Ysr Bima Nominee Change procedure -2023
ఈ పేజీ లో ప్రధానంగా చెప్పుకున్న ముఖ్యాంశాలు
1) Introduction
2) నామినీని ఎవరిని ఎంచుకోవాలి (ప్రభుత్వం చెప్పిన విధంగా)
3) కుటుంభంలో ఒకరి కన్నా ఎక్కువ మంది వున్న వారి కుటుంభంలో నామినీని ఎంచుకోవడం
4) ఒంటరి వ్యక్తి కార్డు కలిగిన వారికీ నామినీ ని పెట్టె విధానము
5) వాలంటీర్ లాగిన్ లో నామినీ ని మార్చునే విధానము
Introduction
ఈ Ysr Bima Nominee ని మార్చుటలో వాలంటీర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.ఎందుకంటే గత సంవత్సరం Ysr Bima లో Nominee ని మార్చేటప్పుడు ప్రస్తుతం ఇంట్లో ఎవరు అందుబాటులో ఉంటే వారికీ చేయడం గానీ అదే విధంగా ఉన్నతాధికారులు త్వరగా చేసేయండి Dashboard "0" అవ్వాలి అని తొందర పెట్టడం గానీ,మరియు కొంతమంది వాలంటీర్స్ కి భీమా పై సరైన శిక్షణ ఇవ్వకపోవడం ఇలా చాలా కారణాలతో ప్రభుత్వం చెప్పిన పద్ధతిలో నామినీ ని ఎంచుకోక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు.కనుక ఈ సంవత్సరం టెక్నికల్ టీం కూడా OTP ఆప్షన్ ఇవ్వడం అదేవిధముగా నామినీ ని ఎంచుకునేటప్పుడు (రెన్యువల్ ) బయోమెట్రిక్ ఖచ్చితత్వం లేకపోవడం ఇలాంటి అవకాశాల వలన సరైన వ్యక్తులకు సులభంగా భీమాని చేసే అవకాశం వచ్చింది.కనుక ఈ పేజీ లో చెప్పిన విధంగా ఈ సంవత్సరం కుటుంబలో వున్న వ్యక్తులలో ఒకరిని నామినీ ని ఎంచుకునే విధానము మరియు ఒంటరి వ్యక్తి కార్డు కలిగిన కుటుంబాలకు నామినీని ఎంచుకునే విధానము గురుంచి ఇప్పుడు చెప్పుకుందాం.
నామినీని ఎంచుకునే పద్ధతి ( ప్రభుత్వం చెప్పిన విధంగా)
1) కుటుంభంలో ఒకరి కన్నా ఎక్కువ మంది వున్న వారి కుటుంభంలో నామినీని ఎంచుకోవడం
A) ప్రభుత్వం చెప్పిన విధంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తికి భీమా చేసినప్పుడు మొదటి ప్రాధాన్యత భార్య ని నామినీ గా పెట్టాలి.
B) కుటుంబ పెద్దకి ప్రస్తుతం భార్య లేని పక్షంలో కూతురు / కొడుకుని పెట్టాలి. ఒకవేల వీళ్ళు మైనర్ లు అయితే వాళ్ళని నామినీ గా పెట్టి, వారితోపాటు సంరక్షకునిగా ఇంకెవరినైనా పెట్టాలి.
C) ఒకవేళ కుటుంబ పోషకుడు కి వివాహం కాకపోతే వాళ్ళ తల్లి తండ్రులను నామినీ గా ఎంచుకోవాలి.
D) ఒకవేళ వివాహం కానీ కుటుంభం పోషకుడికి తల్లి,తండ్రులు లేకపోతే వితంతు సోదరి అయినా లేదా పెళ్లి కానీ సోదరిని అయినా పెట్టాలి
వాలంటీర్ లాగిన్ లో నామినీ ని మార్చునే విధానము
- ఇక్కడ నామినీ మార్చుకోవాలి అనుకుంటున్నారా అనే ఆప్షన్ మీద అవును అని ఎంటర్ చేసుకోవాలి.
