సజ్జల రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన బియ్యపు మధుసూదన్ రెడ్డి
MR News Telugu:
రేణిగుంట రైల్వే స్టేషన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వయంగా పాల్గొని గౌరవ అతిథిని సన్మానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆహ్వానిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా పూలమాలలతో, నినాదాలతో స్వాగతం పలికారు. రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రాంగణం అంతా వైసీపీ కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది. జై జగన్ నినాదాలతో కార్యక్రమ స్థలమంతా మారుమోగింది.
0 Comments