Header Ads Widget

Grama volunteer awards list & Relese Date 2023

volunteer seva mitra list 2023 volunteer awards list 2023 volunteer awards list 2023 ap volunteers ugadi awards list 2023 ap volunteer seva ratna list 2023 grama ward volunteer awards list volunteer award 2023 wps volunteer awards 2023


18-05-2023 నాటికి నూతన వివరాలు ప్రకారం

 

ఈ పేజీ లో వివరించకోబోయే  ప్రధాన అంశాలు ఇవే..!

1) వాలంటీర్ అవార్డ్స్ రకాలు

2) ఎంపిక చేసిన విధానము-2023

3) అవార్డుల కార్యక్రమం ప్రారంభతేదీ

4) జిల్లాల వారీగా వాలంటీర్స్ అవార్డ్స్ యొక్క అర్హుల జాబితా





     ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు కుల,మత,వర్గ,పార్టీ అనే తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిచాలి అనే భావనతో ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలలోనే గ్రామ/వార్డ్ వాలంటీర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,60,000 మందిని నియమించడం జరిగింది.అందులో ప్రతి  ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని  రూ.5000 గౌరవ వేతనం  ఇచ్చి సేవా దృక్పథంతో పనిచేసేవారిని ఎంపిక చేసి వారి ద్వారా అర్హులను గుర్తించారు.

      ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఈ నాలుగు సంవత్సరాలలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం 98.44% శాతం అంటే  1కోటి 80 లక్షల కుటుంబాలకు వాలంటీర్స్ యొక్క సహకారంతో వివిధ పథకాల ద్వారా దాదాపు 2 లక్షల 96 వేల కోట్ల రూపాయలను డైరెక్ట్ గా వ్యక్తిగత అకౌంట్లలోకి DBT  సిస్టం ద్వారా జమ చేయడం జరిగింది.



 

వాలంటీర్ల అవార్డుల కార్యక్రమం ప్రారంభతేదీ

ఈ అవార్డుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఈ మే నెల 19 వ తెదీన కృష్ణా జిల్లాలోని విజయవాడ నందు ప్రారంభం చేస్తారు.ఆ తేదీ నుండి ఒక నెల పాటు ఆయా నియోజకవర్గాలలో శాసన సభ్యులు మీటింగ్ లు పెట్టి వాలంటీర్స్ ని సత్కరించనున్నారు.


అవార్డుల నేపథ్యం

      వాలంటీర్స్ అందరూ తక్కువ గౌరవ వేతనంతోనే ప్రజలకు సర్వీస్ చేస్తున్నామని,కుటుంభం గడవడం కష్టంగా ఉందని ప్రభుత్వానికి విన్నవించుకోగా దానికి ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహకాల రూపంలో రివార్డులు మరియు అవార్డులను ఇవ్వాలని భావించి 3 రకాలైన అవార్డ్స్ మరియు రివార్డులు ను ప్రకటించారు.అందులో 

వాలంటీర్స్ అవార్డుల రకాలు

1) సేవా వజ్ర అవార్డ్ -రూ 30,000

2) సేవా రత్న అవార్డ్ -రూ 20,000

3) సేవా మిత్ర అవార్డ్ -రూ10,000



1) సేవా వజ్ర అవార్డ్ 

ఈ అవార్డులను నియోజకవర్గ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 5 గురు వాలంటీర్లను ఎంపిక చేసి,అట్టి వారికి రివార్డు రూపంలో రూ.30,000 నగదు మరియు బ్యాడ్జీ,మెడల్,సర్టిఫికెట్, శాలువతో సత్కరిస్తారు.

ఈ 2023 సంవత్సదానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 875 మందికి ఇవ్వనున్నారు


2) సేవా రత్న అవార్డ్ 

ఈ సేవారత్న అవార్డు ని  మండలానికి మరియు  మున్సిపాలిటీ కి 5 గురు చొప్పున లేదా కార్పొరేషన్ పరిధిలో 10 గురు చొప్పున ఉత్తమ ప్రతిభ కనపరచిన వాలంటీర్స్ కి రివార్డు ల రూపంలో రూ.20,000 నగదు ఒక  బ్యాడ్జీ,మెడల్,సర్టిఫికేట్,శాలువుతో సత్కరించనున్నారు.

ఈ 2023 సంవత్సదానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 4,220 మందికి ఇవ్వనున్నారు


3) సేవా మిత్ర అవార్డ్

ఈ సేవా మిత్ర అవార్డ్ అనేది గొప్పగా ప్రతిభ కనపర్చకపోయినా 1 సంవత్సర కాలం పాటు పనిచేసి,ఆ వాలంటీర్ పై ఎటువంటి పిర్యాదు లేని వారికి నగదు ప్రోత్సాహకం 10 వేలు మరియు సర్టిఫికెట్,శాలువతో సత్కరించనున్నారు. 

ఈ 2023 సంవత్సదానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 2,28,624 మందికి ఇవ్వనున్నారు.


అవార్డులకు ఎంపిక ప్రక్రియ

    ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఎంపిక అనేది ఈ క్రింది విధంగా జరిగినట్లు తెలియజేశారు.


1) వాలంటీర్స్ యొక్క పనితీరు ఆధారంగా

2) వాలంటీర్ క్లస్టర్ ప్రజల యొక్క సంతృప్తి సమాచారం

3) వాలంటీర్లు గడప గడప కార్యక్రమంలో హాజరు బట్టి

4) YSR పెన్షన్ కానుకని మొదటిరోజే 100% పంపిణీ చేసిన వాలంటీర్స్ ని

5) క్లస్టర్ లో పథకాలకి సంబంధించిన లబ్ధిదారుల ని ఎంపిక చేయడం మరియు వాటికి సంబంధించిన సర్వేలు ఆధారంగా 



3) జిల్లాల వారీగా వాలంటీర్స్ అవార్డ్స్ యొక్క అర్హుల జాబితా

ప్రభుత్వం నుండి అధికారకంగా ప్రతి జిల్లాల యొక్క జాబితాని ఈ క్రింద LINK లో ఇవ్వడం జరుగుతుంది.

           


Post a Comment

0 Comments