ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కొట్టేసాయి
MR News Telugu:
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్‌లకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ కొట్టేసాయి వెళ్లి కలసి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అతిథులకు అందజేశారు. ఆ తరువాత మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నానన్నారు. అదే విధంగా ఆలయ అభివృద్ధికి, భక్తులకు మరింత సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని. స్వామివారి సేవ చేసే ఈ అవకాశాన్ని పుణ్యంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
0 Comments