అమ్మఒడి డబ్బులు విడుదల తేదీ ఖరారు చేసిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం
ఈ పీజీలో ప్రధానంగా చెప్పబడిన అంశాలు
- అమ్మఒడి పథకం లో డబ్బులు జమ తేదీ ఖరారు
- అమ్మఒడి సొమ్ము అందాలంటే ఈ 4 అంశాలు ఖచ్చితంగా ఉండాలి
- అమ్మఒడి పై జరుగుతున్న 5 తప్పుడు ప్రచారాలు
అమ్మఒడి : అమ్మఒడి కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం మనకందరికీ తెలిసిన విధంగానే ఎ తల్లి అయితే బడులు మాన్పించకుండా, పనులకు పంపించకుండా సక్రమంగా స్కూల్ కి పంపిస్తుందో ఆ తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో ఒక సంవత్సరానికి 15 వేలు ఉచితంగా వేయనున్నారు. కాబట్టి సక్రమంగా స్కూల్ కి వెళ్లిన వారికి అనే విషయాన్ని మాత్రం మర్చి పోవద్దంది.
ఆంధ్ర ప్రదేశ్ నందు నిన్న అంటే 12-5-2022 న కేబినెట్ మీటింగ్ జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలలో ఈ అమ్మఒడి కార్యక్రమం గురించి, విద్యార్థులు యొక్క తల్లి ఖాతాలో డబ్బులు వేయడానికి తేదీని ఖరారు చేసారు.ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 10 వేల కోట్లు వరకు ఖర్చు అవుతాయి.
అమ్మఒడి విడుదల తేదీ : జూన్ 21,2022
అమ్మఒడి పధకం లో ఈ సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలంటే ఈ క్రింద వాటిని మాత్రం మర్చి పోవద్దండి.
1. విద్యార్థి మరియు తల్లి కి eKYC అయి ఉండాలి
2. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధారీ లింక్ అయి ఉండాలి.ఆధార్ లింక్ అంటే NPCI లింక్ అయి ఉండాలి.
గమనిక : చాలా మంది తల్లులు మాకు గత సంవత్సరం మేము ఇచ్చిన బ్యాంక్ ఖాతాలలో అమౌంట్ జమ చేయడం జరిగింది కదా, అదే సరిపోతుంది అని అనుకుంటూ వుంటారు.ఇది అక్షరాల పొరపాటు. మొదట మీరు చేయాల్సింది ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార కార్డ్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో ఆ బ్యాంక్ పేరు చూపిస్తుంది. కాబట్టి ఆ బ్యాంక్ నే స్కూల్ లో ఇచ్చి అప్డేట్ చేసుకోవాలి.
మీ ఆధార్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో ఈ లింక్ ద్వారా తెలుసుకోండి
ఒకవేళ NPCI లింక్ ఉన్న అకౌంట్ ఇప్పడు వాడడం లేదు.అయినా ఆన్లైన్ లో చెక్ చేస్తే పాత అకౌంట్ కే లింక్ చూపిస్తుంది.ఇప్పుడు ఏమి చేయాలంటే..పాత అకౌంట్ ఉన్న బ్యాంక్ దగ్గరకు వెళ్లి అక్కడ NPCI కి ఉన్న ఆధార్ లింక్ కి తొలగించమని చెప్పి, ఇప్పుడు ఆక్టివ్ గా ఉన్న బ్యాంక్ లో మళ్లీ NPCI కి లింక్ చేయించండి.ఇది మాత్రం చాలా ముఖ్యం.
3. తల్లి, మరియు పిల్లలు ఒకే కుటుంభంగా వాలంటీర్ యొక్క హౌస్ మాపింగ్ లో మరియు రైస్ కార్ద్ లొ కూడ వుండాలి
4. విద్యార్థికి స్కూల్ నందు 75% హాజరు ఉంటేనే ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తుంది.అనే విషయాన్ని మాత్రం ఎక్కడా, ఎప్పుడూ మరచిపోవద్దండి
అమ్మఒడి పై జరుగుతున్న ఈ 5 తప్పుడు ప్రచారాలు.కాబట్టి ఈ క్రింది వీడియో లో చెప్పిన విధంగా నిజాలు తెలుసుకుని నిశ్చిoతంగా వుండండి.
మరిన్ని ప్రభుత్వ పథకాల పై ఉన్న సందేహాలకు, మరియు జాబ్ నోటిఫికేషన్లు కొరకు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు
WATSAPP GROUP LINK : CLICK HERE
0 Comments