voter card address change in online -2022
ఈ పేజీ నందు ప్రధానంగా ఓటరు కార్డ్ లో చిరునామాని మార్చుకునే విధానాన్ని చుద్దాము.
1) ఓటరు కార్డ్ లో చిరునామా ని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు?
2) ఓటరు కార్డ్ నందు చిరునామా మార్చడానికి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ?
3) ఏయే సందర్బాలలో చిరునామాను మార్చుకోవచ్చును ?
5) దరఖాస్తు పూర్తి అయ్యాక అది మారిందా..లేదా ఎలా తెలుస్తుంది ?
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రింది గ్రూప్ లలో చేరి పొందవచ్చును.
![]() |
Telegram & Watsapp |
1) ఓటరు కార్డ్ లో చిరునామా ని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు?
జ) ఓటరు కార్డ్ నందు చిరునామా ని 3 రకాలుగా మార్చుకోవచ్చును.
A) ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆఫీషియల్ వెబ్సైట్ నుండి ఆన్లైన్ లో చేసుకోవచ్చును.
B) Offline లో అప్లికేషన్ ని పూరించి మండల ఆఫీస్ ఇవ్వవలేను.
FORM 8 APPLICATION PDF : CLICK HERE
C) ఎన్నికల కమీషన్ ఇచ్చిన మొబైల్ యాప్ ద్వారా కూడా సులభంగా చేసుకోవచ్చును.
2) ఏయే సందర్బాలలో చిరునామాను మార్చుకోవచ్చును ?
జ) ఓటరు కార్డ్ నందు చిరునామాను అదే నియోజకవర్గ పరిధిలో ఎక్కడికైనా మార్చుకోదలచినా మార్చుకోవచ్చును.అదే విధంగా పూర్తిగా ఒక నియోజకవర్గ పరిధి నుండి మరో నియోజక వర్గానికి మార్చుకోవాలి అన్నా కూడా నిరభ్యంతరంగా మార్చుకోవచ్చును.ఇవే కాకుండా ఓటర్ కార్డ్ లోని వివరాలు తప్పుగా ఉన్న కూడా మార్చుకోవచ్చును.
గమనిక: దీనికి గాను OFFLINE లో అయితే FORM-8 అప్లికేషన్ వుంటుంది.ఈ అప్లికేషన్ కూడా ఈ పేజీ చివరన ఇవ్వడం జరుగుతుంది,ఉపయోగించుకోగలరు.
ONLINE లో చేసుకోదలస్తే ఈ పేజీ చివరన 3 లింక్స్ ఇవ్వబడును.కాబట్టి వాటిపై క్లిక్ చేసుకుని ఓటరు కార్డు పై చిరునామాను మార్చుకోగలరు.
3) ఓటరు కార్డ్ నందు చిరునామా మార్చడానికి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ?
జ) మనం ఇప్పుడు ఈ పేజీ లో చెప్పుకునేది కేవలం చిరునామా ని మార్చడం మాత్రమే చెప్పుకుంటున్నాము కావున దానికి సంబంధించి కావలసిన డాకుమెంట్స్ మాత్రమే ఇప్పుడు చెప్పుకుందాం.
పైన తెలిపిన డాక్యుమెంట్ లలో ఏదైనా ఒక్కటి వున్నా సరిపోతుంది.
4) ఆన్లైన్ లో మార్చుకునే విధానము ఎలా ?
జ) ఈ ఓటరు కార్డ్ నందు చిరునామా మార్చుకోవడానికి Online లో 3 రకాలుగా అవకాశం ఉంది అని చెప్పుకున్నాము.అందులో మనం ఇప్పుడు చెప్పుకోయే విధానము మొబైల్ యాప్ ద్వారా చేయు విధానము.దీనికి సంబంధించిన లింక్ ఈ పేజీ చివరన ఇవ్వడం జరుగుతుంది.
