ఇస్రో చైర్మన్ కి స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టేసాయి
MR News Telugu
మునిరత్నం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈరోజు భారతదేశ గౌరవప్రద శాస్త్రవేత్త, ప్రస్తుత ఇస్రో చైర్మన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్, క్రయోజెనిక్ ఇంజనీర్ డాక్టర్ వి.నారాయణన్, శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం విచ్చేశారు. వారిని శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి ప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు.
ఆలయ ఆచార సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు.. దర్శనం అనంతరం కొట్టే సాయి ఆధ్వర్యంలో వేదపండితులు వేద మంత్రాలతో విశిష్టంగా ఆశీర్వచనాలు అందించారు.ఈ సందర్భంగా కొట్టే సాయి స్వయంగా వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేస్తూ,శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దివ్య కృపతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. దేవస్థాన అభివృద్ధి, సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతను డాక్టర్ నారాయణన్ ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ తో పాటు ధర్మకర్తల పాలక మండలి సభ్యుడు అయిన గుర్రప్ప శెట్టి, దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



0 Comments