) Know Your Entitlement : ముందుగా ఇందులో మీ పాత రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక మీ కార్డు కి రేషన్ సరుకులు పరిమాణం (ఎన్ని K.G లు)ఎంతో చూసుకోవచ్చు
2) Near By Ration Shop : ఈ యాప్ ద్వారా మీకు దగ్గరలోని రేషన్ దుకాణాలను చూపిస్తుంది.కాబట్టి ఎక్కడైనా వెళ్లి సరుకులు తీసుకోవచ్చును
3) ONORC States : ఈ సర్వీస్ ద్వారా దేశంలో ఏయే రాష్ట్రాలలో ఈ విధానాన్ని అమలు చెస్తుతున్నారో మ్యాప్ లో చూపడం జరుగుతుంది. ఆ స్టేట్ పై క్లిక్ చేసి కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చును.
4) My Transactions : ఈ సర్వీస్ ద్వారా మనం మన కార్డ్ పైన సరుకులు ఎప్పుడు తీసుకున్నాము, ఏమేమి తీసుకున్నాము అని వివరంగా వుంటుంది.
5) Eligibility Criteria : ఈ ఆప్షన్ నందు రేషన్ కార్డ్ దారులకు లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్ సరైనదా కాదా అని అక్కడే చూపిస్తుంది.
6) Adhar Seeding : ఈ ఆప్షన్ చాలా మందికి ఉపయోగపడుతుంది.దీనిలో మన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ కార్డ్ లో ఉన్నటువంటి సభ్యులకు రేషన్ కార్డ్ కి ఆధార్ లింక్ అయిందా లేదా చూపిస్తుంది.
6) Suggetions : ఈ ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ పై అమలు చేసే విధానం లో కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ఇవ్వవచ్చు. ఇది చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోగలరు.
7) FPS feedback : ఈ ఆప్షన్ ద్వారా రేషన్ దుకాణాలలో గల వసతులు,పరస్థితిలో గురించి కూడా సలహాలు సూచనలు ఇవ్వవచ్చును.
APP LINK : DOWNLOAD
0 Comments