Header Ads Widget

మీ వ్యవసాయ భూమి వివరాలు ఎటువంటి లాగిన్స్ లేకుండా మీ ఫోన్ లో చెక్ చేసుకోండి.

 మీ వ్యవసాయ భూమి వివరాలు మీ ఫోన్ లో చెక్ చేసుకోండి.

land records


ఈ పేజీ నందు ప్రధానంగా  ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా కి సంబంధించిన ప్రజలు మరియు పట్టదారులు తమ యొక్క భూమి వివరాలకు ప్రభుత్వ రికార్డులలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అందరూ తప్పకుండా చెక్ చేసుకోవలెను.


       ఈ ఆన్లైన్ లో ఉన్న భూమి యొక్క వివరాలలో అంటే అడంగల్ లో గానీ లేదా 1B లో గానీ ఏమైనా తప్పుగా ఉంటే ఖచ్చితంగా మీ మండల ఆఫీస్ లో కలసి సరిచేసుకుంటారని,మరియు రైతులకు తద్వారా మరింత మేలు కలుగుతుందని ఉద్ద్యేశ్యం తో ఈ అవగాహన చేస్తున్నాను.


     ప్రధానంగా రెండూ తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా కొన్ని సేవలు ఆఫీస్ ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మనమే దరఖాస్తు చేసుకోవడం, మరియు వాటి పెట్టిన అప్లికేషన్ యొక్క పురోగతిని తెలుసుకోవడం లాంటివి మరియు మన భూమి యొక్క వివరాలు తెలియజేసే కొన్ని సర్వీసు లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది


1)ఆంధ్ర ప్రదేశ్

2) తెలంగాణా


 మీ భూమి వివరాలు ప్రభుత్వ రికార్డులలో ఎలా ఉన్నాయో తెలుసుకోండి


   ఒక సిటిజెన్ రెవెన్యూ రికార్డులలో ఏయే వివరాలు మండల ఆఫీస్ కి వెల్లనవసరం లేకుండా తన మొబైల్ లొనే చేసుకోవచ్చు

 ఒక పట్టాదారు యొక్క భూమి వివరాలు రెవెన్యూ రికార్డులలో చెక్ చేసుకోవడం మరియు సిటిజన్ మండల ఆఫీస్ కి కూడా వెల్లనవసరం లేకుండా తన మొబైల్ లొనే ఎలాంటి సర్వీసులును పొందవచ్చు


ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అవకాశాలు


  • మీ భూమికి మీరే ఆధార్ లింక్ చేసుకోవచ్చు
  • మీ ఆడంగల్ ని చెక్ చేసుకోవచ్చు
  • గ్రామ ఆడంగల్ ని కూడా చెక్ చేసుకోవచ్చు
  • 1B లోని వివరాలు చెక్ చేసుకోవచ్చు
  • FMB
  • మీ భూమి కి మార్కెట్ విలువ ఎంత ఉంది
  • భూమి వివరాలు పై ఆన్లైన్ లో ఫిర్యాదు చేసుకోవచ్చు
  • ఎలక్ట్రానిక్ పుస్తకం
  • కోర్టు వివాదంలో ఉన్న భూముల వివరాలు

 తెలంగాణ లో ఉన్న అవకాశాలు


  1. మీ భూమి వివరాలు తెలుసుకోవచ్చు
  2. మీ భూమి యొక్క మార్కెట్ విలువ ఎంత ఉందొ తెలుసుకోవచ్చు
  3. మ్యూటేషన్ కి అప్లై చేసుకోవచ్చు
  4. భూమి విభజన కోసం అప్లై చేసుకోవచ్చు
  5. నల్లా కొరకు అప్లై చేసుకోవచ్చును..ఇలా చాలా సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి
  6.  ఇప్పుడు మనం ఈ పేజీ నందు మొదటగా ఈ క్రింది వివరాలు ఎలా మన ఫోన్ లొనే ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం

 ఆంధ్ర ప్రదేశ్ లో భూమి వివరాలు తెలుసుకుందాం


ముందుగా అడంగల్ లో వివరాలు చూద్దాం


అడంగల్ వెబ్సైట్ లింక్ : CLICK HERE


పై లింక్ పై క్లిక్ చేస్తే మీ భూమి వివరాలు తెలుసుకోవచ్చు.అదేవిధంగా మీ గ్రామ ఆడంగల్ లో ఆప్షన్ నందు అయితే ఎవరి భూమి వివరాలు అయినా ఇట్టే తెలుసుకోవచ్చు.


STEP 1 : మీ ఆడంగల్ ఆప్షన్ ఎంచుకున్నాక ఈ క్రింది లో ఉన్న వివరాలు ఒక్కటి వున్నా రికార్డులు చూసుకోవచ్చును.


