TDP నేత, మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు
మాజీ మున్సిపల్ శాఖ మంత్రి మరియు నారాయణ విద్యా సంస్థల అధినేత అయిన నారాయణ గారికి ఎట్టకేలకు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు.న్యాయమూర్తి సులోచన గారు ఒక లక్ష రూపాయల పూచీకత్తుతో 10 వతరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నిన్న అరెస్ట్ అవడం ఈ రోజు బెయిల్ కూడా మంజూరు అవడం జరిగింది.కావున ఈ రోజు విడుదల అయ్యే అవకాశం ఉంది.
చంద్రబాబు మాట్లాడిన మాటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
మాజీ మంత్రి మరియు టీడీపీ నేత అయినా నారాయణ గారి కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అయినా అమిత్ షా గారికి టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ వ్రాశారు.నారాయణ అరెస్ట్ అనేది రాజకీయ కక్షలు సాధింపు లో బాగంగానే జరిగింది అని ఆ లేఖలో ప్రముఖంగా చెప్పడం జరిగింది.ఆయన అరెస్ట్ లో జరిగిన పరస్థుతులు వెనుక కూడా ఏదో దురుదేశ్యం ఉందని కూడా చంద్రబాబు నాయుడు గారు ఫైర్ అయ్యారు. దీంతో ఇదే విషయాల పై ఇంతకు మునుపు రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ లో అప్పట్లో జరిపిన ఉదంతాన్ని కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది.
0 Comments