how to change address in aadhar card online-2023
ఈ పేజీలో మనం మన మొబైల్ లోనే 2 నిమిషాల్లో ఆధార్ కార్డ్ నందు చిరునామా మార్చుకోవడం ఎలానో చుద్దాం.
ఈ పేజీలో మనం ఇచ్చే వివరాలు & PDF లు.
1) ఆధార్ అప్డేట్ ఫారం PDF
2)చిరునామా మార్చుకోవడానికి కావాల్సిన డాకుమెంట్స్ఏమిటి?
3) మన ఫోన్లోనే చిరునామా మరియు జిల్లాని మార్చుకునే విధానము
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన సంక్షేమ పథకాలు మరియు నూతన వివరాలకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుటకు మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవగలరు.
మీ ఆధార్ లో వివరాలు మార్చుకోవడానికి తగిన ఆధారాలు ఉంటే ఈ అప్లికేషను అవసరం లేదు.ఎప్పుడైతే మన దగ్గర ఆధారాలు లేవో అలాంటి సందర్భంలో ఈ అప్లికేషను పై గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సంతకం చేయించుకుని ఆధార్ వివరాలు మరియు క్రొత్త జిల్లా కూడా మార్చుకోవచ్చును.
గమనిక:ఆధార్ కార్డ్ నందు క్రొత్త జిల్లాలు మార్చుకోవాలని అధికారికంగా ఎక్కడా,ఎవ్వరూ చెప్పలేదు.
1) ఆధార్ అప్డేట్ ఫారం PDF
GENERAL APPLICATION PDF : ఈ ఆధార్ అప్డేట్ అప్లికేషను ఆధార్ నందు పేరు,పుట్టినతేదీ,చిరునామా,క్రొత్త జిల్లా,మొబైల్ నెంబర్ లింక్ ఇవ్వడం,ఇమెయిల్ ID లింక్ ఇవ్వడం,లేదా జండర్ మార్చకోవలన్నా,ఈ అప్లికేషను ఉపయోగపడుతుంది.
2)చిరునామా మార్చుకోవడానికి కావాల్సిన డాకుమెంట్స్ఏమిటి?
జ)ఆధార్ కార్డ్ నందు చిరునామా మార్చుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్లలో ఏదేని ఒక్కటి పెట్టినా సరిపోతుంది.జిల్లా మార్చుకోవాలి అంటే మాత్రం పై అప్లికేషను పై గెజిటెడ్ సంతకం తీసుకుని అప్లోడ్ చేసుకోవాలి.
3) మన ఫోన్ లోనే చిరునామా మరియు జిల్లాని మార్చుకునే విధానము
జ) దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కొరకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకోగలరు.
STEP 1: పై లింక్ ఓపెన్ చేసుకున్నాక మొదట ఈ క్రింది చూపిన విధంగా Login పేజీ ఓపెన్ అవుతుంది.
STEP 2: లాగిన్ పై క్లిక్ చేసాక ఈ క్రింది పేజీ లో ఆధార్ నెంబర్ మరియు Captch ఎంటర్ చేశాక OTP వస్తుంది.ఆ OTP ని ఎంటర్ చేశాక login పై క్లిక్ చేసుకోవాలి.
STEP 3: login అయ్యాక అక్కడ ఈ క్రింది చూపించిన ఆప్షన్ ఓపెన్ చేసుకోవలెను.
STEP 4: ఈ పేజీ లో ప్రూఫ్ లేదా గెజిటెడ్ ఫారం పెట్టి చేసుకుంటే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి.తరువాత Proceed to Update Adhar ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.
STEP 5: ఇక్కడ మనము ఏది మార్చుకోవాలి ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.ప్రస్తుతం మనం అడ్రస్ మార్చుకోవాలి కాబట్టి ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకుందాం.
STEP 6: ఇక్కడ మన ఆధార్ లోని ప్రస్తుతం ఉన్న వివరాలు,చిరునామా చూపిస్తాయి.దానిని మార్చడానికి Details to be Updated ఆప్షన్ దగ్గర Care Of అని ఉన్న చోట మీ తండ్రి పేరు లేదా భర్త పేరు ఎంటర్ చేసి క్రొత్త చిరునామా మరియు జిల్లా ని ఎంచుకోవాలి.
నేను ప్రస్తుతం క్రొత్త జిల్లా మార్చుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర తెచ్చిన ఫారం ని అప్లోడ్ చేస్తున్నాను.
ఉదాహరణకు: గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర సంతకం చేయించాను కాబట్టి Standard Certificate by village Panchayat Head / President Or Mukhya / Village Panchayat Secretary అనే ఆప్షన్ ఎంచుకుంటున్నాను.
STEP 7: ఈ ఆప్షన్ లో ఈ క్రింది ఫోటో లో చూపిన విధంగా రెండు పెర్మిషన్ లు ఇవ్వాలి.
STEP 8: ఈ పేజీ లో రూ.50/- పేమెంట్ కట్టుటకు ఆప్షన్ వస్తుంది.ఇక్కడ కూడా క్రింద చూపిన విధంగా పెర్మిషన్ ఇచ్చి Pay U biz అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి.
STEP 9: ఇక్కడ నేను Wallet ఆప్షన్ లో Phone Pay ఆప్షన్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను.మీకు ఏది అనువుగా ఉంటే ఆ ఆప్షన్ ద్వారా పేమెంట్ చేసుకోండి.ఆ తరువాత Receipt కూడా Download చేసుకోవచ్చు.
ఇంతటితో మనం ఆధార్ కార్డ్ లో అడ్రెస్ కరెక్షన్ కి అప్లికేషన్ పూర్తి చేశాము.ఇక్కడ నుండి 7 నుండి 10 రోజుల లోపు Status చెక్ చేసుకుంటే అది Approved అయిందా లేదా Reject అయిందా అని తెలుస్తుంది.
0 Comments