STEP 1: ఈ పేజీ క్రింద ఇచ్చిన యాప్ ని ఇన్స్టాల్ చేసున్నాక మొదట పేజీ ఈ క్రింది విధంగా వుంటుంది.
STEP 2: ఈ మొదట పేజీ నందు New User అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మొబైల్ నెంబర్,OTP ఇచ్చి USER NAME, PASSWORD ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
STEP 3: ఇక్కడ లాగిన్ అయ్యాక VOTER REGISTRATION ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది.అక్కడ 4 వ ఆప్షన్ అయిన Correction Of Entries (FORM 8) పై క్లిక్ చేసుకోవాలి.
STEP 4: ఇక్కడ నుండి మొదట పేజీ లో క్రింద let's Start పై క్లిక్ చేయాలి.
STEP 5: ఈ ఆప్షన్ నందు ఓటర్ కార్డ్ కలిగివున్నారు అనే మొదటి ఆప్షన్ ఎంచుకుని NEXT పై క్లిక్ చేసుకోవాలి.
STEP 6: ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుని Fetch Details పై క్లిక్ చేశాక Proceed పై క్లిక్ చేసుకోవాలి.
STEP 7: ఇక్కడ ఓటర్ కార్డ్ లో ఉన్న వివరాలు అన్నీ చూపిస్తాయి. అన్ని సరిగ్గా ఉన్నాయి అని భావించిన తర్వాత Next మీద క్లిక్ చేయాలి.
STEP 8: ఇక్కడ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ని ఇచ్చి NEXT మీద క్లిక్ చేసుకోవాల్సి వుంటుంది.
STEP 9: ఇక్కడ నుండి ప్రదానంగా జాగ్రత్తగా నమోదు చేసుకోవాల్సిఉంది.ఇక్కడ మనం చిరుమాని మార్చుకుంటున్నాము కాబట్టి మొదట ఆప్షన్ అయిన Shifting Of Residence అనే దానిపై క్లిక్ చేసుకోవాలి.
STEP 10: ఈ పేజీ నందు మీ ఓటరు కార్డ్ ఎక్కడకి మార్చుకోదలచారో ఆ చిరునామా ని ఇంగ్లీష్ మరియు క్రింద తెలుగు లో ఎంటర్ చేసుకుంటూ రావాలి.
STEP 11: పై పేజీ లోనే మీరు ఇచ్చిన చిరునామాకు సంబంధించిన ప్రూఫ్ ని ఫోటో తీసి పెట్టాల్సి ఉంటుంది.
STEP 12: ఈ పేజీ లో చివరగా మనం డిక్లరేషన్ ఇచ్చినట్లు ఆమోదం తెలుపుకుని మీ గ్రామం పేరు / పట్టణం పేరు ఇచ్చి Done మీద క్లిక్ చేయాలి ఉంటుంది.
STEP 13: దరఖాస్తు మొత్తం పూర్తయ్యాక ఈ క్రింది విధంగా దరఖాస్తు దారునికి ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది.దానికి జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది. దాని సాయం తో మన అప్లికేషన్ యొక్క స్థితి గతిని అంచనా వేసుకోవచ్చును.
5) దరఖాస్తు పూర్తి అయ్యాక అది మారిందా..లేదా ఎలా తెలుస్తుంది ?
జ) ఈ ఓటర్ కార్డ్ నందు చిరునామా మార్చిన తరువాత మన అప్లికేషన్ ఎలక్షన్ కమీషన్ కి చేరుతుంది.ఆ తరువాత మీ చిరునామాకి సంబంధించిన BLO ని మీ ఇంటికి వెరిఫికేషన్ చేయుటకు కొరకు పంపిస్తారు.ఆ తరువాత వేరిఫికేషన్ పూర్తయ్యాక మీ అప్లికేషను ని APPROVED అయిందా లేదా REJECTED అయిందా అని రెఫరెన్స్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చును.
0 Comments