Consistent Rhythm Survey process-2022
SDG SURVEY: ఆంద్రప్రదేశ్ నందు స్థిరమైన సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు సంబంధించి ప్రతి వాలంటీర్ కి వారికి సంబంధించిన ప్రతి కుటుంబాలలో సర్వే అనేది చేయాల్సి ఉంది.కనుక దీనికి సంబంధించి సచివాలయ సిబ్బందికి మరియు ANM, అంగన్వాడీ టీచర్ లకు సర్వే పై అవగాహన కార్యక్రమం కూడా కల్పించడం జరిగింది.
ఈ పేజీ లో మనం వివరించకోబోయే ప్రధాన అంశాలు
- DOWNLOAD MOBILE APP
- తాత్కాలిక పాస్స్వర్డ్ ని కనుక్కునే విధానము
- అంగన్వాడీ కోడ్ తెలుసుకోవడం కొరకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
- స్కూల్ ల యొక్క UDISC Code (స్కూల్ కోడ్) లను తెలుసుకోవాలంటే
మీకు మరిన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన న్యూ అప్డేట్స్ కావాలంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవండి.
ఈ SDG(Sustainable Development Goals) సర్వేలో ముఖ్యంగా ఈ క్రింది అంశాలలో వాలంటీర్స్ మరియు ANM లేదా ఆశా వర్కర్లు, అంగన్వాడీ ల సహకారంతో ఫీల్డ్ నందు సర్వే చేపట్టి ఆ రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందించనున్నారు.
1) 0-5 సంవత్సరాల వయస్సు గ్రూప్ పిల్లలు
2) 6-7 సంవత్సరాల వయస్సు గ్రూప్ పిల్లలు
3) 18-23 సంవత్సరాల వయస్సు గ్రూప్ వాళ్ళు
4) 15-49 సంవత్సరాల వయస్సు గల ప్రెగ్నెంట్ మహిళ వివరాలు
DOWNLOAD MOBILE APP
పై వివరాలు సేకరించడానికి వాలంటీర్స్ కి Consistent Rhythm అనే మొబైల్ యాప్ ఇవ్వడం జరిగింది.కావున ఈ యాప్ ని వాలంటీర్స్ అందరూ ఇన్స్టాల్ చేసుకోండి.
ఈ యాప్ నందు వాలంటీర్స్ నవంబర్ 15 వ తేదీ నుండి 18 వ తేదీ వర్క్ సర్వే చేయాల్సి ఉంది.ఇందులో ముఖ్యంగా ఈ క్రింది కోడ్ నెంబర్ లు అవసరం అవుతున్నాయి.
అంగన్వాడీ కోడ్ తెలుసుకోవడం కొరకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
పై లింక్ క్లిక్ చేశాకా ఇక్కడ మీ క్రొతగా ఏర్పడిన జిల్లాని ఎంచుకుని Submit చేయాలి.అక్కడ ఆ జిల్లాలోని అన్ని మండలంలోని అంగన్వాడీ సెంటర్ లు మరియు వాటి AWC Code లు వస్తాయి.
గమనిక: ఇక్కడ ఒక్కో పేజీ లో 50 అంగన్వాడీ సెంటర్ ల పేర్లు మాత్రమే చూపిస్తాయి.ఒకవేళ అక్కడ లేకపోతే ప్రక్కన పేజీలలో కూడా చెక్ చేసుకుని వ్రాసుకోండి.
లేదంటే పైనే Search Anganwadi Name అనే ఆప్షన్ దగ్గర అయినా డైరెక్ట్ గా మీ ఏరియా సెంటర్ ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చును.
2) స్కూల్ ల యొక్క UDISC Code (స్కూల్ కోడ్) లను తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు.
పై లింక్ పై క్లిక్ చేసి మీ క్రొతగా ఏర్పడిన జిల్లాని ఎంచుకుని సబ్మిట్ చేయాలి.అక్కడ ఆ జిల్లాలోని అన్ని మండలంలోని స్కూల్ లు మరియు వాటి UDISC Code లు వస్తాయి.
గమనిక: ఇక్కడ ఒక్కో పేజీ లో 50 స్కూల్ ల పేర్లు మాత్రమే చూపిస్తాయి.ఒకవేళ అక్కడ లేకపోతే ప్రక్కన పేజీలలో కూడా చెక్ చేసుకుని వ్రాసుకోండి.
లేదంటే పైనే Search School Name అనే ఆప్షన్ దగ్గర అయినా డైరెక్ట్ గా మీ ఏరియా సెంటర్ ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చును.
తాత్కాలిక పాస్స్వర్డ్ ని కనుక్కునే విధానము
Consistent Rhythm App లో వాలంటీర్ లాగిన్ అయ్యే విధానము
జ) వాలంటీర్ కి User Name మరియు తాత్కాలిక పాస్స్వర్డ్ ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.కావున అది తెలుసుకోవడం కొరకు ఈ క్రింది లింక్ ని ఓపెన్ చేసుకోండి.
0 Comments