Header Ads Widget

నారా రోహిత్ దంపతులకు స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ కొట్టేసాయి

నారా రోహిత్ దంపతులకు స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ కొట్టేసాయి   

      

MR News Telugu

- రిపోర్టర్ - మునిరత్నం

       దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని పుణ్యక్షేత్రానికి సినీ నటుడు, నారా చంద్రబాబు నాయుడు తమ్ముని కుమారుడు, మరియు సినీనటుడు అయిన నారా రోహిత్ సతీ సమేతంగా ఆలయానికి దర్శనార్థం విచ్చేయడం జరిగినది. ఆ నూతన వధూవరులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆలయ అతిథి గృహం వద్ద, ఆత్మీయ స్వాగతం పలకడం జరిగినది. శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి, ఆలయం నందు శాస్త్రోత్రికంగా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. వేదఆశీర్వచనం అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టె సాయి మరియు ఆలయ అధికారులు వారికి స్వామి_అమ్మవార్ల చిత్రపటాలు మరియు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, పాలక మండల సభ్యులు గోపీనాథ్,గుర్రప్ప శెట్టి మరియు టిడిపి నాయకులు కాసరం రమేష్, జనసేన నాయకులు మాధవ్ మహేష్, కుమార్, జయకృష్ణ మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments