Header Ads Widget

AP RTE 12(1)(C) Admissions 2026-27: ప్రైవేట్ స్కూల్స్‌లో 25% ఉచిత సీట్లు – పూర్తి వివరాలు

AP RTE 12(1)(C) Admissions 2026-27: ప్రైవేట్ స్కూల్స్‌లో 25% ఉచిత సీట్లు – పూర్తి వివరాలు

RTE AP  AP RTE 2026  Free School Admission  RTE 12(1)(C)  Andhra Pradesh Education  Private School Free Seats  RTE Online Apply  AP Education News  RTE Eligibility  Government Schemes AP



AP RTE Admissions 2026 - ఆంధ్రప్రదేశ్ నందు విద్యాహక్కు చట్టం 2009 అనుసరించి సెక్షన్ 12(1) C ప్రకారం ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలో 2026 - 27 విద్యా సంవత్సరానికి గాను ఒకటవ తరగతిలో ప్రవేశానికి 25 శాతం సీట్లు చితంగా ఇవ్వడానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కనుక ఈ పేజీలో చాలా అంశాలు వివరంగా ఇవ్వడం జరిగినది. ఈ పేజిని పూర్తిగా చదివినచో ఎలాంటి సందేహం అనేది మీకు రాదు అని నేను భరోసా కల్పిస్తున్నారు.


ప్రధానాంశాలు - AP RTE Admissions 2026

  • ఉచిత విద్యకి ఎవరు అర్హులు ?
  • ఈ ఉచిత విద్యకి ఏయే తరగతి వారు అర్హులు ?
  • ఈ ఉచిత విద్యకి వయసెంత ఉండాలి ?
  • ఉచిత విద్యకి కుటుంబ వార్షికాదాయం ఎంత ఉండాలి ?
  • ఈ ఉచిత విద్యకి ఏయే పాఠశాలలో అవకాశం కలదు ?
  • ఈ ఉచిత విద్యకి సంబంధించి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ?
  • దరఖాస్తుకి ముఖ్య తేదీలు ?
  • ఎంపిక అయ్యామా / లేదా అని ఎలా తెలుసుకోవాలి ?
  • ఎంపిక అయిన వారు ఎప్పటిలోపు పాఠశాలలో ప్రవేశాలు చేసుకోవాలి ?
  • ఉచిత విద్యకు సంబంధించి చిరునామా ధ్రువీకరణ ఏం కావాలి ?
  • దరఖాస్తు చేసేటప్పుడు ఏయే పత్రాలు కావాలి ?
  • దరఖాస్తును ఏ విధంగా చేసుకోవాలి ?
  • సందేహాలకు ఎవరిని సంప్రదించాలి?
  • Online Apply Demo Video



ఉచిత విద్యకి ఎవరు అర్హులు - AP RTE Admissions 2026 ?

  1. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు అంటే అనాధలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ వర్గాలు
  2. ఆర్థికంగా వెనకబడిన వర్గాలు అందులో మైనార్టీలు బీసీలు ఓసీలు కూడా ఉండవచ్చు.


ఈ ఉచిత విద్యకి ఏ తరగతి వారు అర్హులు - RTE Eligibility in AP 2026?

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశం ఒకటవ తరగతిలో ప్రవేశాల పిల్లలు మాత్రమే అర్హులవుతారు.

ఈ ఉచిత విద్యకి వయసెంత ఉండాలి -Age Limit for RTE AP ?

ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య ప్రవేశాల పొందాలంటే వయసును రెండు రకాలుగా వర్గీకరించారు. అందులో

1) CBSE/ICSE/ స్థలబస్ అనుసరిస్తుని పాఠశాలల కొరకు: 2 ఏప్రిల్ 2020 నుండి 31 మార్చి 2021 మధ్య 5 సంవత్సరాలు నిండి ఉండాలి.

2) State సిలబస్ అనుసరిస్తునన్న పాఠశాలల కొరకు: 2 జూన్ 2020 నుండి 31 మే 2021 మధ్య జన్మించి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి.


ఉచిత విద్యకి కుటుంబ వార్షికాదాయం ఎంత ఉండాలి ?