  •  సర్వే నెంబర్
  • ఖాతా నెంబర్
  • ఆధార్ నెంబర్
  • ఆటో మ్యూటేషన్ వివరాలు తో...ఇలా ఏ ఒక్కటి ఉన్న కూడా భూమి వివరాలు తెలుసుకోవచ్చును.కాబట్టి ఏదో ఒకదానిపై సెలెక్ట్ చేసుకోవాలి.



adangal



STEP 2 : పైన ఎంచుకున్న ఆప్షన్ కు దగ్గట్టుగా కొన్ని వివరాలు ఇచ్చాక చివరన క్లిక్ చేయాలి.అక్కడ ఈ క్రింది విధంగా ఆ భూమి ఎవరిపేరు మీద వుందో చాలా సులభంగా తెలుసుకోవచ్చును


adandal download



1B : ఈ 1బి కావాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.


 1B లింక్ : CLICK HERE


STEP 1 : పై లింక్ క్లిక్ చేసాకా ఈ క్రింది వివరాలలో ఏదేని ఒక్క వివరంతో మీభూమి ప్రస్తుతం ప్రభుత్వ రికార్డలలో ఏ విధంగా వుందో తెలుసుకోవచ్చును.


1 సర్వే నెంబర్

2.ఖాతా నెంబర్

3.ఆధార్ నెంబర్

4.ఆటో మ్యూటేషన్ వివరాలు

5. పట్టదారుని పేరుతో కూడా


1b



STEP 2 : పై వివరాలలో ఏదైనా ఒకదానిని సెలెక్ట్ చేసుకొని తగిన వివరాలు ఇచ్చాక ఈ క్రింది విధంగా వాళ్ళ భూమి కి సంబంధించిన వివరాలు వస్తాయి.


1b


గమనిక : ఈ వివరాలు ఒక సిటిజెన్ స్వంతoగా తన మొబైల్ లొనే ఎటువంటి లాగిన్ లేకుండా చూసుకోవచ్చు.కానీ దేనికైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ లాగా పెట్టాలి అంటే మాత్రం,మీ సేవలో గానీ, లేదా సచివాలయంలో గానీ అప్లై చేరుకున్నది మాత్రమే చెల్లుబాటు అవుతుంది.


గమనిక 2: ఈ విధంగా ప్రభుత్వ రికార్డ్ లలో ఉన్న వివరాలు ఏదైనా తప్పులు ఉంటే సచివాలయం నందు VRO వుంటారు.అక్కడ కలసి సరిచేసుకోండి. లేదంటే భవిష్యత్ లో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.


తెలంగాణా లో భూమి వివరాలు తెలుసుకుందాం


      తెలంగాణ రాష్ట్రం నందు ఈ భూమి యొక్క వివరాలును ఈ మధ్య కాలంలో  ధరణి అనే పోర్టల్ నందు మొత్తాన్ని ఆన్లైన్ చేయడం జరిగింది.ఇక్కడ కూడా చాలా సులభంగా ప్రతి పట్టడారుడు కూడా ఎటువంటి లాగిన్స్ లేకుండా తన భూమి వివరాలు,లేదా ఊర్లో ఎవరిదైనా వివరాలు చేసుకోవచ్చును మరియు ఆ భూమికి ప్రభుత్వ రికార్డ్ ల ప్రకారం ఎంత మార్కెట్ విలువ ఉందొ కూడ ఇట్టే తెలుసుకోవచ్చును.


Website Link : CLICK HERE


ఈ రికార్డ్స్ తెలుసుకోవాలంటే కావలసిన పట్టదారుని వివరాలు


1) సర్వే నెంబర్ లేదా సబ్ డివిజన్ నెంబర్

2) పట్టాదారుని పాస్ పుస్తకం

3) ఖాతా నంబర్


పై వాటిలో ఏదో ఒక్క వివరాలు ఇచ్చిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.


Ts land records



STEP 2: ఇక్కడ పట్టదారుని వివరాలు ఇచ్చిన తర్వాత ఈ క్రింది విధంగా భూమి యొక్క వివరాలు మరియు, ఆ భూమికి మార్కెట్ విలువ ఎంత వుందో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చును.





 Conclusion : ప్రస్తుతం ఈ పేజీ నందు కొన్ని వివరాలను ఎలా మనమే ఆఫీస్ లకు వెల్లకుండా తెలుసువచ్చు అని చెప్పుకున్నాము.మీకు ఇదే కాకుండా ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే పేజీ చివరన కామెంట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుండి నాకు కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే తప్పకుండా మరో పేజీ ద్వారా తెలియజేస్తాను.


JOIN WATSAPP GROUP LINK 





   Thank You

Post a Comment

0 Comments