శ్రీకాళహస్తి ఆలయ పాలక మండల సభ్యుల జాబితా 2025
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ దేవాలయాలైన శ్రీశైలం మరియు శ్రీకాళహస్తి ఆలయాలకు పాలక మండల నియామకం దాదాపు ఖరారు అయినట్టే కనిపిస్తూ ఉంది. ఆ అంశాలలో భాగంగానే శ్రీకాళహస్తిలో ఈ సారి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో భాగంగా అనూహ్యంగా ధర్మకర్తల పాలకమండలి అధ్యక్షులుగా జనసేనకు సంబంధించిన కొట్టే సాయిని ఎంపిక చేసినట్టు, రాష్ట్ర జనసేన పార్టీ అధిష్టానం నుంచి అధికారికంగా వచ్చిన విషయం అందరికీ విదితమే, కనుక అప్పటినుండి మిగిలిన పాలక మండల సభ్యులలో ఎవరెవరికి అవకాశం వస్తుందో అని ఆశావాహులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూడడం జరుగుతోంది. ఎట్టకేలకు ప్రభుత్వం నుండి చాలా ఉత్కంఠల మధ్య ఈ జాబితాని వెలువరించడం జరిగినది.
శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యుల వివరాలు
- బీలా స్రవంతి - యలమంచిలి నియోజకవర్గ (TDP)
- చిన్నపోల్ల లక్ష్మీనారాయణ - పుట్టపర్తి నియోజకవర్గం (TDP)
- డి.లక్ష్మమ్మ - శ్రీకాళహస్తి నియోజకవర్గం (TDP)
- జి.గోపినాథ్ - శ్రీకాళహస్తి నియోజకవర్గం (TDP)
- కె.కుసుమకుమారి - ఒంగోలు నియోజక వర్గం (TDP)
- కొమ్మును బోయిన రజిని - చీరాల నియోజకవర్గం (TDP)
- కొప్పెర్ల నాగరాజు - చింతలపూడి నియోజకవర్గం - (TDP)
- పెనగలూరు హేమావతి - కడప (TDP)
- కొమ్మరి విజయమ్మ - నెల్లూరు సిటీ (TDP)
- రుద్రాక్షల కౌసల్యమ్మ - వెంకటగిరి నియోజకవర్గం - టిడిపి
- దండి రాఘవయ్య - శ్రీకాళహస్తి నియోజకవర్గం - జనసేన పార్టీ
- పగడాల మురళి - తిరుపతి నియోజకవర్గం - జనసేన పార్టీ
- వి.గుర్రప్ప శెట్టి - శ్రీకాళహస్తి నియోజకవర్గం - టీడీపీ
- కోలా వైశాలి - శ్రీకాళహస్తి నియోజకవర్గం - బిజెపి పార్టీ
- కళ్ళ సావిత్రి - రాజంపేట నియోజకవర్గం - టిడిపి
- ప్రకాష్ రెడ్డి - తెలంగాణ రాష్ట్రం
ప్రత్యేక ఆహ్వానితులుగా
- చగణం శైలజ - శ్రీకాళహస్తి నియోజకవర్గం - బిజెపి పార్టీ
శ్రీశైలం దేవస్థానం ఆలయ పాలకమండలి సభ్యుల యొక్క వివరాలు ఈ క్రింది PDF లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకుని చూడగలరు
0 Comments