  • గ్రామీణ ప్రాంతాల వారికి సంవత్సరానికి వారి కుటుంబ దాయం రూ. 120,000/- మించకూడదు.
  • పట్టణ ప్రాంతాల వారికి సంవత్సరానికి వారి కుటుంబ దాయం రూ 1,44,000/- మంచరాదు


ఈ ఉచిత విద్యకి ఏయే పాఠశాలలో అవకాశం కలదు?


అన్నీ ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలో ఒకటో తరగతి ప్రవేశాలకు 25% సీట్లుకు అవకాశం కలదు.


ఈ ఉచిత విద్యకి సంబంధించి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ?


మీ దగ్గరలోని సచివాలయంలో గాని లేదా మీసేవలో గాని లేదా మండల విద్యా శాఖలో లేదా ఇంటర్నెట్లో గాని లేదా ఆన్లైన్లో మీరే కూడా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.


    How to Apply RTE AP Online - Cell - 9700565505

    దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ - Click Here

    అధికారిక ప్రభుత్వ జీవో PDF - Download


    RTE AP  AP RTE 2026  Free School Admission  RTE 12(1)(C)  Andhra Pradesh Education  Private School Free Seats  RTE Online Apply  AP Education News  RTE Eligibility  Government Schemes AP




దరఖాస్తుకి ముఖ్య తేదీలు - Important Dates RTE AP ?


ఆన్లైన్ లో దరఖాస్తుకు మొదటి - చివరి తేదీలు 20-02-2026 to 10-03-2026
మొదటి లాటరీ ఫలితాల తేదీ - 25-03-2026


ఎంపిక అయ్యామా / లేదా అని ఎలా తెలుసుకోవాలి ?

    ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు మీరు హౌస్ మ్యాపింగ్ అయినా సచివాలయ పరిధి నుంచి ఒక కిలోమీటర్ లో పడి ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల జాబితా వస్తుంది. దాని ప్రకారం మీ ప్రాధాన్యతను బట్టి పాఠశాలను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత లాటరీ పద్ధతి నిర్వహిస్తారు. ఈ జాబితాలో పేర్లు తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి కూడా ఏ పాఠశాలకు ఎంపికైనట్టు సమాచారం వస్తుంది .

ఎంపిక అయిన వారు ఎప్పటిలోపు పాఠశాలలో ప్రవేశాలు చేసుకోవాలి ?

    మొదటి దఫాలో లాటరీ జాబితాలో మీరు ఎంపిక అయినో అయినచో13-04-2026 నుండి 23-04-2026 లోపల ప్రవేశాలు పొందాలి.


    ఉచిత విద్యకు సంబంధించి చిరునామా ధ్రువీకరణ ఏం కావాలి ?

    ఓటరు గుర్తింపు కార్డు /రైస్ కార్డు/ పాస్పోర్ట్/ భూమి హక్కు పత్రం/ ఉపాధి హామీ జాబ్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్ /విద్యుత్ బిల్లు / ఇంటి అద్దె ఒప్పంద పత్రం


దరఖాస్తు చేసేటప్పుడు ఏయే పత్రాలు కావాలి ?


    1. మొదట విద్యార్థి ఆధార్ / తల్లిదండ్రుల ఆధార్ / సంరక్షకులు ఆధార్..ఏదైనా ఒకదానితో రిజిస్టర్ కావచ్చు.
    2. . విద్యార్థి యొక్క జనన ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉండాలి.
    3. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో హౌస్ మ్యాపింగ్ అయి ఉండి, అదే చిరునామాలో ఉన్నవారు ఎటువంటి ఇవ్వాల్సిన అవసరం లేదు.



సందేహాలకు ఎవరిని సంప్రదించాలి?

ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత విద్య ప్రదేశాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నచో ముందస్తుగా మీ మండల విద్యాశాఖ అధికారికి తెలియజేయవచ్చును.మరియు హెల్ప్ లైన్ నంబర్:1800-4258-599 కి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు మధ్య సంప్రదించవచ్చును.


Online Apply Demo Video




Related Links






Post a Comment

0 Comments