![]() |
ఆధార్ నంబర్ ని తెలుసుకోవడం ఎలా ..? |
ఆధార్ కార్డ్ : ఇప్పుడు ఉన్న పరస్థితులో ఆధార్ కార్డ్ యొక్క ప్రాముఖ్యత ఎంత సంతరించుకుందో మనకందరికి తెలిసిన విషయమే.కాబట్టి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మనది కానీ మన కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ నంబర్లు కానీ అవసరం అవుతూవుంటాయి.అలాంటప్పుడు ఒక్కోసారి మనం బయట ఎక్కడికైనా వెళ్ళినపుడు ఈ పద్దతి ఉపయోగపడుతుంది.
ఇప్పుడు మనము చెప్పబోయే పద్దతి ద్వారా ఎటువంటి లాగిన్ లేకుండా ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి పూర్తి ఆధార్ నెంబర్ అనేది మనకు మెస్సేజ్ రూపం లో రావడం జరుగుతుంది.ఈ విధంగా రావాలంటే ఈ క్రింది అంశాలు మాత్రం గుర్తుంచుకోండి.
1. ఆధార్ కార్డ్ లో ఉన్న పేరు విధంగానే ఎంటర్ చేయాల్సివుంటుంది.
2.ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి
మరిన్ని నూతన అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయి పొందగలరు.
![]() |
watsapp |
ఇప్పుడు ఆధార్ నెంబర్ ని కనుక్కొనే ప్రయత్నం చేద్దాం.
![]() |
Know You Adhaar |
STEP 1: పై లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధమైన పేజీ వస్తుంది. ఇందులో మొదట మీకు ఆధార్ నెంబర్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా..లేదా ఎన్రోల్మెంట్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది.అందులో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆ తరువాత ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చి OTP కి పెట్టాల్సివుంటుంది.
STEP 2: ఈ పేజీ నందు ఆధార్ నెంబర్ కి ఒక OTP నెంబర్ వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సివుంటుంది.
గమనిక : ఒక్కోసారి ఎర్రర్ పేజీ వస్తూవుంటుంది.కానీ మళ్లీ మళ్లీ TRY చేస్తూ ఉంటే ఓపెన్ అవడం జరుగుతుంది.
STEP 3 : ఈ పేజీ నందు మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీ ఆధార్ నెంబర్ ని పంపించినట్టు ఇక్కడ వస్తుంది.
STEP 4 : ఇక్కడ మన మొబైల్ కి ఈ క్రింది విధంగా మన ఆధార్ నెంబర్ పూర్తిగా రావడం అయితే జరుగుతుంది.
ఈ విధముగా అత్యవసర సమయాల్లో ఎవరి ఆధార్ నెంబర్ అయినా తెలుసుకోవచ్చును. ఈ సమాచారాన్ని అందరికి షేర్ చేసుకోగలరని ఆశిస్తూ....
మీ
Munirathnam
0 Comments