ఈ రోజు ఈ పేజీ నందు "జగనన్నే మా భవిష్యత్" అనే కార్యక్రమం యొక్క విధి,విధానాలు మరియు అధికారకంగా సచివాలయ కన్వీనర్లు,గృహ సారథులు మరియు గ్రామ/వార్డ్ వాలంటీర్స్ యొక్క బాధ్యతలు గురించి వివరంగా విశ్లేషించుకుందాం.
1) ఈ కార్యక్రమం నేపధ్యం
2) గృహ సారథులు మరియు వాలంటీర్స్ యొక్క విధులు
ఈ కార్యక్రమం నేపధ్యం: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 2019 కి ముందు ఎన్నికల ప్రచారంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన 4 సంవత్సరాలలోనే 98% అమలు చేయడమే కాకుండా దేశంలోనే మొట్ట మొదట సారి సంక్షేమ పథకాల రూపంలో 1 కోటి 80 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత అకౌంట్ లలోకి DBT (Direct Benefit Transfer) సిస్టం ద్వారా ఇప్పటివరకు 2 లక్షల కోట్ల రూపాయలను డైరెక్ట్ గా మధ్యవర్తిత్వం లేకుండా లంచాలకు తావులేకుండా వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లలో జమ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సంక్షేమం గురించి ప్రజల దగ్గర నుంచి YSRC పార్టీ కన్వీనర్లు మరియు గృహ సారథులు ద్వారా అభిప్రాయాలు సేకరించడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమమే ఈ "జగనన్నే మా భవిష్యత్".
ఈ కార్యక్రమం ఏప్రిల్ 7 వ తేదీ నుండి 20 వతేదీ వరకు 14 రోజుల పాటు జరిగే విధంగా డిజైన్ చేయడం జరిగింది.
సచివాలయ కన్వీనర్లు :
2024 లో జగగబోవు ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నేపద్యంలో సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అక్కడ ముగ్గురు కన్వీనర్లు ని నియమించడం జరిగింది.అందులో ఇద్దరు పురుషులు,ఒక మహిళ ఉండేటట్లు ఈ విధంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మందిని నియమించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నారు.
గృహ సారథులు: ఈ గృహ సారధులని ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున అందులో ఒక మహిళ,ఒక పురుషుడు వుండేట్లు చూసుకున్నారు.ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 లక్షల మందిని గృహ సారధులుగా నియమించడం జరిగింది.
ఈ "జగనన్న మా భవిష్యత్" అనే కార్యక్రమానికి సంబంధించి పార్టీ నుండి అధికారికంగా గృహ సారథులు కి మరియు వాలంటీర్లకు విధులు కేటాయించారు.దీనికి సంబంధించిన ఆఫీషల్ PDF పేజీ చివరన ఇచ్చాను,చెక్ చేసుకోండి.
ఈ కార్య క్రమం అమలు చేయు విధానము.
YSRC పార్టీ నుండి: సచివాలయ కన్వీనర్లు మరియు గృహ సారధులు.
ప్రభుత్వం నుండి: సచివాలయ వ్యవస్థలోని గ్రామ/వార్డు వాలంటీర్స్.
వాలంటీర్ విధులు: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాలంటీర్స్ కి సూచించిన విధులను తూ..చా తప్పకుండా పాటిస్తూ (ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడా చిన్న చిన్న తప్పిదాలు తప్ప) అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పార్టీలు,మతాలు,కులాలు,వర్గాలు అనే తారతమ్యాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 80 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చారు.ఈ లబ్ది పొందిన వారిలో అన్ని పార్టీల ప్రజలు మరియు సర్వ మతాలు,సర్వ కులాలు ఉన్నాయి.కానీ కొంతమంది వాలంటీర్స్ ని ఒక పార్టీకి సంబంధించిన వారు అని ప్రచారం చేస్తున్నారు.అలా అనుకుంటే ఒక పార్టీ ప్రజలకే ఈ సంక్షేమ పథకాలు అందేట్టు చేసేవాళ్ళు.కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలు ప్రకారం అందరికి లబ్ది చేకూర్చాము.కనుక ఈ విషయాన్ని విమర్శికులు ఎప్పుడూ గుర్తుపెట్టుకోగలరు.
ఇక పోతే పార్టీపరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను పూర్తి చేసినందులకు గానూ ఆ పార్టీ నుండి గృహ సారధులు ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాలు మరియు సమస్యలని సేకరించే క్రమంలో వాలంటీర్ తనకు కేటాయించిన ప్రతి ఇంటిని గృహ సారధులకి చూపించవలెను.మరియు అన్నీ కుటుంబాలు అయ్యే వరకు గృహ సారధులతో పాటు ఉండవలెను.
గృహ సారథులు విధులు: వీరిని ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు చొప్పున కేటాయించారు.వీరి విధులు ఈ క్రింది విధంగా ఉంటాయి.
1) వాలంటీర్ ఇళ్ళు చూపించిన తర్వాత గృహ సారథులు ఆ ప్రజలతో కనీసం 15 నిమిషాలు వాళ్ళతో గడుపుతూ.. అమ్మా..మేము జగనన్న పంపించిన గృహ సారధులం అని పరిచయ కార్యక్రమం చేపట్టాలి.
2) జగనన్న ఇచ్చిన హామీ ప్రకారం 98% హామీలను దేశంలో ఎవ్వరూ చేయని విధంగా నెరవేర్చాడు.అని చెబుతూ మీ కుటుంబానికి జగనన్న ద్వారా ఎంత లబ్ది చేకూరిందో పత్రంలో ఉన్న వివరాలను చదివి వినిపించి ఆ పేపర్ ని వాళ్లకు ఇవ్వాలి.
3) గత ప్రభుత్వం పాలన మరియు మన ప్రభుత్వ పాలన యొక్క వ్యత్యాసం గురించి Booklet లో చదివి వివరించాలి.
4) ప్రజా మద్దతు పుస్తకం లోని ప్రశ్నలను వివరిస్తూ వారి సమాధానాలను Tick ఇచ్చుకుంటూ అందులోనే వారి పేరు,మొబైల్ నెంబర్ ని కూడా వ్రాయాలి.
5) ఆ అడిగే ప్రశ్నలకు అవును అని సమాధానం అయితే కుడి వైపు ఉన్న పేపరు చింపి కుటుంబసభ్యులకు ఇవ్వాలి.ఇక అక్కడే వారి మొబైల్ నుండి 8296082960 మిస్సిడ్ కాల్ ఇవ్వమని కోరాలి.
6) ఆ ఇంటివారి అనుమతితో వారి ఫోన్ యొక్క వెనుక భాగంలో మరియు ఇంటి తలుపు పైన స్టిక్కర్ ని అంటించాలి.
7) ఆ ఇంటి వారి అనుమతితో తలుపు పై అంటించిన స్టిక్కర్ తో పాటు కుటుంబ సభ్యులు కనిపించేటట్టు ఫోటో తీసుకోవాలి.ఆ ఫొటోలను మండల JCS వాట్సాప్ గ్రూపునకు పంపించాలి.
8) ఆ ఇంటి వారికి నమస్కరించి సమయం ఇచ్చినందులకు ధన్యవాదాలు తెలియజేయాలి.
9) నింపి ఉన్న స్లిప్ లను భద్రపరచి JCS మండల ఇంచార్జి లకు తెలియజేయాలి.
10) గ్రామ /వార్డ్ వాలంటీర్లతో కలసి మీకు కేటాయించిన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రచారం సాగించాలి.
గ్రామ సారథులు విధుల PDF
0 Comments