- ఆ తరువాత నైమినీ అందుబాటులో ఉన్నడా అని ఎంచుకోవాలి.ఒకవేల అందుబాటులో లేరు అని ఎంచుకుంటే ఆ నామిని యొక్క వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి డైరెక్ట్ గా మరొక పేజీలోకి వెళ్లిపోవచ్చు.
- ఆ తరువాత రైస్ కార్డు లో వున్న వ్యక్తులనే ప్రభుత్వం చెప్పినట్టు ఎంచుకుని, నామినీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బయోమెట్రిక్ తీసుకోవాలి.
ఆ తరువాత వ్యక్తిగత వివరాలు మారియు బ్యాంక్ వివరాలు (ఖచ్చితము ఏమి కాదు) ఇచ్చాక,తదుపరి మీ వాలంటీర్ బయోమెట్రిక్ వేస్తె విజయవంతంగా నామీనీ ని మార్చినట్టు ఏ క్రింది విధంగా వస్తుంది.
గమనిక: రైస్ కార్డు లో వున్న వ్యక్తులను మాత్రమే నామినీగా పెట్టె అవకాశం కలదు.
2) ఒంటరి వ్యక్తి కార్డు కలిగిన వారికీ నామినీ ని పెట్టె విధానము
ఒంటరి వ్యక్తి కార్డు కలిగిన వ్యక్తులకు నామినీ ని పెట్టేటప్పుడు వాళ్ళ సమ్మతితోనే సంరక్షుకులుగా ఎవరినైతే చెబుతారో వారిని నామినీ గా పెట్టుకోవచ్చు,
వాలంటీర్ లాగిన్ లో ఒంటరి వ్యక్తి కార్డు కలిగిన వ్యక్తికి నామినీ పెట్టె విధానము
- ఇక్కడ మొదట్లోనే నామినీ ని మార్చాలి అనుకుంటున్నారా అనే ఆప్షన్ దగ్గర అవును అని పెట్టాలి.
- రెండవ ఆప్షన్ దగ్గర నామినీ అందుబాటులో ఉన్నడా అని అడుగుతుంది.అవును అని పెట్టుకోండి.ఒకవేళ లేదు అని పెట్టినట్లయితే ఆ నామిని యొక్క వివరాలు ఎంటర్ చేసి కూడా మరో పేజీ లోకి వెళ్లిపోవచ్చు.
- ఇక్కడ కుటుంబ సభ్యుల్లో మిగిలిన వాళ్ళు వుండరు కాబట్టి, డైరెక్ట్ గా మీరు ఎంచుకునే నామినీ యొక్క సంబంధాన్ని తెలియజేయాలి.
- తరువాత ఇక్కడ వారి ఆధార్ నెంబర్ ఎంచుకోవాలి
- చివరగా వారి దగ్గర బయోమెట్రిక్ గానీ లేదా OTP గానీ ఇచ్చి సమ్మతిని తెలియజేయాలి.
Related Links
వాలంటీర్ లాగిన్ లో రెన్యూవల్ చేయు విధానము
Conclusion
ఈ పేజీ నందు ప్రధానంగా Ysr Bima Nominee ని మార్చు విధానము గురించి చెప్పుకోవడం జరిగింది.కనుక ఈ 2023-24 వ ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా లబ్ధిదారుడు ఒక్క రూపాయి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా అంటే బ్యాంకులకు గానీ లేదా ఇన్సురెన్స్ కంపెనీలకు గానీ సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే రిస్క్ జరిగిన కుటుంబానికి పరిహారం అందిస్టారు.ఈ అంశాలపై ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే పైన వున్నవాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి సందేహాలను తెలియజేయవచ్చును.అక్కడ అధికారికంగా నాకు తెలిసిన సమాచారం ని మీకు తెలియజేస్తాను.
0 Comments